Daily Current Affairs in Telugu 18-11-2020
శ్రీలంక వైమానికదళ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా పైలెట్ల నియామకం :

శ్రీలంక వైమానిక దళoలో ఆ దేశ చరిత్రలోనే తొలి సారిగా ఇద్దరు మహిళా పైలెట్లను నియమించడంపై భారతదేశం అబినందనలు తెలిపింది. హైదరాబాద్ లో ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమి లో 2018-19 మద్య శిక్షణ తీసుకున్న ఏడిపిఎల్.గుణరత్న ,ఆర్టి వీరవదనే అనే ఇద్దరు మహిళా పైలట్లు నవంబర్ 18న శ్రీలంక వైమానిక దళ విధుల్లో చేరారు. దీనిపై అక్కడి భారత హైకమిషన్ కార్యాలయంలో నుండి ఒక ప్రకటన విడుదల చేసింది. అది శ్రీలంకకే కాదు భారత్ కు కూడా సంతోషకర విషయం అని తెలిపింది. విదేశి సైనిక దళాల శిక్షణ కోసం భారత్ ఏర్పాటు చేసిన సీట్లలో శ్రీలంకకు సగం కన్నా ఎక్కువ కేటాయించి నట్లు తెలిపింది. ఈ శిక్షణ కార్యక్రమం రెండు దేశాల మద్య ద్వైపాక్షిక సంబందాల బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: శ్రీలంక వైమానికదళ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా పైలెట్ల నియామకం
ఎవరు: ఏడిపిఎల్.గుణరత్న ,ఆర్టి వీరవదనే
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: నవంబర్ 18
స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్ లో మూడో స్థానం లో భారత్ తరపున నిలిచిన విశాఖ:

అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగర౦ మూడో స్థానంను దక్కించుకుంది. స్పెయిన్ లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్ -2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. లివింగ్ అండ్ ఇంక్లుజన్ అవార్డు అనే కేటగిరిలో మోస్ట్ ఇన్నోవేషన్ అండ్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోనే 20 నగరాలు పోటీ పడగా విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ఆల్ ఎబిలిటీ పార్క్ లివింగ్ అండ్ ఇంక్లుజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరిల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్ పో లో ప్రపంచం నలుమూలాల నుంచి 46 నగరాలు పాల్గొనగా భారత్ నుంచి కేవలం విశాఖ పట్నం మాత్రమే అర్హత సాధించింది. ఈ ఎక్స్ పోలో నవంబర్ 18 న ఆయా కేటగరీ లలో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అబివృద్ది ప్రాజెక్టు తో బ్రెజిల్ విజేతగా నిలవగా అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించే ప్రాజెక్టుతో టర్కీ దేశం లోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానం లో నిలించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్ లో మూడో స్థానం లోభారత్ తరపున నిలిచిన విశాఖ
ఎవరు: విశాఖపట్నం
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం
ఎప్పుడు: : నవంబర్ 18
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన కరాచి కింగ్స్ జట్టు:

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పి.ఎస్ఎల్) టి20క్రికెట్ టోర్నీ ఫైనల్లో కరాచి కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో లాహోర్ ఖలందర్స్ జట్టును ఓడించి పాకిస్తాన్ సూపర్ లీగ్ లోనే ఒక నూతన జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో కరాచి కింగ్స్ ఓపెనర్ అయిన బాబర్ ఆజం (46బంతుల్లో 63) అర్థ సెంచరీతో చెలరేగాడు లాహోర్ ఖలందర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికేట్లకు గాను 134 పరుగులు చేసింది. 135 పరుగుల లక్ష్యాన్ని కరాచి కింగ్స్ 18.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించి విజేతగా అవతరించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన కరాచి కింగ్స్ జట్టు
ఎవరు: కరాచి కింగ్స్ జట్టు
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: : నవంబర్ 18
అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా రచించిన “ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం” :

అమెరికా దేశ 44వ అద్యక్షుడు అయిన బరాక్ ఒబామా గారు రచించిన “ఎ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకంను నవంబర్ 17న విడుదల చేసారు. ఈ పుస్తకం బరాక్ ఒబామా తీసుకొచ్చిన రెండు సంపుటాలలో ఇది మొదటిది . 2008 అప్పటి అమెరికా అద్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి తొలి విడత అద్యక్ష పదవి పదవి కాలం ముగిసే వరకు జరిగిన సంఘటనలు మరియు అయన అనుభవాలను బరాక్ ఒబామా గారు ఈ పుస్తకం లో వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థ ప్రచురణ సంస్థ అయిన పెంగ్విన్ ర్యాండం హౌస్ ఒబామా యొక్క ప్రస్తానాన్ని రెండు భాగాలుగా ప్రచురించింది. అందులో బాగంగా తొలి భాగం అయిన ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకంను నవంబర్ 17న విడుదల చేసారు. ఆయన భార్య మిషెల్ ఒబామా కూడా వైట్ హౌస్ లో జరిగిన తన అనుబావాలను గురించి “బికమింగ్ “అనే ఒక పుస్తకం ద్వారా వెల్లడించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం
ఎవరు: బరాక్ ఒబామా
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: : నవంబర్ 18
గోవా రాష్ట్ర మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత:

గోవా రాష్ట్ర మాజీ గవర్నర్ రచయిత్రి మృదులాసిన్హా (77) నవంబర్18న కన్నుమూసారు. డిల్లిలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. బీహార్ లో జన్మించిన ఆమె భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కార్యనిర్వాహక సభ్యురాలిగా చాల కాలం పాటు పని చేసారు. అనంతరం గోవా రాష్ట్ర గవర్నర్ గా 2014లో నియమితులయ్యారు. సాంస్కృతిక సాంప్రదాయ విషయాలపై ఆమె అద్బుతమైన రచనలు చేసారు. మారెనో పుస్తకాలు రాసారు. 2017 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతిపెద్ద పార్టీగా అవతరిచిన కాంగ్రెస్ ను కాకుండా బిజెపి పార్టీ ని గోవా గవర్నర్ ఆహ్వానించి ఆమె విమర్శలు మూటగట్టుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గోవా రాష్ట్ర మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత
ఎవరు: మృదులా సిన్హా
ఎక్కడ: గోవా రాష్ట్రo
ఎప్పుడు: : నవంబర్ 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |