Daily Current Affairs in Telugu 07-01-2021
భారతదేశానికి నూతన బ్రిటిష్ హై కమిషనర్ గా అలెగ్జాండర్ ఎల్లిస్ నియామక౦ :
అలెగ్జాండర్ ఎల్లిస్ ను భారతదేశానికి బ్రిటిష్ హై కమిషనర్‌గా ఇటీవల నియమితులయ్యారు. ఆయన కేబినెట్ కార్యాలయంలో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా, యూరోపియన్ యూనియన్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా మరియు. పోర్చుగల్‌లో బ్రిటిష్ రాయబారిగా అనేక పదవులను నిర్వహించారు. ఎల్లిస్ ఫిలిప్ బార్టన్ తరువాత ఆయన స్థానం లో నియమించబడ్డాడు.ఆగస్టు 2020 లో, UK లో కొత్తగా ఏర్పడిన విదేశీ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి కార్యాలయంలో బార్టన్ శాశ్వత అండర్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశానికి నూతన బ్రిటిష్ హై కమిషనర్ గా అలెగ్జాండర్ ఎల్లిస్ నియామక౦
ఎవరు: అలెగ్జాండర్ ఎల్లిస్
ఎప్పుడు: జనవరి 07
పురుషుల టెస్ట్ మ్యాచ్‌లో మొదటి మహిళా ఎంపైర్ నిలిచిన క్లైర్ పోలోసాక్ :
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఇటీవల జరిగిన మూడవ టెస్టులో నాల్గవ అంపైర్ పాత్రను చేపట్టిన ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పోలోసాక్ పురుషుల టెస్ట్ మ్యాచ్‌లో మొదటి మహిళా మ్యాచ్ ఆఫీసర్‌గా చేసిన మహిళా అవతరించింది.. న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన 32 ఏళ్ల ఈమె ఇప్పటికే ప్రత్యేకతను సంతరించుకుంది నమీబియా మరియు ఒమన్ మధ్య ఐసిసి డివిజన్ 2 లీగ్‌లో పురుషుల వన్డే మ్యాచ్‌లో తొలి మహిళ ఆన్-ఫీల్డ్ అంపైర్ 2019 లో విండ్‌హోక్‌లో చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పురుషుల టెస్ట్ మ్యాచ్‌లో మొదటి మహిళా ఎంపైర్ నిలిచిన క్లైర్ పోలోసాక్
ఎవరు: క్లైర్ పోలోసాక్
ఎప్పుడు: జనవరి 07
యుఎస్ అసోసియేషన్ అటార్నీ జనరల్ భారత సంతతి మహిళ వనిత గుప్తా ఎంపిక :
అమెరికా అసోసియేషన్ అటార్నీ జనరల్ గా వనితాగుప్తా ను అమెరికాకు కాబోయే అద్యక్షుడు గా జో బైడెన్ ఎంపిక చేసారు. అటార్నీ జనరల్ న్యాయ మూర్తి మెరిక్ గార్లాండ్ ను డిప్యుటీ అటార్నీ జనరల్ గా లీసా మొనాకో ను అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా క్రిస్టెన్ క్లార్క్ ను జనవరి 07న నామినేట్ చేసారు.ఈ నియామకం ను ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం లీడర్ షిప్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కు వనితా గుప్తా సియివో గా ప్రెసిడెంట్ గా ఉన్నారు. అమెరికా లోని ప్రముఖ పౌర హక్కుల న్యాయ వాదులలో ఆమె ఒకరు. అమెరికా లో న్యాయ విభాగంలో అత్యున్నత పదవిని అందుకోబోతున్న తొలి భారత సంతతి మహిళా గా వనిత నిలవనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎస్ అసోసియేషన్ అటార్నీ జనరల్ భారత సంతతి మహిళ వనిత గుప్తా ఎంపిక
ఎవరు: వనిత గుప్తా
ఎప్పుడు: జనవరి 07
అమెరికా తొలి సిఐవో గా భాద్యతలు చేపట్టిన భారతీయ అమెరికన్ రాజ్ అయ్యర్ :
భారతీయ అమెరికన్ డాక్టర్ రాజ్ అయ్యర్ అమెరికన్ ఆర్మీ తొలి ప్రధాన సమాచార అధికారి (సియివో గా బాద్యతలు చేపట్టారు. 2009 జులై లో కొత్తగా ఈ పదవిని ఏర్పాటు చేసిన తర్వాత బాద్యతలు చేపట్టిన వ్యక్తి గ ఆయన ఘనత సాధించారు. ఈయన తమిళనాడు లోని తిరుచిరాపల్లి కి చెందిన వ్యక్తి.ఈయన బెంగళూర్ లో పెరిగారు.తిరుచ్చి ఎన్ఐటి లో డిగ్రీ చేసిన తరువాత ఉన్నత చదువులకు అమెరికా కు వెళ్లారు. అమెరికా రక్షణ శాఖలో ఉన్నత ర్యాంకు భారతీయ అమెరికన్ సివిల్ అధికారులలో అయన ఒకరు. ఈ పదవిలో ఆయన అమెరికా సైనిక వ్యవహారాలు కార్యదర్శికి ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ ఐటి సంబంధిత వ్యవహారాల్లో ముఖ్య సలహా దారు (ప్రిన్సిపల్ అడ్వైజరీ)గా వ్యవహరిస్తారని పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది త్రీ స్టార్ జనరల్ హోదాకు సమానం. అమెరికా సైన్యం కు సంబందించిన ఐటి కార్యకలాపాలను కేటాయించిన 16 బిలియన్ డాలర్ల దాదాపు (రూ.1.17 లక్షల కోట్లు ) వార్షిక బడ్జెట్ ను ఆయన పర్యవేక్షిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా తొలి సిఐవో గా భాద్యతలు చేపట్టిన భారతీయ అమెరికన్ రాజ్ అయ్యర్
ఎవరు: రాజ్ అయ్యర్
ఎప్పుడు: జనవరి 07
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ లో ప్రపంచ కుబేరుడు గా నిలిచిన ఎలాన్ మస్క్ :
విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత అయిన ఎలాన్ మాస్క్ ఇపుడు ప్రపంచం లోనే మొత్తమ్మీద అందరి కన్నా ధనవంతుడు నిలిచారు. టెస్లా షేరు విలువ జనవరి 07న 4.8 శాతం పెరగడం ఇందుకు దోహదం చేసింది. 500 మంది కుబేరుల జాబితాలో బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం జనవరి 07 న ఎలాన్ మాస్క్ నికార్ సంపద 188.5 బిలియన్ డాలర్లు గా (దాదాపు రూ 14.13 లక్షల కోట్లు ) చేరింది. ఈ జాబితాలో అక్టోబర్ 2017 నుంచి అగ్రస్థానం లో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపద కంటే ఈ మొత్తం 1.5 బిలియన్ డాలర్లు ఎక్కువగా నిలిచింది. దీంతో స్పేస్ ఎక్స్ చీఫ్ ఎగ్సిక్యుటివ్ దక్షిణాఫ్రికా లో జన్మించిన ఎలన్ మాస్క్ కుబేరుల జాబితాలో అగ్రస్థానం లోకి చేరారు. ప్రపంచం చరిత్రలోనే అత్యంత వేగంగా ఇంతటి సంపద సృష్టించిన రికార్డు ఈయన సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ లో ప్రపంచ కుబేరుడు గా నిలిచిన ఎలాన్ మస్క్
ఎవరు: ఎలాన్ మాస్క్
ఎప్పుడు: జనవరి 07
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |