
Daily Current Affairs in Telugu 03-12-2020
టైం కిడ్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు సాధించిన ఇండో అమెరికన్ బాలిక గీతాంజలి :

పదిహేనేళ్ళ వయసులోనే ఇండో అమెరికన్ గీతాంజలి రావు కు ఒక అరుదైన గుర్తింపు లబించింది. ప్రఖ్యాత టైం మేగజిన్ ఆ బాల శాస్త్ర వేత్తను “కిడ్ ఆఫ్ ది ఇయర్” గా గుర్తిoచింది.. తాగునీటి కాలుష్యం ,డ్రగ్స్ వాడకం సైబర్ వేధింపులు తదితర సమస్యలకు గీతాంజలి రావు కు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని టైమ్స్ ప్రశంసించింది. 5వేల మందితో పోటీ పడి ప్రతిష్టాత్మక టైం మ్యాగజిన్ తొలి కిడ్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు ను ఆమె సాధించింది. టైం మ్యాగజిన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలివుడ్ నటి ఎంజిలిన జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టైం కిడ్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు సాధించిన ఇండో అమెరికన్ బాలిక గీతాంజలి
ఎవరు: ఇండో అమెరికన్ బాలిక గీతాంజలి
ఎప్పుడు: డిసెంబర్ 03
ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం దక్కించుకున్న తెలంగాణా వాసి :

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణా వాసి నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన 25ఏళ్ల యువకుడు కోణం సందీప్ స్థానం దక్కించుకున్నాడు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొంచించిన 30 అండర్ 30 జాబితాలో సందీప్ పేరును కూడా చేర్చింది. ఈ నెల 01న అమెరికా లో దీనిని విడుదల చేసింది. కృత్రిమ మేధా ఆదారంగా పని చేసే మొబైల్ యాప్ రూపొందించినందుకు గాను సందీప్ కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాలలో వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాలు అత్యంత బద్రంగా రోగులకు వారి మాతృ బాషల్లోకి ఈ యాప్ తర్జుమా చేసి అందిస్తుంది అని తెలిపారు .2018లో డా.శివరావ్ తో కలిసి అమెరికా లో ని పిట్స్ బర్గ్ లో అబ్రిడ్జ్ పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ సంస్థను స్థాపించిన వైద్య రంగం లో ఎదురవుతున్న సవాళ్ళను పరిశోదనలు చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం దక్కించుకున్న తెలంగాణా వాసి
ఎవరు: కోణం సందీప్
ఎప్పుడు: డిసెంబర్ 03
దేశంలోనే అత్యుత్తమ పని తీరు కనబరుస్తున్న టాప్ 10పోలిస్ స్టేషన్ లో మొదటి స్థానం లో మణిపూర్ పోలిస్ స్టేషన్ :

దేశంలోనే అత్యుత్తమ పని తీరు కనబరుస్తున్న టాప్-10 పోలిస్ స్టేషన్లో మణిపూర్ కు తొలి స్థానం దక్కింది. తెలంగాణ లోని కరీం నగర్ జిల్లా జమ్మికుంట టౌన్ పదో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 03న కేంద్ర హోం శాఖా దీనిని విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించే స్టేషన్లు ప్రోత్సహించెందుకు పోలిస్ ల పనితీరు విషయంలో పోటీ పెంచేందుకు హోం శాఖ ఏటా తొలి పది స్టేషన్ లను ప్రకటిస్తుంది. ఈ ఏడాది కోవిడ్ కారణంగా సవాళ్ళను ఎదురైనా స్టేషన్ ల పని తీరు పై సర్వ్ ఆగలేదు. చిన్న పట్టణాలు ,గ్రామీణ ప్రాంత స్టేషన్ లే ఈ జాబితాలో ఎక్కువగా చోటు దక్కించుకున్నాయి. దేశంలోని 16,671 పోలిస్ స్టేషన్ల డేటాను విశ్లేషించి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి క్షేత్ర స్థాయి అభిప్రాయం సేకరించి అత్యుత్తమ స్టేషన్ లను వడపోత చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే అత్యుత్తమ పని తీరు కనబరుస్తున్న టాప్ 10పోలిస్ స్టేషన్ లో మొదటి స్థానం లో మణిపూర్ పోలిస్ స్టేషన్
ఎవరు: మణిపూర్ పోలిస్ స్టేషన్
ఎక్కడ: మణిపూర్
ఎప్పుడు: డిసెంబర్ 03
కోటక్ ఇండియా హురుణ్ జాబితాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచిన రోష్ని నాడార్ :

రోష్ని నాడార్ ,కిరన్ మజుందార్ షా,లీనా గాంధీ తివారి హెచ్సిఎల్ టెక్నాలజీ ,బయోకాన్ యుఎస్వి చైర్ పర్సన్ అయిన ఈ ముగ్గరు మహిళా పారిశ్రామిక వేత్తలు కోటక్ వెల్త్ హురుణ్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన కోటక్ వెల్త్ హురున్ లీడింగ్ వెల్తి వుమెన్ -2020 నివేదికలో మొదటి మూడు స్థానాలలో నిలిచారు. రోష్ని నాడార్ సంపద రూ.54,850 కోట్లు కాగా కిరన్ మజుందార్ షా సంపద రూ.36,600 కోట్లు ,లీనా గాంధీ తివారి సంపద రూ.21,340 కోట్లు అని ఈ నివేదిక తేల్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికీ పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాను కోటక్ వెల్త్ హురున్ ఇండియా డిసెంబర్ లో వెల్లడించాయి. ఈ నివేదిక తయారీలో కుటుంబ వ్యాపార వేత్తలు వ్రుత్తి నిపుణులు ,ఒత్సాహిక పారిశ్రామిక వేత్తలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో ధనిక మహిళలో మొదటి 100 మంది సగటు సంపద రూ.2,725కోట్లుగా ఉంది. ఇందులో 13మంది మహిళలు ఆంధ్రపదేశ్ నుంచి తెలంగణా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో దివీస్ లేబరేటరీస్ డైరెక్టర్ నీలిమ మోతపర్తి అగ్రస్థానం లో ఉన్నారు. ఆమె సంపద రూ.18,820కోట్లు ఆ తర్వాతి స్థానం లో రూ.4100 కోట్ల సంపద తో బయలాజికల్ లిమిటెడ్ ఎండి మహిమా దాట్ల మరికొందరు ఉన్నారు.
పేరు | సంపద (కొట్లలో) | సంస్థ | |
1 | రోష్ని నాడార్ మల్హోత్రా | 54,850 | హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ |
2 | కిరణ్ మజుందార్ | 36,600 | బయోకాన్ |
3 | లీనా గాంధీ తివారి | 21,340 | యుఎస్.వి |
4 | నీలిమ మోటపర్తి | 18,620 | దివీస్ లేబరేటరీస్ |
5 | రాదా వెంబు | 11,590 | జోహో |
క్విక్ రివ్యు :
ఏమిటి: కోటక్ ఇండియా హురుణ్ జాబితాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచిన రోష్ని నాడార్
ఎవరు: రోష్ని నాడార్
ఎప్పుడు: డిసెంబర్ 03
ప్రపంచ వికలాంగుల దినోత్సవం గా డిసెంబర్ 03 :

వికలాంగుల ప్రపంచ దినోత్సవాన్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (IDPWD) అని కూడా అంటారు. దీనిని 1992 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రారంభించింది వికలాంగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత కరుణతో మరియు అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయపడే రోజుగా డిసెంబర్ 3 న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా ప్రకటించారు. సమాజం మరియు అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలలో వికలాంగుల హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశాలలో వికలాంగుల కు అవకాశాల పరిస్థితిపై అవగాహన పెంచడం దీని లక్ష్యం
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ వికలాంగుల దినోత్సవం గా డిసెంబర్ 03
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: డిసెంబర్ 03
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |