Daily Current Affairs in Telugu 08-11-2020
నౌకా యాన శాఖకు నూతన పేరు మార్పునూ ప్రకటించిన ప్రదాని నరేంద్ర మోడి:

కేంద్రనౌకాయాన శాఖను విస్తరిస్తూ పేరు మారుస్తూ ఉన్నట్లు ప్రదాని నరేంద్ర మోడిగారు నవంబర్ 08న ప్రకటించారు. ఇక పై ఈ శాఖ ను నౌకాశ్రాయలు,నౌకా యానం,జల మార్గాల మంత్రిత్వ శాఖ గా మారుస్తున్నట్లు వెల్లడించారు. గుజరాత్లోని హాజిరా (సూరత్) నుంచి ఘోఘా (భావ నగర్ జిల్లా) వరకు రోపాక్స్ (బహుళ ప్రయోజనాలతో కూడిన) నౌక సేవలను ప్రారంబి0చిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆత్మనిర్బార్ భారత్ లో బాగంగా దేశంలో సముద్ర ప్రాంతం చాలా కీలకమన్న ప్రదాని నౌకయాన మంత్రిత్వ శాఖను విస్తరిండానికి మరో గొప్ప ముందదగుగా అబివర్ణించారు. అబివృద్ది చెందిన దేశాల్లో చాలా చోట్ల నౌకయా శాఖే నౌకా శ్రాయలు,జలమార్గాలు బాద్యతలను కూడా చూస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేసారు. భారత్లోను ఈ శాఖా నౌకాశ్రయాలు,జలమార్గాలు సంబంధించి చాలా చేయాల్సి ఉందని అన్నారు. పేరులో స్పష్టత తేవడం ద్వారా పనిలోనూ మార్పు తీసుకురావచ్చని ప్రదాని అన్నారు.
రోపాక్స్ యొక్క ప్రత్యేకతలు :
- హాజిరా ఘోఘాల రోడ్డు మార్గ౦ 370 కి.మీలు కాగా సముద్ర మార్గం లో రోపక్స్ నౌకాయానం ద్వారా అది 90కిమీ లకు తగ్గుతుంది.4గంటల సమయం అదా అవుతుంది.
- 3 అంతస్తులలో ఉండే ఈ నౌక ఓక విడతలో 500 మంది ప్రయానికులను తీసుకువెలుతుంది.
- ఈ నౌకలో 30 ట్రక్కులు ,100కార్లను రవాణా చేయగలిగే చోటు ఉంటుంది. రోజుకు 3 ట్రిప్పులు నడుపుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నౌకా యాన శాఖకు నూతన పేరు మార్పునూ ప్రకటించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: గుజరాత్లోని హాజిరా
ఎప్పుడు: నవంబర్ 08
జపాన్ చక్రవర్తి వాసుడిగా పుమిహిట్ ప్రమాణ స్వీకారం :

జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు సింహాసనానికి తదుపరి వారసుడిగా ప్రకటితుడైన పుమిహిటో నవంబర్ 08న నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ ఉత్సవం గత ఏడు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈయన జపాన్ లో ప్రిన్స్ అకిశినో గా సుపరిచితుడు. ఈ ఉత్సవం లో మరిన్ని రాచరిక వారసత్వ కార్యక్రమాలు ఉన్నాయి. 86 చక్రవర్తిగా అకిహిటో పదవి విరమణ అనంతరం నరుహితో సింహాసం అధిస్టించగానే ఆయన వారసుడిగా పుమిహితోను ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జపాన్ చక్రవర్తి వాసుడిగా పుమిహిటో ప్రమాణ స్వీకారం
ఎవరు: పుమిహిటో
ఎక్కడ:జపాన్
ఎప్పుడు: నవంబర్ 08
అమెరికాలో ని మిషిగన్ ప్రతినిదుల సభకు భారతీయ వ్యక్తి ఎన్నిక :

అమెరికాలో మిషిగన్ ప్రతినిధుల సభకు ఒక భారతీయుడు ఎన్నికయ్యాడు.కర్నాటక రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ తానేదార్ (65) డెమొక్రాట్ల తరపున 90శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. శ్రెనివాస్ విజయం తో అయన స్వస్తలం బెలగావి లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాస్ కర్నాటక లోని బెలగావి లో పుట్టి పెరిగారు.గేయ రచయితగా శాస్త్రవేత్త గా,వ్యాపార వేత్తగా అమెరికా లో అయన సుపరిచితులు. 1977 లో బాంబే యునివర్సిటీ నుంచి కేమిస్త్రిలో పిజి పట్టాను పొందారు. తరువాత ఉన్నత చదువుల కోసం 1979 లో అమెరికాకు వెళ్లి ,1982లో పాలిమర్ కేమిస్త్రిలో పి,హెచ్.డి పట్టాను పొందారు. 1982-84 మద్య యువివర్సిటి ఆఫ్ మిషిగన్ లో ప్రొఫెసర్ గా అయన పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికాలోని మిషిగన్ ప్రతినిదుల సభకు భారతీయ వ్యక్తి ఎన్నిక
ఎవరు: శ్రీనివాస్ తానేదార్
ఎక్కడ: అమెరికాలో ని మిషిగన్
ఎప్పుడు: నవంబర్ 08
అమెరికా ఉపద్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ :

అగ్రరాజ్యం అమెరికాలో రెండో అత్యున్నత స్థానానికి ఎన్నిక అయిన తొలి మహిళా గా భారత సంతతి అయిన వ్యక్తి గా కమల హ్యారిస్ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇదే కాకుండా పలు దేశాలలో యుకె.కెనడా,సింగపూర్ ,న్యూజిలాండ్ ,ఇలా పలు దేశాలలో భారత సంతతి వ్యక్తులు నాయకత్వ స్థానాలకు ఎదిగి తమదైన ముద్ర వేస్తున్నారు.
గతం లో ఐక్రరాజ్య సమితి లో అమెరికా రాయబారిగా వ్యవహరించిన నిక్కి హెలి (48) 2024 లో రిపబ్లికన్ పార్టీ తరపున అద్యక్ష స్థానానికి కూడా పోటీ పడే అవకాశం ఉంది. అలాగే కెనడా పార్లమెంట్ కు సజ్జన్ తొలి సారి 2015 లో దక్షిణ వంకువార్ నియోజక వర్గం నుంచి ఎన్నిక అయ్యారు. న్యుజిలాండ్ పార్లమెంట్ లో మలయాళం లో మాట్లాడి ప్రపంచాన్ని ఆశ్చర్యం లో ముంచిన మహిళా నేత ప్రియంక్ రాధా కృష్ణన్ 2017,19 సంవత్సరాల్లో లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ లో సబ్యురలిగా లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సబ్యురలిగా ఎన్నికయ్యారు. సింగపూర్ పార్లమెంట్ లో 2020 జులై లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 93స్థానాల్లో పోటీ చేసిన వర్కర్స్ యునియన్ పార్టీ 10 చోట్ల గెలిచింది. ఈ పార్టీ కి చెందిన అద్యక్షుడు భారతి సంతతికి చెందిన వాడైన ప్రీతం సింగ్. దేశం లో ప్రతిపక్ష ౦గ అధికారం లో గుర్తింపు పొందినధీ ఈయన పార్టీనే.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా ఉపద్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్
ఎవరు: కమలా హ్యారిస్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: నవంబర్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |