
Daily Current Affairs in Telugu 01-10-2020
శత్రు ట్యాంకులను నాశనం చేసే విద్వంసక లేసర్ గైడెడ్ క్షిపణి ఎటిజిఎంను విజయవంతగా ప్రయోగించిన భారత్

:
శత్రు ట్యాంకులను ద్వంసం చేసే లేజర్ గైడెడ్ క్షిపణి (ఎటిజిఎం) ని భారత్ అక్టోబర్ 01 విజయవంతంగా పరేక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న కేకే రెంజేస్ లో ఈ పరీక్ష జరిగింది.స్వదేశి పరిజ్ఞాన౦ తో రూపొందించిన ఈ క్షిపణి 5-10 కిలో మీటర్ల దూరంలోని శత్రు ట్యాంకులను ద్వంసం చేయగలదు.ఈ అస్త్రాన్ని పరీక్షించడం ఇది రెండో సారి ఏక వేదికల నుంచి ప్రయోగి౦చేల ఎటిజిఎం ను తీర్చిదిద్దారు.ప్రస్తుతం దేశీయంగా తయారైన అర్జున్ ట్యాంకు లో ని 120 ఎంఎం గన్ నుంచి దీన్ని పరీక్షిస్తున్నారు.ఎటిజిఎం ను విజయవంతంగా పరీక్షించడం పై రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ డిఆర్డివో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అబినంధించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: శత్రు ట్యాంకులను నాశనం చేసే విద్వంసక లేసర్ గైడెడ్ క్షిపణి ఎటిజిఎం ను ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ : మహారాష్ట్రలోని అహ్మద్ నగర్
ఎప్పుడు: అక్టోబర్ 01
సిఎస్ఐఆర్ అవార్డును దక్కించుకున్న ఐఐసిటి డాక్టర్ శ్రీదర్ :

హైదరాబద్ లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త ఐఐసిటి డాక్టర్ ఎస్.శ్రీదర్ కు సిఎస్ఐఆర్ అవార్డు ఫర్ ఎస్ అండ్ టి ఇన్నోవేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (సిఎఐఆర్డి) అవార్డు లబించింది.ఐఐసి టి లోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ విభాగానికి అద్యక్షుడిగా పని చేస్తున్న డాక్టర్ శ్రీదర్ ను 2017కి గాను ఈ అవార్డు కు ఎంపిక చేసినట్లు ప్రకటించారు.తెలంగాణా ఎపి కర్ణాటక తమిళనాడు లో తాగు నీటి శుద్ధి కోసం శ్రీదర్ అబివృద్ది చేసిన నానో ఫిల్టరేషన్ ఆస్మసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరో సిస్ నివారణకు శ్రీదర్ చేసిన కృషికి పలువురుచే ప్రశంసలు అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సిఎస్ఐఆర్ అవార్డును దక్కించుకున్న ఐఐసిటి శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదర్
ఎవరు: డాక్టర్ శ్రీదర్
ఎప్పుడు: అక్టోబర్ 01
గ్రామోదయ బంధుమిత్ర పురక్స్కారాన్ని గెలుచుకున్న ఎంపి సంతోష్ కుమార్ :

గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సబ్యుడు జిగినిపల్లి సంతోష్ కుమార్ ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది.మహాత్మా గాంధీ 150 వ జన్మదిన సందర్బంగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జికాట్ ) ప్రతినిధులు ఈ అవార్డును అక్టోబర్ 01 సంతోష్ కుమార్ గారికి అందజేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గ్రామోదయ బంధుమిత్ర పురక్స్కారాన్ని గెలుచుకున్న ఎంపి సంతోష్ కుమార్
ఎవరు: ఎంపి సంతోష్ కుమార్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 01
టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభా రాజు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాసురలిగా పద్మ శ్రీ డాక్టర్ శోబ రాజు ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వ దేవాదాయ కార్యదర్శిగా పని చేస్తున్న గిరిజా శంకర్ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది టిటిడి బోర్డు ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.ఈ పదవిలో ఆమె రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభా రాజు నియామకం
ఎవరు: శోభా రాజు
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 01
ఐఏ సిసి జాతీయ అద్యక్షుడిగా పూర్ణచందర్ రావు ఎన్నిక :

ఇండో అమరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసిసి) జాతీయ అద్యక్షుడిగా 2020-21 సంవత్స రానికి గాను గ్లోబల్ ఇంఫోవిజన్ ఎండి పూర్ణ చందర్ రావు సూరపనేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.52ఏళ్ల చరిత్ర కలిగిన ఐఏ సిసి కి ఈ పదవికి అలంకరించిన రెండవ తెలుగువాడు కావడం విశేషం. 2018-20 కాలానికి ఐఏ సిసి జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వర్తించారు..భారత్ యుఎస్ వ్యాపార సంబందాలు వాణిజ్యం మరింత మెరుగుపరచేందుకు దోహదం చేస్తుందని ఐఏ సిసి భావిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐఏసిసి జాతీయ అద్యక్షుడిగా పూర్ణచందర్ రావు ఎన్నిక
ఎవరు: పూర్ణచందర్ రావు
ఎప్పుడు: అక్టోబర్ 01
విమానం లో అత్యాధునిక బద్రతా వ్యవస్థ ను కలిగిన్ బోయింగ్ -777 ప్రవేశ పెట్టిన భారత్ :

అమెరిక అద్యక్షుడు ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వాన్ విమానం తరహాలోనే మన దేశంలో వివిఐపి లు ప్రయానించడం కోసం ప్రత్య్కేగా త యారు చేసిన ఎయిర్ ఇండియా వాన్ అమెరికా నుంచి భారత్ కు చేరుకుంది. అత్యంత ఆధునిక బద్రత వ్యవస్థ కలిగిన బోయింగ్ 777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి డిల్లి విమానాశ్రయానికి చేరుకుంది.సెప్టెంబర్ 30 మద్యాహ్నం 3 గంటల ప్రాంతం లో ఈ విమానం చేరుకున్నట్లు పౌర విమానం యానం శాఖ అధికారులు వెల్లడించారు.ఈ విమానం లో ప్రదాని మోడి రాష్ట్రపతి రా౦ నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రమే ప్రయనిస్తారు. వివిఐపి లు ప్రయానించే౦దుకు వీలుగా దీనిని డిజైన్ చేసారు. క్షిపనులని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి వాటిని ఆధునికరించడం కోసం రెండు విమానాలను డల్లాస్ బోయింగ్ సంస్థ కు పంపారు. ఈ విమానం పై భారత్ అనే అక్షరాలు. అశోక చక్రం ఉన్నాయి. గత జులై లోనే ఈ విమానాలు భారత్ కు రావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యం అయింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: విమానం లో అత్యాధునిక బద్రతా వ్యవస్థ ను కలిగిన్ బోయింగ్ -777 ప్రవేశ పెట్టిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు:అక్టోబర్ 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |