Daily Current Affairs in Telugu 07-11-2020
ప్రపంచ క్యాన్సర్ అవగాహనా దినోత్సవ౦ గా నవంబర్ 07:

ప్రపంచవ్యాప్తంగా మానవుల మరణాల ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటిగా ఉంది. అందువల్ల క్యాన్సర్ లక్షణాల గురించి తనను తాను తెలియజేసుకోవడం చాలా ముఖ్యం మరియు ముందస్తు సంరక్షణ ద్వారా నివారణ దానిని చక్కగా నివారించడం తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి సంవత్సరం నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. క్యాన్సర్ వ్యాప్తిని నివారించడంలో అవగాహనను వ్యాప్తి చేయడానికి మరియు ఏదైనా లక్షణాలను ప్రారంభంలో ఎలా గుర్తించవచ్చో ఈ రోజును అవగాహన్ దినంగా పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఉంది మరియు WHO ప్రకారం, 2018 లో ప్రతి 6 మరణాలలో 1 క్యాన్సర్ కారణంగా సంభవించింది.భారతదేశంలో క్యాన్సర్కు ప్రధాన కారణాలలో ఒకటి పొగాకు వినియోగం ప్రధాన కారణం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ క్యాన్సర్ అవగాహనా దినోత్సవ౦ గా నవంబర్ 07
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: నవంబర్ 07
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బై డెన్ :

ఇటీవల జరిగన అమెరికా అద్యక్ష ఎన్నికల్లో జో బైడే న్ విజయం సాధించాడు. సుదీర్గం ఓట్ల లెక్కింపు తరువాత నవంబర్ 07న చివరకి పెన్సిల్వేనియా,నేవదాలోను విజయం సాధించి అగ్ర రాజ్యానికి కాబోయే అద్యక్షునిగా అవతరించారు. అమెరికా అధ్యక్షునిగా 46 అధ్యక్షునిగా 77 ఏళ్ల జో బైడేన్ గద్దెనేక్కుతున్నారు. భారత్ సంతతికి చెందిన కమల హ్యారిస్ (56) అమెరికా దేశ ఉప అధ్యక్షురాలిగా బాద్యతలు చేపట్టబోతున్న తొలి మహిళా,శ్వేత జాతియేతరురాలు. అమెరికా చరిత్రలో ఇదో సరి కొత్త రికార్డు అరుదైన ఘనత పేర్కొనవచ్చు. జనవరి 20న తేదిన అమెరికా అధ్యక్షునిగా జోబైడేన్ ,ఉపద్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాద్యతలు చేపట్టబోతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్
ఎవరు: జో బైడెన్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: నవంబర్ 07
అత్యధిక సార్లు నంబర్ వన్ గా ఉన్నసంప్రాస్ రికార్డు ను సమ౦ చేసిన జకోవిచ్ :

అత్యదిక సార్లు నంబర్ వన్ గా ఏడాదిని ముగించిన ఆటగాడిగా టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును నోవాక్ జకోవిచ్ సమం చేసారు. తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడిగా రాఫెల్ నాదల్ వచ్చేవారం సోపియా ఈవెంట్నుంచి తప్పుకోవడంతో 2020ని అతడు అగ్రస్తానంతో ముగించడం ఖాయం అయింది. మొత్తంగా సంప్రాస్ లాగే అతడు ఆరు సార్లు “ఇయర్ ఎండ్ నంబర్ వన్” గా నిలిచారు. గతంలో 2011,2012,2014,2015,2017 లో జకోవిచ్ ఈ ఘనత సాధిచాడు. 33ఏళ్ల జకోవిచ్ ఇప్పటిదాకా 17గ్రాండ్ స్లాం టైటిల్స్ ను గెలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి:
ఎవరు: నవంబర్ 07
ఎక్కడ:
ఎప్పుడు: నవంబర్ 07
ఐరాస సలహా సంఘానికి ఎన్నికైన భారత దౌత్యవేత్త ;

ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో భారత్ మరో విజయం సాధించింది. జనరల్ అసెంబ్లీ అనుబంద సంస్థ అయిన అడ్వైసరి కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్,బడ్జెటరీ క్వశ్కన్స్ (ఏసిఏబిక్యు) సభ్యురాలిగా భారత దౌత్యవేత్త విదిశ మైత్ర ఎన్నికయ్యారు. 16మంది సబ్యులుండే ఈ సలహా సంఘానికి ఆసియా ఫసిఫిక్ దేశాల నుంచి ఇద్దరు పోటీ పడ్డారు. 193 సభ్య దేశాలున్నసభలో మైత్ర కు 126 ఓట్లు రాగా ఇరాక్ కి చెందినా అలీ మహమ్మద్ ఫయిక్ కు 64 ఓట్లు వచ్చాయి. బౌగోళిక ,ప్రాతినిత్యం సంబంధిత విభాగం లో అనుబవం, అర్హతలు తదితర అంశాల ప్రాతిపదికపై ఈఎన్నిక జరిగింది. వచ్చే ఏడాది జనవరి 1నుంచి మూడేళ్ళ పాటు ఈ కమిటీ లో మైత్ర సభ్యురాలిగా ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐరాస సలహా సంఘానికి ఎన్నికైన భారత దౌత్యవేత్త ;
ఎవరు: విదిశ మైత్ర
ఎక్కడ:ఐరాస
ఎప్పుడు: నవంబర్ 07
అమెరికాలో వైట్ హౌస్ సలహాదరురలిగా ప్రవాస భారతీయురాలు నియామకం :

అమరికా వైట్ హౌస్ సలహా దరురాలిగా పియా దండియా నియమితులయ్యరు. 2020-21 సంవత్సరానికి గాను నియమించిన 14మంది సలహా దారులలో దండియా ఒక్కరే ప్రవాస భారతీయురాలు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నపటికీ ఆమె విద్యార్థులు తప్పనిసరిగా పాతశాలకు హాజరు అవుతారని శ్వేత సౌధం ప్రశంసించింది. ప్రస్తుతం ఆమె అమెరికా విద్యా శాఖలో పని చేస్తున్నారు. 29వయుసులోనే న్యూయార్క్ లో హర్లెంలో ఆమె హైస్కూల్ ని స్థాపించారు. ప్రభావ వంత౦గా బోదించడంలో అనతి కాలంలో న్యూయార్క్ లో పెరోందిన పాటశాలగా గుర్తింపు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికాలో వైట్ హౌస్ సలహాదరురలిగా ప్రవాస భారతీయురాలు నియామకం
ఎవరు: పియా దండియా
ఎప్పుడు: నవంబర్ 07
ప్రదాన సమాచార కమీషనర్ గా బాద్యతలు స్వీకరించిన వైకే. సిన్హా :

కేంద్ర ప్రదాన సమాచార కమిషన్ (సియిసిగా యశ్వర్దన్ కుమార్ సిన్హా నవంబర్ 07న బాద్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమం లో 62ఏళ్ల సిన్హా చేత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకరం చేయించారు. మాజీ దౌత్య వేత్త అయిన సిన్హా మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రదాన సమాచార కమీషనర్ గా బాద్యతలు స్వీకరించిన వైకే. సిన్హా బాద్యతలు
ఎవరు: వైకే. సిన్హా
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 07
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |