
Daily Current Affairs in Telugu 30-11-2020
లోక్ సభ సెక్రెటరి జనరల్ గా ఉత్పల్ కుమార్ సింగ్ నియామకం :

లోక్ సభ సెక్రటరి జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉత్పల్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న స్నేహలతా వాస్తవ పదవి కాలం నవంబర్ 30తో ముగియడంతో ఆ స్థానంలో ఉత్పల్ కుమార్ ను నియమిస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నట్లు లోక్ సభ సచివాలయం నవంబర్ 30జారీ పేర్కొంది. ప్రస్తుతం లోక్ సభ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి పాటు కేబినేట్ సెక్రటరి ర్యాంకు కల్పించారు. డిసెంబర్ 01 నుంచి 2021 నవంబర్ 30 వరకు ఈ పదవిలో కాంట్రాక్ట్ పద్దతిలో కొనసాగుతారు. 1986 వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఉత్పల్ కుమార్ ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా ఈ ఏడాది జులై 31 న పదవి విరమణ చేసారు. 34ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన ఆయన సెప్టెంబర్ 1న లోక్ సభ సెక్రటరి గా నియమితులయ్యారు. మూడు నెలల్లో సెక్రటరి జనరల్ హోదా పొందారు. మరో వైపు పదవి విరమణ చేసిన స్నేహ లత శ్రీవాస్తవ కొత్తగా ఏర్పాటు చేసిన సభా గౌరవ అధికారి (హనరరి ఆఫీసర్ ఆఫ్ ది హౌస్ ) పోస్టులో నియమితులయ్యారు. నవంబర్ 30 నుంచి ఆమె ఈ కొత్త బాద్యతలు చేపడుతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : లోక్ సభ సెక్రెటరి జనరల్ గా ఉత్పల్ కుమార్ సింగ్ నియామకం
ఎక్కడ: న్యుడిల్లి
ఎవరు : ఉత్పల్ కుమార్ సింగ్
ఎప్పుడు : నవంబర్ 30
బాఫ్టా బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్ గా నియమితులయిన సంగీత దర్శకుడు ఎ.ఆర్ రహమాన్ :

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవందక్కింది. బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఆయనకు “బాఫ్టా బ్రేక్ త్రూ ఇన్షియేటివ్” అంబాసిడర్ గా నవంబర్ 30 నియమించింది. జ్యూరి సభ్యులు నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఆయన మన దేశంలో ని సినిమా క్రీడలు టెలివిజన్ తో రంగాల్లో ప్రతిభావంతమైన కళాకారులను గుర్తించ నున్నారు. భారత్ నుంచి అద్బుతమైన ప్రతిభను వెలికి తీసే ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం రావడం సువర్ణ అవకాశం భావిస్తున్నాను అని రెహమాన్ గారు తెలిపారు. ఈయన తెలుగు తమిళ సినిమాలతో అనుబందం గా ఎ.ఆర్ రహమాన్ చేస్తున్న సేవలు బాఫ్టాకి విస్తృతంగా ఉపయోగపడతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాఫ్టా బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్ గా నియమితులయిన సంగీత దర్శకుడు ఎ.ఆర్ రహమాన్
ఎక్కడ: ఎ.ఆర్ రహమాన్
ఎప్పుడు: నవంబర్ 30
2020 లో అత్యధికంగా సెర్చింగ్ లో ఉన్న పదం గా ప్యాండ మిక్ పదం :

ఈ ఏడాది 2020 సంవత్సరంలో తమ వెబ్ సైట్లో అత్యదికంగా వెతికిన పదం ప్యాండమిక్ (మహమ్మారి) అని మెరియం వెబ్ స్టర్,డిక్షన్.కాం నవంబర్30న ప్రకటించాయి. రెండు డిక్షనరీ సంస్థలు తమ వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఒకే పదాన్ని ప్రకటించడం ఇదే మొదటి సారి. గత ఏడాది మార్చి 11న నమోదైన శోదన లతో పోలిస్తే 11,5,806 శాతం ఎక్కువగా ప్యాండమిక్ పదం అర్థం కోసం శోదించినట్లు మెరియం వెబ్ స్టర్ ఎడిటర్ పీటర్ సోకోలోస్కి ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. అదే రోజున తమ వెబ్ సైట్ లో 13500 శాతం కన్నా ఎక్కువగా ప్యాండమిక్ పదాన్ని వెతికినట్లు డిక్షనరీ కాం సీనియర్ ఎడిటర్ జాన్ కెళ్ళి తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2020 లో అత్యధికంగా సెర్చింగ్ లో ఉన్న పదం గా ప్యాండ మిక్ పదం
ఎప్పుడు : నవంబర్ 30
అమెరికా అద్యక్షుడి గా ఎన్నికైన జో బైడేన్ బృందం లో బడ్జెట్ చీఫ్ గా భారతీయ అమెరికన్ ఎంపిక :

అమెరికా తదుపరి అద్యక్షుడిగా ఎన్నికైన జో బైడేన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ మహిళా కు కీలక హోదా లబించింది. డైరెక్టర్ ఆఫ్ ది ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ కోసం 50 నీరా టాండన్ ను బైడెన్ ఎంపిక చేసారు. ఈ మేరకు బైడెన్ నవంబర్ 30-11-2020 ప్రకటించారు. ఈ బాద్యతలు చేపట్టనున్న తొలి నల్లజతియురలిగా ఆమె ప్రత్యేకత చాటు కున్నారు. ఆ హోదాలో ప్రభుత్వ బడ్జెట్ విధానాలను నీరా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఆర్ధిక మంత్రిగా జానెట్ యేల్లెన్ ఎంపికను బైడెన్ అధికారిగా ప్రకటించారు. యేల్లెన్ నేతృత్వంలో ప్రబుత్వ విధానాలు రూపొందించేందుకు ఉదారవాద ఆర్ధిక సలహాదారుల బృందాన్ని తయారు చేసుకునే ప్రణాళికలో బాగంగా నీరా బైడెన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా అద్యక్షుడి గా ఎన్నికైన జో బైడేన్ బృందం లో బడ్జెట్ చీఫ్ గా భారతీయ అమెరికన్ ఎంపిక
ఎవరు : నీరా టాండన్
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు : నవంబర్ 30
గిల్గిత్ బాల్టిస్తాన్ పీటం ను దక్కించుకున్న తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ :

గిల్గిత్ బాలిస్తాన్ లో పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కొత్త ముఖ్యమంత్రి గా ఆ పార్టీ కి చెందిన నేతగా ఖలిద్ ఖుర్షీద్ నవంబర్ 30 ఎన్నిక అయ్యారు. ఇప్పటి కే స్పీకర్ పదవిని ఆ పార్టీ నేత అంజాద్ అలీ చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 23 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఇమ్రాన్ పార్టీ 10 స్థానాలకు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. స్వాతంత్ర్య అబ్యర్డులు 6స్థానాల్లో విజయం సాధించారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ లీగ్ నవాజ్ 2స్థానాల్లో విజయం సాధించాయి. జైమైత్ ఉలేమా ఇ ఇస్లాం పజిల్ మజ్లిస్ వాహదత్ ఇ ముస్లిమీన్ పార్టీలు చెరో స్థానం సాధించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : గిల్గిత్ బాల్టిస్తాన్ పీటం ను దక్కించుకున్నతెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ
ఎవరు : పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : పాకిస్తాన్
ఎప్పుడు : నవంబర్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |