Daily Current Affairs in Telugu 15-10-2020
కిర్గిస్తాన్ అద్యక్ష పదవికి జీన్ బెకోవ్ రాజీనామా:

కిర్గిస్తాన్ అధ్యక్షుడు సూరన్ భాయ్ జీన్ బెకోవ్ తన అద్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. అక్టోబర్ 4న అక్కడ జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో రాజీనామా చేస్తున్నట్లు అక్టోబర్ 14న ప్రకటించారు. ఎన్నికల్లో అధికారం కూటమిలోని పార్టీలు ఓట్ల కొనుగోలు వంటి అక్రమాలకు పాల్పడిన వారంటూ విపక్షాలు ఆరోపించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు పలు ప్రభుత్వ కార్యాలయాలను లూటీ చేశారు. జీన్ చెకోవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు విషమించడంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధ్యక్షుడు రాజీనామా చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కిర్గిస్తాన్ అద్యక్ష పదవికి జీన్ బెకోవ్ రాజీనామా
ఎవరు: జీన్ బెకోవ్
ఎక్కడ: కిర్గిస్తాన్
ఎప్పుడు: అక్టోబర్15
సస్య రక్షణ శాస్త్రవేత్త అయిన శ్రీధర్ కు దక్కిన జాతీయ అవార్డు :

సమగ్ర సస్యరక్షణ విధానాలను ప్రవేశపెట్టిన కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటిఆర్ఐ) ఆ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు. శ్రీధర్ చీడ పీడల నివారణలో విశేష కృషి చేసిన టీబీ ఫ్లెచర్ మెమోరియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని సిటిఆర్‌ఐలో పనిచేస్తున్న శ్రీధర్ కృష్ణా జిల్లా గుడివాడకు సమీపంలో గురజ గ్రామంలో జన్మించాడు. నైనిటాల్ లో జీబీ పంత్ వ్యవసాయ వర్శిటీ నుంచి పీహెచ్.డి పట్టా పొందారు. పత్తి,మిర్చి,కింద,పోగా,వేరుశనగ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ప్రవేశపెట్టి పురుగుమందుల అవశేషాల తగ్గింపునకు శ్రీధర్ విశేష కృషి చేశారు. బీబీ ఫైజర్ పేరిట చెన్నైలోని ప్రముఖ కీటకశాస్త్ర నిపుణుడు డాక్టర్ బీపీ.డేవిడ్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. డిసెంబర్ 5న డాక్టర్ శ్రీధర్ ఈ అవార్డును చెన్నైలో అందుకోనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సస్య రక్షణ శాస్త్రవేత్త అయిన శ్రీధర్ కు దక్కిన జాతీయ అవార్డు
ఎవరు: శ్రీధర్
ఎప్పుడు: అక్టోబర్15
మయన్మార్ నౌకా దళానికి ఒక జలాంతర్గామిని ఇవ్వనున్న భారత్ :

దక్షిణాసియా దేశాల్లో తన నైనిక ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది మయన్మార్ నౌకాదళానికి ఒక జలాంతర్గామిని ఇవ్వాలని నిర్ణయించింది. మయన్మార్ నౌకాదళంలో ఇదే తొలి జలాంతర్గామి అవుతుంది. కొన్నేళ్లుగా ఇరు దేశాల నౌకాదళాల మధ్య సహకారం క్రమంగా పెరుగుతూ వస్తుంది. “కిలో తరగతికి చెందిన ఐఎన్ఎస్ సింధువీర్ అనే జలాంతర్గామిని మయన్మార్ ఇవ్వనున్నాం. ఈ ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, వృద్ధి కోసం మనం చేపట్టిన “సాగర్” దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న పొరుగు దేశాల స్వయం సమృద్ధి కి సామర్థ్య పెంపునకు చర్యలు చేపడతాం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. కిలో తరగత్తి జలాంతర్గామి డీజిల్-విద్యుత్ తో పనిచేస్తుంది శత్రువులపై మెరుపు దాడి చేసేందుకు ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మయన్మార్ నౌకా దళానికి ఒక జలాంతర్గామిని ఇవ్వనున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: : అక్టోబర్15
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి కన్నుమూత :

ప్రముఖ మలయాల కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి అక్టోబర్15 న ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 94 ఏళ్లు. ‘అక్కితమ్’ పేరుతో మలయాళ సాహిత్యంలో పేరు పొందారు. దాదాపు 45 పుస్తకాల వరకు రచనలను రచించారు. ఇందులో కవిత్వం పాలు ఎక్కువ మరియు నాటకాలు,చిన్న కథలు కూడా రాశారు. 2018లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీట్ అవార్డు ను ప్రకటించింది. కోవిడ్ కారణంగా ఈ అవార్డును గత నెలలో పాలక్కాడ్‌లో ఆయన ఇంటి దగ్గరే ప్రధానం చేశారు. 1928 మార్చి 18న జన్మించిన అక్కితమ్ జర్నలిస్టుగా,చాలా మ్యాగజైన్లకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ఆలిండియా రేడీయోలోనూ సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ సహా ఎన్నో పురస్కారాలు పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి కన్నుమూత
ఎవరు: అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి
ఎక్కడ: కేరళా
ఎప్పుడు: అక్టోబర్15
తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న భాను అతైయా కన్నుమూత :

భాను అతైయా భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ బాను అతైయా (91) ఇక లేరు. అక్టోబర్ 15న ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను అతైయా కమార్తె రాధా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్లు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికి పరిమితం అయ్యారు. మహా రాష్ట్ర లోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా 1988లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన “‘గాంధీ” చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు. భాను అతైయా గురుదత్ తెరకెక్కించిన సీఐడీ (1956) తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైన కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. లేకిన్,లగాన్ సినిమాలకు ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న భాను అతైయా కన్నుమూత
ఎవరు: భాను అతైయా
ఎప్పుడు: అక్టోబర్15
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |