Daily Current Affairs in Telugu 08-10-2020
సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్:

సాహితీ సేవలో ఐదు దశాబ్దాలకు పైగా తరిస్తున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్ కు సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి కి ఎంపిక అయ్యారు.ఏ మాత్రం విమర్శకులకు తావివ్వని రీతిలో రాజి లేని కృషి కొనసాగిస్తున్నందుకు గాను ఆమెకు ఈ పురస్కారన్ని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.ఒక రచయిత్రి గా ఎలాంటి పొరపాట్లకు అర్భాటాలకు ఆస్కారం లేని రీతిలో తన ఉనికిని ప్రపంచానికి ఆమె చాటుకున్నారని కొనియాడింది.యే ల్ యునివర్సిటీ లో ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె న్యూయార్క్ లో జన్మించారు,1968 కి ఫస్ట్ బోర్న్ కవిత ద్వారా రచన వ్యాసంగంలో అడుగు పెట్టారు.అనతి కాలం లో ప్రముఖ రచయిత్రి ఒకరిగా ఎదిగారు.సాహత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళా గా ఆమె నిలిచింది.దీనిలో “డిపెండింగ్ ఫిగర్””ది ట్రయ౦ప్ ఆఫ్ ఆచిల్లెస్ అరారత్” వంటివి ఉన్నాయి గతంలో ప్రతిష్టాత్మక పులిట్జర్ సహా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్లాక్ అనెక పురస్కారాలు పొందారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్
ఎవరు: అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్
ఎప్పుడు: అక్టోబర్ 08
‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుజరాత్ ప్రభుత్వం :

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన౦తవరకు వినియోగం ఉండేలా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ‘డిజిటల్ సేవా సేతు’ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా సెంటర్స్ భారత్ నెట్ ప్రాజెక్ట్ క్రింద ప్రారంభించబడింది.‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని 14,000 గ్రామాల పంచాయతీలలో ప్రజా సంక్షేమ సేవలు అందుబాటులో ఉంచబడతాయి.ప్రతి గ్రామ పంచాయతీకి ఇ-గ్రామ్ కార్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. తద్వారా గ్రామస్తులు తాలూకా లేదా జిల్లా స్థాయి కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు.అన్ని గ్రామ పంచాయతీలను గాంధీనగర్‌లోని రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానించనున్నారు.ప్రారంభంలో గ్రామస్తులకు 20 రకాల సేవలను రేషన్ కార్డులు, వితంతువులు,నివాసం, కులం, సీనియర్ సిటిజన్, భాషా ఆధారిత మైనారిటీ, ఒక మతపరమైన మైనారిటీ, నోమాడ్-డినోటిఫైడ్ మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు వంటి ధృవీకరణ పత్రాలు వారి వారి ఇంటి వద్దనే అందించబడతాయి.
క్విక్ రివ్యు
ఏమిటి: ‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుజరాత్ ప్రభుత్వం
ఎవరు: గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు:అక్టోబర్ 08
సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రష్యా :

ఆర్కిటిక్‌లోని సిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అక్టోబర్ 08న రష్యా విజయవంతంగా పరీక్షించింది.రష్యన్ ఆర్కిటిక్‌లోని వైట్ సీలోని అడ్మిరల్ గోర్ష్ కొవ్ యుద్ధనౌక నుండి ఈ క్షిపణిని పరీక్షించారు. క్షిపణి 450 కిలోమీటర్ల దూరాన్ని 28 కిలోమీటర్ల ఎత్తులో ఇది పయనిస్తుంది. ఈ విమానం యొక్క ప్రయాణం 4.5 నిమిషాల పాటు కొనసాగింది మరియు క్షిపణి మాక్ 8 కంటే ఎక్కువ హైపర్సోనిక్ వేగాన్ని చేరుకుంది. ఈ క్షిపణి స్క్రామ్‌జెట్-శక్తితో నడిచే యాంటీ-షిప్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
క్విక్ రివ్యు
ఏమిటి: సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రష్యా
ఎవరు: రష్యా దేశం
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: అక్టోబర్ 08
జాతీయ పత్తి పరిశోదన సంస్థ డైరెక్టర్ గా ప్రసాద్ నియామకం :

జాతీయ పత్తి పరిశోదన సంస్థ (నాగపూర్) డైరెక్టర్ గా డాక్టర్ వై.జి ప్రసాద్ ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం అయన హైదరాబాద్ లోని వ్యవసాయ సాంకేతిక పరిశోదన సంస్థ (అటారీ దక్షిణ ప్రాంత )డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.గుంటూరు జిల్లా మాట్లుర్ కు చెందిన ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల లో (బిఎస్సి వ్యవసాయ )చదివారు.
క్విక్ రివ్యు
ఏమిటి: జాతీయ పత్తి పరిశోదన సంస్థ డైరెక్టర్ గా ప్రసాద్ నియామకం
ఎవరు: వై.జి ప్రసాద్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 08
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత :

కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు ప్రముఖుడు దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ అక్టోబర్ 08న కన్నుమూసారు. గత కొన్ని వారాలుగా అయన డిల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శాస్త్ర చికిత్స జరిగింది.రాజ్యసభ సబ్యుడైన పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణి శాఖల మంత్రిగా ఉన్నారు. లోక్ సభ సబ్యుడిగా రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుపొందారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పారు అయన పేరు పైన ఉన్నదీ పేదలు అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లబించిన ప్రతి సారి గలమెత్తిన నేతగా పాశ్వాన్ పేరు పొందారు
క్విక్ రివ్యు
ఏమిటి: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
ఎవరు: రాంవిలాస్ పాశ్వాన్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 08
భారత వైమానిక దళ దినోత్సవం గా అక్టోబర్ 08:

ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం అక్టోబర్ 08న ఐఎఎఫ్ తన 88 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. డిల్లి సమీపంలోని ఘజియాబాద్‌లోని హిండాన్ వైమానిక స్థావరంలో జరిగిన అద్భుతమైన ఎయిర్ షో దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. ఈ సంవత్సరం భారత వైమానిక దళం దినోత్సవం ప్రత్యేకమైనది. కొత్తగా కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్లు ఈ ప్రదర్శనలో మొదటిసారి ప్రదర్శనలో ఉన్నాయి.. ఐదు రాఫెల్ జెట్లను లాంఛనంగా సెప్టెంబర్ 10 న ఐఎఎఫ్‌లోకి చేర్చారు, ఇది భారతదేశ వాయు శక్తికి బలం చేకూరుస్తుంది.. 1932 లో IAF స్థాపించబడిన రోజుగా గుర్తుగా వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకుంటారు
క్విక్ రివ్యు
ఏమిటి: భారత వైమానిక దళ దినోత్సవం గా అక్టోబర్ 08
ఎవరు: భారత వైమానిక దళం
ఎప్పుడు: అక్టోబర్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |