
Daily Current Affairs in Telugu 09-10-2020
ప్రపంచ ఆహార కార్యక్రమం అయిన డబ్ల్యుపిఎఫ్ కిదక్కిన నోబెల్ శాంతి బహుమతి :

ప్రపంచ వ్యాప్తంగా సాయుధ ఘర్షణలు పెను సంక్షోబాలతో అతలాకుతలమైన ప్రాంతాలలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపు నింపు తున్న సంస్థకు సమున్నత పురస్కారం వరించింది.సంక్లిష్టమైన ఆ ప్రాంతాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రాణాలకు తెగించి అన్నార్తుల క్షుద్భాధను తీరుస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కి ఎంపిక అయింది.ఆహార అభద్రతా పై సాగించిన అవిశ్రాంత పోరుకు ఈ గర్తింపు లబించింది.ఈ అవార్డు కింద 1.1 లక్షల డాలర్ల నగదు స్వర్ణ పథకం లబించానున్నాయి. ఐక్యరాజ్య సమితి కి చెందిన డబ్ల్యుఎఫ్‌పి రొమ్ కేంద్రంగా పని చేస్తుంది.దక్షిణ సుడాన్ లో అన్నార్తుల కోసం వాయు మార్గంలో ఆహారాన్ని జారవిడచడం నుంచి కరోన మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు సాయం అందేలా చూడడం వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకర ఆందోళనకర ప్రాంతాల్లో సేవలు అందించడ౦ లో ఈ సంస్థ తన ప్రత్యెక తను చాటుకుంది.గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 86దేశాల్లో 10కోట్ల మందికి సాయం అందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆహార కార్యక్రమం అయిన డబ్ల్యుపిఎఫ్ కిదక్కిన నోబెల్ శాంతి బహుమతి
ఎవరు: డబ్ల్యుపిఎఫ్
ఎక్కడ:రోమ్
ఎప్పుడు: అక్టోబర్ 09
రుద్రం క్షిపణి పరీక్ష ను విజయవంతంగా పరీక్షించిన భారత్ :

క్షిపణి రంగంలో భారత్ కీలక మైలు రాయిని సాధించింది. కొత్తతరం యాంటీ రేడియేషన్ క్షిపణిని అక్టోబర్ 09న విజయవంతంగా పరీక్షించింది. రుద్రం” అనే ఈ ఆస్త్రం శత్రు దేశపు యొక్క రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థ కమ్యూనికేషన్ నెట్వర్క్ లను ధ్వంసం చేయగ లదు. ఒడిశాలోని బాలేశ్వర్ లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్దవిమానం నుంచి ఉదయం 10-30 గంటలకు దీనిని ప్రయోగించారు. రుద్రం-1ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందిం చింది.
ప్రత్యేకతలు :
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇదే ధ్వని కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళుతుంది.
- 250 కిలోమీ టర్ దూరం పయనించగలదు. తాజా పరీక్షలో ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ దీవిలో ఉన్న రేడియో ధార్మిక లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతోచెందించింది. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న యాంటీ ధార్మిక క్షిపణులను రూపొందించే సత్తా భారత్ కు ఉందని ఈ ప్రయోగం చాటింది.
- రుద్రం-1లో ఐఎఎస్టీ ఎస్ మార్గనిర్దేశ వ్యవస్థ ఉంది. తుది దశలో శత్రు లక్ష్యం పై విరుచుకుపడేందుకు ప్యాసివ్ హోమింగ్ హెడ్ ఉంది.
- రాడార్లు, ఇతర కమ్యూ నికేషన్ వ్యవస్థల నుంచి వెలువడే రేడియేషన్ సంకేతాలను పట్టుకుని లక్ష్యాన్ని చేదిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: రుద్రం క్షిపణి పరీక్ష ను విజయవంతంగా పరీక్షించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:ఓడిశా
ఎప్పుడు: అక్టోబర్ 09
AMFI ఛైర్మన్‌గా మల్లి ఎన్నికయిన నిలేష్ షా :’

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ఛైర్మన్‌గా నీలేష్ షా తిరిగి ఎన్నికయ్యారు.అంతకుముందు ఆయన 2019 – 2020 గాను చైర్మన్‌గా ఎన్నికయ్యారు. AMFI చైర్మన్‌గా నిలేష్ షా AMFI ఆర్థిక అక్షరాస్యత కమిటీ ఎక్స్-అఫిషియో చైర్మన్‌గాను ఈయన కొనసాగుతారు.ఈ నిర్ణయాలు సెమీ-రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ సంస్థ అయిన AMFI తన బోర్డు సమావేశంలో తీసుకుంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: AMFI ఛైర్మన్‌గా మల్లి ఎన్నికయిన నిలేష్ షా
ఎవరు: నిలేష్ షా
ఎప్పుడు: అక్టోబర్ 09
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావును కేంద్రం నియమించింది. అయన ను కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 7 న నియమించింది. దీనికి ముందు ఎం.రాజేశ్వర్ రావు ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అతను సెంట్రల్ బ్యాంక్ కు నాల్గవ డిప్యూటీ గవర్నర్‌గా ఎన్ఎస్ విశ్వనాథన్ ఉన్నారు. ఆరోగ్య కారణాల వలన జూన్ లో పదవీకాలం పూర్తి కాక ముందే 2020 మార్చిలో ఎన్ఎస్ విశ్వనాథన్ ఈ పదవికి రాజీనామా చేశారు.అయన స్థానం లో ఈయన నియామకం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు
ఎవరు: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు
ఎప్పుడు:అక్టోబర్ 09
మాజీ రంజీ క్రికెటర్ సురేష్ కన్నుమూత :

కేరళ కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ మని సురేష్ కుమార్ 47)అనారోగ్యంతో అక్టోబర్ 09న కన్నుమూసారు.లెఫ్ట్ ఆరం స్పిన్నర్ అయిన సురేష్ 14 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ లో కేరళ రైల్వేస్ జట్ల తరపున 72ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 27.54సగటుతో 196వికెట్లు పడగొట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ రంజీ క్రికెటర్ సురేష్ కన్నుమూత
ఎవరు: క్రికెటర్ సురేష్
ఎప్పుడు: అక్టోబర్ 09
నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త మారియో మోలినా కన్నుమూత;

నోబెల్ బహుమతి పొందిన ఏకైక మెక్సికన్ శాస్త్రవేత్త మారియో జోస్ మోలినా కన్నుమూశారు. అతను 1943 మార్చి 19 న మెక్సికోలోని మెక్సికో నగరంలో జన్మించాడు. ఓజోన్ పొర దెబ్బతినడంపై 1970 లో చేసిన పరిశోధనల కోసం అతను కెమిస్ట్రీ రంగంలో 1995సంవత్సరం లో నోబెల్ బహుమతిని యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) కు చెందిన శాస్త్రవేత్త ఫ్రాంక్ షేర్వుడ్ రోలాండ్ మరియు నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ క్రుట్జెన్తో పంచుకున్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త మారియో మోలినా కన్నుమూత
ఎవరు మారియో మోలినా
ఎప్పుడు: అక్టోబర్ 09
ప్రపంచ పోస్ట్ దినోత్సవం గా అక్టోబర్ 09 :

ప్రతి సంవత్సరం అక్టోబర్ 09వ తేదిన ప్రపంచ పోస్ట్ దినోత్సవం ను జరుకుంటారు.1874 లో బెర్నోని స్విస్ రాజదాని లో యూనివర్సల్ పోస్టల్ యునియన్ (యుపియు) ని ప్రారంబించిన సందర్బ౦గా ఈ రోజును జరుపుకుంటారు. దీనిని 1969 లో జపాన్ లోని టోక్యో లో జరిగిన యుపియు కాంగ్రెస్ ప్రపంచ పోస్ట్ డే గా ప్రకటించింది. ప్రతి సంవత్సరం 150 పైగా దేశాలు ప్రపంచ పోస్ట్ డే ను రకరకాలుగా జరుపుకుంటారు.కొన్ని దేశాల్లో ప్రపంచ పోస్ట్ డే ను సెలవు దినంగా కూడా పాటిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పోస్ట్ దినోత్సవం గా అక్టోబర్ 09
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎప్పుడు: అక్టోబర్ 09
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |