Daily Current Affairs in Telugu 24-11-2020
సౌది అరేబియా నేతృత్వం లో జరిగిన జి-20సమావేశాలు :

గ్రూప్ ఆఫ్20 (జి-20) దేశాల 15 శికరాగ్ర సమావేశాలు సౌదిఅరేబియా నేతృత్వంలో 2020 నవంబర్ 21,22 తేదిలలో వర్చువల్ విధానంలో జరిగాయి. షెడ్యుల్ ప్రకారం ఈ సమావేశం ను సౌది అరేబియా దేశ రాజదాని అయిన రియాద్ లో నిర్వహించవలసి ఉంది..అయితే కోవిడ్-19వైరస్ కారణంగా సదస్సును వర్చువల్ పద్దతిలోనే నిర్వహించారు. ఈ సదస్సును తొలి సారి నిర్వహించిన అరబ్ దేశంగా సౌది అరేబియా నిలిచింది. సౌది అరేబియా దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ లాజిజ్ అల్ సౌద్ సదస్సుకు నేతృత్వంవహించారు. కాగా 2023లో జరగనున్న జి-20బేటీకి భారత దేశం అతిత్యం ఇవ్వనుంది. ఈ జి-20 సదస్సు యొక్క థీం “రియలైజింగ్ అపర్చునిటిస్ ఆఫ్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరి ఫర్ అల్” కాగా భారత్ నుంచి ప్రదాని నరేంద్ర మోడి గారు ఈ సదస్సులో నవంబర్ 21,22 వ తేదిలలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. మరియు ఈ సమావేశంలో సేఫ్ గర్దింగ్ ది ప్లానెట్ :ది సర్క్యులర్ కార్బన్ ఎకనమి అనే అప్రోచ్ అనే అంశం పైన ఆయన మాట్లాడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సౌది అరేబియా లో జరిగిన జి-20సమావేశాలు :
ఎవరు: సౌది అరేబియా
ఎక్కడ: నవంబర్ 24
భూమిపైకి చంద్రుడి నమూనాలను సేకరణకు విజయవంతంగా వ్యోమనౌకను పంపిన చైనా దేశం :

చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమి పైకి రప్పించేందుకు చైనా నవంబర్ 24న సంక్లిష్ట అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. చాంగే -5 అనే మానవ రహిత వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. జాబిల్లి నుంచి నమూనాలను తెచ్చేందుకు మానవాళి ప్రయత్నించడం గత 40సంవత్సరాలలో ఇదే తొలి సారి. వెంచాంగ్ రోదసి కేంద్రం నుంచి లాంగ్ మార్స్ అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 24 తెల్లవారు జామున 4.30 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లి నిర్దేశిత భూ కక్ష్యలోకి చాంగే-5 ను చేరవేసింది. అనంతరం ఈ వ్యోమ నౌక చంద్రుడి దిశంగా పయనాన్ని చాంగే-5లో ఆర్బిటర్ ల్యాండర్ అసేండర్ రిటర్నర్ అనే నాలుగు స్వతంత్ర భాగాలు ఉన్నాయి. ఇంతకూ ముందు దశాబ్దాల కిందట చంద్రుడి నుంచి నమూనాలను తెచ్చే౦దుకు అమెరికా వ్యోమగాములను పంపింది. సోవియెట్ యునియన్ మాత్రం మానవరహిత వ్యోమనౌకలను ప్రయోగించింది.శాంపిల్ లను సేకరించాక అవి చంద్రుడి నుంచి బయలు దేరి నేరుగా భూమికి తిరిగి వచ్చాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భూమిపైకి చంద్రుడి నమూనాలను సేకరణకు విజయవంతంగా వ్యోమనౌకను పంపిన చైనా దేశం
ఎవరు: చైనా దేశం
ఎక్కడ: చైనా
ఎక్కడ: నవంబర్ 24
భారత్ నుంచి తొలి ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డు కు ఎంపిక అయిన “డిల్లి క్రైం” అనే వెబ్ సిరీస్ :

నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది విడుదలైన “డిల్లి క్రైం” వెబ్ సిరీస్ కి అరుదైన గౌరవం దక్కింది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ బెస్ట్ డ్రామా సిరీస్ విభాగం లో ఎమ్మి అవార్డు ను గెలుచుకుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి మొత్తం అయిదు నామినేషన్లు దక్కగా వాటి లో డిల్లి క్రైం కు ఈ అవార్డు లబించింది. 2019 లో విడుదల అయిన ఈ క్రైం డ్రామాను ఇండో కెనడియన్ ఫిలిం మేకర్ రిచి మెహతగారు తెరకెక్కించారు. కరోనా నేపద్యంలో ఎమ్మి అవార్డుల వేడుక ఆన్ లైన్ లో జరిగింది. ఈ అవార్డు ద్వారా భారత్ కు దక్కిన తొలి ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డు దక్కించుకున్న వెబ్ సిరీస్ గా ఇది నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ నుంచి తొలి ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డు కు ఎంపిక అయిన డిల్లి క్రైం అనే వెబ్ సిరీస్
ఎక్కడ: నవంబర్ 24
ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం లో చేరిన టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ :

టెస్లా సహా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో రెండో స్తానానికి చేరారు. మైక్రో సాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని చేజేక్కిoచుకున్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ నికర సంపద 1.27.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంబం నుంచి టెస్లా షేర్లు గణనీయంగా పెరగడంతో ఎలాన్ మస్క్ తన నికర సంపద 100.3డాలర్ల కు చేరింది. దీంతో ప్రపంచ౦లోని అత్యంత శ్రీమంతుల జాబితాలో ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరారు. అమెజాన్ అధిపతి అయిన జెఫ్ బెజోస్ 2017 నుంచి అదే స్థానం లో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం లో చేరిన టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్
ఎవరు: ఎలాన్ మాస్క్
ఎక్కడ: నవంబర్ 24
డాక్టర్ ఆఫ్ సైన్స్ అనే అవార్డును అందుకున్న ఇస్రో చైర్మన్ కే.శివన్ :

ఇస్రో చైర్మన్ అయిన కే.శివన్ గారు డాక్టర్ ఆఫ్ సైస్న్ అనే గౌరవ ప్రదమైన అవార్డును అందుకున్నారు. కర్నాటక గవర్నర్ అయిన వాజుభాయ్ వాలా ఇస్రో చైర్మన్ కే.శివన్ గారికి ఈ అవార్డును అందించారు. విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వ విద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇస్రో పాత్ర ను దేశంలో పెంపొంది౦చడంలో ఆయన కృషికి గాను ఈ అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కృషిని గవర్నర్ వాజుభాయ్ వాలా గారు ప్రశంసించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాక్టర్ ఆఫ్ సైన్స్ అనే అవార్డును అందుకున్న ఇస్రో చైర్మన్ కే.శివన్
ఎవరు: ఇస్రో చైర్మన్ కే.శివన్
ఎక్కడ: కర్నాటక
ఎక్కడ: నవంబర్ 24
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |