
Daily Current Affairs in Telugu 12-10-2020
2020 సంవత్సరానికి గాను ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న అమెరికన్ ఆర్థికవేత్తలు
:

ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ శాస్త్రవేత్తలు బహుమతులు కూడా అమెరికాను వరించాయి.కాలిఫోర్నియా లో ని స్టాఫర్డ్ విశ్వవిద్యాలయంనికి చెందిన ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబర్ట్ బి విల్సన్ (83) ఫౌల్ ఆర్ మిల్ గ్రోం (72) లకు ఈ ఏడాది ఆర్తిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లబించింది. వేలం సిద్దాంతం (ఆక్షన్ థియరీ) న్ని మరింతగా అబివృద్ది చేయడం కొత్త తరహ వేలం పద్దతులు ఆక్షన్ ఫార్మట్స్ కనిపెట్టినందుకు గాను ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ తెలిపింది. విల్సన్ ,మిల్ గ్రోం గురు శిష్యులు వంటి వారు. మిల్ గ్రోం పిహెచ్డి చేస్తున్నపుడు విల్సన్ ఆయనకు అడ్వైసర్ గా వ్యవహరించారు.ఇద్దరు ఒకే వీధిలో ఎదురెదురుగా ఉంటారు.ఈ ఏడాది మొత్తం 11మందికి నోబెల్ బహుమతులు రాగా అందులో ఏడుగురు అమెరికా వాసులు కావడం గమనార్హం.
క్విక్ రివ్యు:
ఏమిటి: 2020 సంవత్సరానికి గాను ఆర్హ్తిక శాస్త్రం లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న అమెరికన్ ఆర్థికవేత్తలు
ఎవరు: అమెరికన్ ఆర్థికవేత్తలు
ఎప్పుడు: అక్టోబర్ 12
17 వ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న లాస్ ఏంజిల్స్ లేకర్స్ :

లాస్ ఏంజిల్స్ లేకర్స్ మయామి హీట్‌ను ఓడించి నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బిఎ) ఛాంపియన్షిప్ 2020 ను గెలుచుకుంది.ఇది లాస్ ఏంజిల్స్ లేకర్స్ కు 17 వ NBA టైటిల్ విజయం. మరియు దశాబ్దం క్రితం చివరి కోబ్ బ్రయంట్ యొక్క ఐదవది.తన కెరీర్లో నాలుగోసారి ఎన్బిఎ ఫైనల్స్ మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ (ఎంవిపి) గా లెబ్రాన్ జేమ్స్ ఆఫ్ ది లేకర్స్ ఎంపికయ్యాడు. దీనితో, అతను లీగ్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఫైనల్స్ మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ గా పేరుపొందిన మొదటి ఆటగాడిగా నిలిచాడు
క్విక్ రివ్యు:
ఏమిటి: 17 వ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న లాస్ ఏంజిల్స్ లేకర్స్
ఎవరు: లాస్ ఏంజిల్స్ లేకర్స్
ఎప్పుడు: అక్టోబర్ 12
జగనన్న విద్య కనుక అనే నూతన పథకాన్ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

రాష్ట్రంలోని పేద పిల్లలకు పాఠశాల వస్తు సామగ్రిని పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నూతనంగా ‘జగన్నన్నవిద్యా కానుక పథకం అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకం కోసం రాష్ట్రం సుమారు 650 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 కిట్లు పంపిణీ చేయబడతాయి.ఈ పథకం కింద, రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి 10 తరగతుల వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల యొక్క వస్తు సామగ్రిని లేదా విద్యా కానుకను ఇస్తారు, ఇందులో మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్, ఒక బెల్ట్, ఒక సెట్ పాఠ్యపుస్తకాలు ఉంటాయి. మరియు నోట్ బుక్స్ మరియు ఒక పాఠశాల బ్యాగ్ ఉంటాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: జగనన్న విద్య కనుక అనే నూతన పథకాన్ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: సిఎం జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 12
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత :

దక్షిణాది చిత్ర పరిశ్రమ పై చెరగని ముద్ర వేసిన సంగీత ద్వయం రాజన్ నాగేంద్ర లో ఒకరైన రాజన్ కన్నుమూసారు.బెంగళూర్ లో అక్టోబర్ 12న అయన గుండె పోటుతో తుదిశ్వాస విడిచాడు.రాజన్ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా మైసూర్ లో జన్మించిన రాజన్ చిన్న నాటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు.ఈ సంగీత ద్వయం కలిసి కన్నడ లోనే రెండు వందల పైగా సినిమాల కు సంగీతం సమకూర్చారు. తెలుగు ,తమిళం, మలయాళం. హింది ,తులుం ,సింహళం భాషల్లో సంగీతాన్ని సమకూర్చారు.ఎన్నో మరుపు రాని గీతాలని అందించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత
ఎవరు: సంగీత దర్శకుడు రాజన్
ఎప్పుడు: అక్టోబర్ 12
:
పుట్ బాల్ మాజీ కెప్టెన్ చాప్ మెన్ కన్నుమూత :

భారత పుట్ బాలర్ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ టన్ చాప్ మన్ మరణించారు. అక్టోబర్ 12 రాత్రి ఆసుపత్రిలో గుండె పోటుతో అయన తుది శ్వాస విడిచాడు. ఉత్తమ ఫీల్డర్ గా గుర్తింపు పొందిన ఆయన 1995 నుంచి 2001 మద్య భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. కెప్టెన్ గా 1997 లో శాప్ (దక్షిణాఫ్రికా పుట్ బాల్ సమాఖ్య) చాంపియన్ షిప్ లో జట్టులో విజేతగా నిలిపారు. ఈస్ట్ బెంగాల్ ఒకప్పటి జేసిటి మిల్స్ క్లబ్ ల తరపున గొప్పగా రాణించారు. పంజాబ్ కు చెందిన జేసిటి మీల్స్ జట్టులో విజయన్ బైచుంగ్ భూటియ లాంటి దిగ్గజాలతో కలిసి ఆడి ఆటను 14ట్రోపి లను అందించిన ఆయన అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: పుట్ బాల్ మాజీ కెప్టెన్ చాప్ మెన్ కన్నుమూత
ఎవరు: కెప్టెన్ చాప్ మెన్
ఎక్కడ:న్యు డిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 12
ప్రపంచ ఆర్తరైటిస్ దినంగా అక్టోబర్ 12:

1996 నుండి, అక్టోబర్ 12 న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం రుమాటిక్ మరియు మస్క్యులోస్కెలెటల్ వ్యాధుల (ఆర్ఎమ్డి) పై అవగాహన పెంచడానికి అన్ని వయసుల, జాతుల, మరియు లింగ లకు అవగాహనా కల్పించాలనే ఉద్దేశ్యం తో దీనినిప్రకటించారు. ఆర్థరైటిస్ యునైటెడ్ స్టేట్స్లో అత్యంత విస్తృతమైన ఆరోగ్య పరిస్థితులలోఒకటి. ఇది మొత్తం ప్రతి నలుగురిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అది 54 మిలియన్లకు పైగా పురుషులు మరియు మహిళలుదీనికి బాధితులుగా ఉన్నారు. అమెరికన్ల యొక్క ఆరోగ్యంపై జరిగిన సర్వే లో ఈ సంఖ్యను గుర్తించడానికి, సిడిసి, ఆర్థరైటిస్ ఫౌండేషన్ మరియు ఇతర భాగస్వాములు మే నెలను లో ఆర్థరైటిస్ అవగాహన నెలను పాటిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ ఆర్తరైటిస్ దినంగా అక్టోబర్ 12
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు : అక్టోబర్ 12
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |