Daily Current Affairs in Telugu 21-10-2020
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్ర౦:

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో పాటు నూతన విద్యుత్ చట్టాన్ని తిరస్కరిస్తూ పంజాబ్ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతుల రక్షణ కోసం ఇటీవల నాలుగు నూతన బిల్లులను పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 20న ఆమోదించింది. ప్రతిపక్ష శిరోమణి అకాలీ దళ్ ,ఆమ్ ఆద్మీ పార్టీ ,లోక్ ఇన్ సాఫ్ పార్టీ ల ఎమ్మెల్యేలు ఈ తీర్మానం బిల్లులకు తమ మద్దతును ప్రకటించారు. కేంద్ర౦ ఇటీవల తీసుకొచ్చిన బిల్లులకు కొత్త క్లాజులు సవరణల ను చేర్చి ,రైతు రక్షణ ల కోసం ఈ బిల్లులను ఆమోదిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సి.ఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్ర౦
ఎవరు: పంజాబ్ రాష్ట్ర౦
ఎక్కడ: పంజాబ్ రాష్ట్ర౦
ఎప్పుడు: అక్టోబర్ 20న
చాంపియన్స్ లీగ్ పుట్ బాల్ టోర్నీ లో అరుదైన ఘనత సాధించిన లియోనల్ మెస్సి :

ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ లీగ్ పుట్ బాల్ టోర్నీ లో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియోనేల్ మెస్సి ఖాతాలో అరుదైన ఘనత సాధించారు. వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్స్ లో గోల్ చేసిన తొలి ప్లేయర్ గా మెస్సి చరిత్ర సృష్టించాడు. అక్టోబర్ 21న పెరాస్కారోస్ తో జరిగిన మ్యాచ్ లో 27వ నిమిషం లో అందివచ్చిన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచిన మెస్సి ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్ మాజీ వింగర్ ర్యాన్ గిగాస్ కూడా 16 సీజన్ లో గోల్ చేసినప్పటికి వరుస సీజన్ లో గోల్ చేసిన ఆటగాడు మాత్రం మెస్సి కావడం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి: చాంపియన్స్ లీగ్ పుట్ బాల్ టోర్నీ లో అరుదైన ఘనత సాధించిన లియోనల్ మెస్సి
ఎవరు: లియోనల్ మెస్సి
ఎక్కడ: బార్సిలోనా
ఎప్పుడు: అక్టోబర్ 21న
ఇండియన్ పనోరమా అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రం గా ఎఫ్-2 చిత్రం ఎంపిక :

ఇటీవల కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2019కి గాను వివిధ భాషలకు చెందిన పలు చిత్రాలకు అవార్డులు ప్రకటించింది. దీంతో తెలుగు నుంచి ఎఫ్-2 చిత్రానికి కేంద్ర అవార్డు దక్కింది. దీనికి సంబంధించిన గెజిట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 51ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020) వేడుకల్లో భాగంగా 2019 ఇండియన్ పనోరమా విభాగం లో “ఎఫ్2”కి ఈ అవార్డు లబించిది. అదే కాకుండా ఇండియన్ పనోరమా విభాగం లో ఏకైక తెలుగు చిత్రం గా ఎఫ్2 చిత్రం నిలవడం విశేషం. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలు గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి:ఇండియన్ పనోరమా అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రం గా ఎఫ్-2 చిత్రం ఎంపిక
ఎవరు:ఎఫ్-2 చిత్రం
ఎప్పుడు: అక్టోబర్ 21న
అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున స్వర్ణం గెలిచిన ఎలవెనిల్ వలరివన్ :

షూటింగ్లో 2020 షేక్ రస్సెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఈవెంట్లో ప్రపంచ నంబర్ వన్ ఎలవెనిల్ వలరివన్ బంగారు పతకం సాధించింది. ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (బిఎస్ఎస్ఎఫ్) నిర్వహించింది. పురుషుల ఈవెంట్లో జపాన్‌కు చెందిన నయోయా ఒకాడా స్వర్ణం సాధించగా, భారతదేశానికి చెందిన షాహు తుషార్ మానే రజత పతకం సాధించాడు. ఈ కార్యక్రమంలో 60 షాట్ల పోటీ ఉంది. ఇందులో ఆరు దేశాల షూటర్లు పాల్గొన్నారు. ఇందులో బంగ్లాదేశ్, ఇండియా, జపాన్, కొరియా, ఇండోనేషియా మరియు భూటాన్ పాల్గొన్నాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున స్వర్ణం గెలిచిన ఎలవెనిల్ వలరివన్
ఎవరు: ఎలవెనిల్ వలరివన్
ఎప్పుడు: అక్టోబర్ 21న
ఆయుష్మాన్ సహకర్ అనే పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ :

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు “ఆయుష్మాన్ సహకర్” అనే నూతన పథకంను ప్రారంభించారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల పరికల్పనలో భాగంగా సహకార సంస్థలకు ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఈ పథకం ఒక ప్రత్యేకమైన మార్గం. ఆయుష్మాన్ సహకర్ పథకాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సిడిసి) రూపొందించింది. రాబోయే కాలంలో ఎన్సిడిసి ఏర్పాటు కాబోయే సహకార సంస్థలకు 10 వేల కోట్ల రూపాయల రుణాలను పెంచనుంది. ఎన్సిడిసి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కార్యకలాపాలను బలోపేతం చేసే దశలో ఉంది. ఎన్సిడిసి రూపొంది౦చిన ఆయుష్మాన్ సహకర్ పథకం అనేది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్లో మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఆరోగ్య సదుపాయాల యొక్క కార్యాచరణ అవసరాలను తీర్చడానికి పని మూలధనం మరియు మార్జిన్ డబ్బును కూడా అందిస్తుంది. ఇది మహిళా మెజారిటీ సహకార సంస్థలకు ఒక శాతం వడ్డీ రుణాలను అందిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆయుష్మాన్ సహకర్ అనే పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎవరు: కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 21న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |