Daily Current Affairs in Telugu 20-10-2020
కరోన వ్యాక్సిన్ తయారికి హ్యూమన్ చాలెంజ్ విధానం చేపడుతున్న తొలి దేశం బ్రిటన్ :

బ్రిటన్ ప్రభుత్వం కొంత మంది ఆరోగ్యవంతులైన యువతకు కరోనా వైరస్ ను అంటించనుంది. కరోనా వ్యాక్సిన్ ను అబివృద్ది చేసే ప్రక్రియలో బాగంగా నే హ్యూమన్ చాలెంజ్ అద్యయనం గా పిలిచే ఈ పరిశోదనలో టీకాల పని తీరు ను పరిరక్షించడానికి సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవారికి వైరస్ ను ఎక్కించి ప్రయోగాలు చేస్తారు. ఇలా ప్రయోగాల కోసం వైరస్ బారిన పడేలా చేయడం ప్రమాదకరం.అని అనైతిక మని అన్న కారణాలతో ఈ విధానం వివాదాస్పదం అయింది. గతం లో టైపాయిడ్,కలరా,మలేరియా తదితర వ్యాధులకు టీకాను తయారు చేయడంలో ఈ విధానాన్ని అనుసరించారు. కరోనా టీకా కు సంబంధించి ఈ విధానం లో ప్రయోగాలు జరపబోతున్న తొలి దేశంగా బ్రిటన్ దేశం నిలవనుంది. కరోన కు అత్యంత వేగంగా సమర్ధవంతమైన సురక్షిత మైన టీకాను అబివృద్ది చేయాలంటే హ్యూమన్ చాలెంజ్ అత్యవసరమని బ్రిటన్ పరిశోధకులు భావిస్తున్నారు.లండన్ లో ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన పరిశోధకులు బృందం ఆద్వర్యంలో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: కరోన వ్యాక్సిన్ తయారికి హ్యూమన్ చాలెంజ్ విధానం చేపడుతున్న తొలి దేశం బ్రిటన్ :
ఎవరు: బ్రిటన్ :
ఎక్కడ: బ్రిటన్ :
ఎప్పుడు: అక్టోబర్ 20
నూతనంగా వై.ఎస్సార్ భీమా పథకంను ప్రారంబించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

రాష్ట్రము లో రైస్ కార్డు ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూర్చే “వై.ఎస్సార్ భీమా పథకాన్ని” సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయం లో అక్టోబర్ 21 న ప్రారంబించనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్ది దారులు తరపున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం ఈ పథకం ద్వారా రూ.510 కోట్లను ఖర్చు చేస్తుంది.18నుంచి 70ఏళ్ల లోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికీ ఈ పథకం వర్తిస్తుంది. 18నుంచి 50ఏళ్ల వయసున్న లబ్దిదారులు సహజ మరణం పొందితే రూ.2లక్షలు ప్రమాదవశాత్తు మరణించిన వారికీ ,పూర్తి అంగవైకల్యం పొందినా రూ.5 లక్షల భీమ పరిహారంను నామినికి అందిస్తారు. 51 నుంచి 70 ఏళ్ల లోపు వయసున్న లబ్ది దారులు ప్రమాదవశాత్తు మరణించిన వారికీ ,పూర్తి అంగవైకల్యం పొంది నామినికి రూ.3లక్షలు పరిహారం అందుతుంది. 18-70 ఏళ్ల లోపు వయసున్న లబ్ది దారులు ప్రమాదవశాత్తు ,పాక్షిక అంగవైకల్యం పొందితే రూ.1.50 లక్షల భీమా పరిహారం అందిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నూతనంగా వై.ఎస్సార్ భీమా పథకంను ప్రారంబించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 20
ఆసియా పవర్ ఇండెక్స్ 2020 జాబితాలో 4 వ అత్యంత శక్తివంతమైన దేశం గా నిలిచిన భారత్:

ఆస్ట్రేలియాలోని సిడ్నీ కి చెందిన లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2020 జాబితాలో 100 లో 39.7 స్కోరు సాధించి 4వ స్థానంలో భారతదేశం నిలిచింది. ఆసియాలోని దేశాల కు సంబంధించిన వారి వారి శక్తి ని అంచనా వేయడానికి ఆసియా పవర్ ఇండెక్స్ 2020 26 దేశాల యొక్క భుబాగాల దృష్ట్యా మరియు వారి వనరుల ఆదారంగా వీటిని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత దేశంగా అమెరికా 81.6 స్కోరుతో మొదటి స్థానం లో నిలిచింది. ఆ తరువాత చైనా (76.1),జపాన్ (41) స్కోరుతో రెండవ,మూడవ స్థానం లో నిలిచాయి. ఇది ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఒక విశ్లేషనాత్మక మైన సాధనం. దీని ద్వారా దేశాల వద్ద ఉన్న వారి వారి వనరుల మరియుప్రభావం ఆదారంగా ఆధిపత్య శక్తి ని అంచనా వేస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆసియా పవర్ ఇండెక్స్ 2020 జాబితాలో 4 వ అత్యంత శక్తివంతమైన దేశం గా నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: అక్టోబర్ 20
ప్రపంచ గణాంక దినోత్సవం గా అక్టోబర్ 20:

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అక్టోబర్ 20 రోజును ప్రపంచ గణాంక దినోత్సవ౦ గా జరుపుకుంటారు. అలాంటి మొదటి రోజును అక్టోబర్ 20, 2010 న జరుపుకుంది. ఈ సంవత్సరం ప్రపంచం మూడవ ప్రపంచ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రామాణికత మరియు విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ ఈ రోజును ప్రపంచ గణాంక దినోత్సవంగా గుర్తించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ గణాంక దినోత్సవం గా అక్టోబర్ 20:
ఎవరు: ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్
ఎప్పుడు: అక్టోబర్ 20
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |