Daily Current Affairs in Telugu 26-11-2020
ఐఐసి నూతనంగా చైర్మన్ గా ఎన్నిక అయిన గ్రెగ్ బార్ క్లే :

న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్.జెడ్.సి) డిరెక్టర్ గ్రెగ్ బార్ క్లే ఐసి సి నూతన చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. నవంబర్ 25న ఐసిసి వార్షిక త్రైమాసిక సమావేశం సందర్బoగా జరిగిన ఓటి౦గ్స్ లో బార్ క్లే 11-5 తో ఇమ్రాన్ ఖవాజా (సింగపూర్) పై నెగ్గి స్వతంత్ర చైర్మన్ గా ఎంపిక అయ్యాడు. శశాంక్ మనోహర్ (భారత్ )తర్వాత ఐసిసి ఎన్నికైన రెండో స్వతంత్ర చైర్మన్ గా బార్ క్లే నే 12టెస్టు దేశాలు,3అసోసియేషన్ దేశాలు స్వతంత్ర మహిళా డిరెక్టర్ లు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆర్ధిక నష్టాల నేపద్యం లో ద్వైపాక్షిక సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్న భారత్,ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లు బార్ క్లే కు మద్దతుగా నిలిచాయి. ఐసిసి టోర్నీల ద్వారా అసోసియేట్ దేశాల ఆదాయాన్ని పెంచుతామన్న సింగపూర్ క్రికెట్ మాజీ అద్యక్షుడు ఖవాజ కు పాకిస్తాన్ బోర్డు మద్దతు ప్రకటించింది. జులై లో మనోహర్ గారి పదవి కాలం ముగియడం తో అప్పట్నుంచి ఖవాజ తాత్కాలిక చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. నూతన చైర్మన్ గా బార్ క్లే ఎన్నిక అవడం తో ఖవాజా తన బాద్యతల నుంచి తప్పుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఐసి నూతనంగా చైర్మన్ గా ఎన్నిక అయిన గ్రెగ్ బార్ క్లే
ఎవరు: గ్రెగ్ బార్ క్లే
ఎప్పుడు: నవంబర్ 26
93 వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ నుంచి ఎంపిక అయిన మలయాళీ చిత్రం జల్లికట్టు :

మళయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఆణిముత్యనికి సముచిత గుర్తింపు లబించింది. లిజో జోషి పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన జల్లికట్టు చిత్రం 93వ ఆస్కార్ పురస్కారాల పోటీ కి భారత దేశం తరపున వెళ్లనుంది. ఉత్తమ చిత్రాల పోటీలో నిలువనుంది. శకుంతల దేవి గుంజన్ సక్సేనా, చపాక్,గులాబో సితాబో, చెక్ పోస్ట్ ,స్కై ఈజ్ పింక్ వంటి 27చిత్రాలను పరిశీలన అనంతరం జల్లికట్టు చిత్ర౦ ను ఎంపిక చేసారు. కథా నేపద్యంలోని నిర్మాణ విలువలు లిజో దర్శకత్వం ప్రతిభ ఆదారంగా ఈ చిత్రాన్ని పోటీ కి పంపుతున్నాం అని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరి బోర్డ్ చైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. మనుషుల్లో దాగి ఉన్న క్రూరత్వాన్ని జంతువుల పట్ల మానవుల తీరును ఈ చిత్రం సూటిగా ప్రశ్నిస్తుంది. కాగా గత ఏడాది రన్ వీర్ సింగ్ నటించిన హింది చిత్రం” గల్లీ భాయ్” మనదేశం నుంచి ఆస్కార్ కు వెళ్ళింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 93 వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ నుంచి ఎంపిక అయిన మలయాళీ చిత్రం జల్లికట్టు
ఎవరు: మలయాళీ చిత్రం జల్లికట్టు
ఎప్పుడు: నవంబర్ 26
భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్.మీరా కు దక్కిన అరుదైన గౌరవం :

కృష్ణ జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తగా వ్యక్తి కి అంతర్జాతీయ పదవి దక్కింది. భారత వ్యవసాయ పరిశోదన మండలి (ఐసిఏఆర్) లో ప్రదాన శాస్త్రవేత్త గా పని చేస్తున్న డాక్టర్ షేక్ ఎన్.మీరా కు ఐక్య రాజ్య సమితి కి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ అబివృద్ది నిధి (ఐపాడ్) లో డిజిటల్ విభాగానికి సినియర్ సాంకేతిక నిపుణుడిగా (ఎస్టిఈ) భారత ప్రభుత్వం నియమించింది. ఉత్తర ఆఫ్రికా ,తూర్పు ఐరోపా దేశాల ప్రభుత్వానికి వ్యూహాత్మక సలహాలు ఇవ్వడానికి సీనియర్ శాస్త్రవేత్తగా ఆయన పని చేసారు. మొత్తం 20 దేశాలు డిజిటల్ వ్యవసాయ ప్రాజెక్ట్లు లను పర్యవేక్షిస్తారు. కొన్నేళ్లుగా ఆయన వివిధ దేశాల్లో డిజిటల్ వ్యవసాయ ప్రాజెక్టులకు సలహాలు ఇస్తున్నారు. ఆయనకు గతంలో 12జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. కృష్ణ జిల్లా నందిగామ లో పుట్టిన ఈయన బాపట్ల వ్యవసాయ కాలేజి లో వ్యవసాయ డిగ్రీ చదివారు.డిల్లి లోని భారత్ వ్యవసాయ పరిశోదన సంస్థ పిజి పి.హెచ్ డి చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్.మీరాకు దక్కిన అరుదైన గౌరవం
ఎవరు: ఎన్.మీరాకు
ఎప్పుడు: నవంబర్ 26
భారత రాజ్యాంగ దినంగా నవంబర్ 26 :

భారత్ దేశం లో ఏటా నవంబర్ 26 న రాజ్యంగ దినం లేదా సంవిదాన్ దివాస్ జరుపుకుంటారు. ఈ రోజు ను జాతీయ న్యాయ దినం అని కూడా అంటారు. భారత్ దేశంలో రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును ఈ విధంగా గుర్తు చేసుకుంటారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. తర్వాత 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్గానూ పిలుస్తారు. ఈ 2020 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తవుతుంది. ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నవంబర్ 19, 2015న భారత ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత రాజ్యాంగ దినంగా నవంబర్ 26
ఎవరు: భారత ప్రభుత్వం
ఎప్పుడు: నవంబర్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |