Daily Current Affairs in Telugu 16-10-2020
అణ్వస్త్ర సామర్ద్య పృద్వీ -2 క్షిపణి ని విజయవంతగా ప్రయోగించిన భారత్ :

స్వదేశి పరిజ్ఞానం తో తయారైన అణ్వస్త్ర సామర్ధ్య పృద్వీ-2 క్షిపణిని భారత్ అక్టోబర్ 16న విజయవంతగా పరీక్షించింది. ఓడిశా లోని చాందిపూర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక ఐటిఆర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. శిక్షణ అబ్యాసం లో భాగంగా సైన్యం దీనిని ప్రయోగించారు అని రక్షణ వర్గాలు తెలిపాయి. చైనాతో ఉద్రిక్త తల నేపద్యంలో ఈ అస్త్ర పరీక్షకు ప్రాదాన్యం ఏర్పడింది. ప్రుద్వి -2 క్షిపణి ని రాత్రి వేల ప్రయోగించారు. ఇటీవలి కాలలో ఇది రెండో సారి. చివరి సారిగా గత నెల 23న ఇలాంటి ప్రయోగం జరిగింది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ అస్త్రం చెందించగలదు. 500-1000 కిలో వార్ హెడ్ లను మోసుకెళ్ళ గలదు. తాజాగా ఈ ప్రయోగం ఒక సంచార ప్రయోగ వేదిక నుంచి రాత్రి 7.30గంటలకు పృద్వీ-2నింగిలోకి దూసుకెళ్లింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అణ్వస్త్ర సామర్ద్య పృద్వీ -2 క్షిపణి ని విజయవంతగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా లోని చాందిపూర్ లో
ఎప్పుడు: అక్టోబర్ 16న
ఐబిఐ కొత్త చైర్మన్ గా రాజ్ కిరణ్ రాయ్ ఎన్నికయ్యారు:

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) కొత్త చైర్మన్ గా యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి ,సియివో గా రాజ్ కిరణ్ రాయ్ ఎన్నికయ్యారు. 2020-21 మద్య ఆయన అసోసియేషన్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఇక స్టేట్ బ్యాంక్ ఇండియా చైర్మన్ గా దినేష్ కుమార్ ఖరా డిప్యుటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు అని ఐబిఏ వెల్లడించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐబిఐ కొత్త చైర్మన్ గా రాజ్ కిరణ్ రాయ్ ఎన్నికయ్యారు:
ఎవరు: రాజ్ కిరణ్ రాయ్
ఎప్పుడు: అక్టోబర్ 16న
సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా బాలా శౌరి నియామకం :

లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అక్టోబర్ 16న రెండు పార్లమెంటరి కమిటీల చైర్మన్ లను మార్చారు. ఇన్నాళ్లు సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా ఉన్న వైకాప ఎంపి రఘురామ కృష్ణ రాజు స్థానం లో అదే పార్టీ కి చెందిన ఎంపి వల్లభ నేని బాలశౌరి ని నియమించారు. పేపర్స్ లేయిడ్ పార్లమెంటరి కమిటీ చైర్మన్ గా ఉన్న బిఎస్సీ సభ్యుడు శ్యాం సింగ్ యాదవ్ స్థానం లో అదే పార్టీ కి చెందిన సభా పక్ష నాయకుడు రితేష్ పాండే ని నియమించారు. లోక్ సభ ఎథిక్స్ కమిటీ సభ్యులుగా వైకాప ఎంపి వల్లభనేని బాలశౌరి (ఏపి),కాంగ్రెస్ ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (తెలంగాణా),సభ హక్కుల కమిటీ సభ్యుడిగా (ఎంపి) తలారి రంగయ్య (ఏపి),పేపర్స్ లేయిడ్ కమిటీ సబ్యుడిగా ఎంపి మార్గని భరత్ (ఏపి) సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సబ్యుడిగా ఎంపి .తెరాస లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు (తెలంగాణా) నియమితులయ్యారు. ఇది వరకు మానవ వనరుల అబివృద్ది కమిటీ సభ్యుడిగా ఉన్న ఎంపి గల్లా జయదేవ్ (ఏపి) ను తాజాగా ఐటి స్టాండిగ్స్ కమిటీ లోకి మార్చారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా బాలా శౌరి నియామకం
ఎవరు: బాలా శౌరి
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు : అక్టోబర్ 16న
ప్రపంచ ఆహార దినోత్సవం గా అక్టోబర్ 16:

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రతి సంవత్సరం అక్టోబర్ 16ను జరుపుకోవాలని 1979 లో ప్రపంచ ఆహార దినంగా గుర్తించింది. ప్రపంచ ఆహార దినోత్సవం 2020 కూడా FAO యొక్క 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రారంభంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపన జ్ఞాపకార్థం ప్రపంచ ఆహార దినోత్సవం ప్రారంభించబడింది. క్రమంగా ఈ రోజు గ్లోబల్ ఈవెంట్‌గా మారి, ఆహార కొరత గురించి అవగాహన కల్పించి, ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలను పునరుద్ధరించాలానే ఉద్దేశంగా మారింది. ప్రతి సంవత్సరం, ప్రపంచ ఆహార దినోత్సవం ఆహార౦ పెంపుదల ను ప్రోత్సహించడానికి మరియు ఆహార వనరులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంవత్సరం ప్రస్తుత మహమ్మారి వెలుగులో ఆహార అలవాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే అవసరం ఏర్పడింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ ఆహార దినోత్సవం గా అక్టోబర్ 16:
ఎవరు: యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: అక్టోబర్ 16న
గుజరాత్ గాన కోకిల ” కౌముడి మున్షి కన్నుమూత :

గుజరాత్ గాన కోకిల కౌముడి మున్షి మహమ్మారి కోవిద్ -19 వైరస్ సోకిన కారణంగా ఆమె కన్నుమూశారు. తన కెరీర్ ప్రారంభ దశలో, మున్షి ఎక్కువగా గుజరాతీలో పాటలను పాడారు. ‘సచి రీ మారి సత్రే భవానీ మా’ వంటి పాటలతో ఖ్యాతిని పొందారు. గాయని భోజ్‌పురి పాటలు కూడా పాడింది. 1963 చిత్రం బిడేసియా కోసం ఆమె ప్రఖ్యాత గాయని అయిన గీతా దత్తో కలిసి ‘నీక్ సైయన్ బిన్’ అనే పాట పాడింది. ఈమెను గుజరాతి నైటింగేల్ గా పేరుతో పిలుస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గుజరాత్ గాన కోకిల ” కౌముడి మున్షి కన్నుమూత
ఎవరు: కౌముడి మున్షి
ఎప్పుడు: అక్టోబర్ 16న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |