Daily Current Affairs in Telugu 04-11-2020

ఆధునాతన పినాక రాకెట్ వ్యవస్థ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసిన డిఆర్డివో సంస్థ :

శత్రు లక్ష్యాలను మట్టుబెట్టే అధునాతన పినాక రాకెట్ వ్యవస్థ ను రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డి.ఆర్.డి.వో) విజయవంతంగా పరీక్షించింది. ఓడిశా తీరంలోని చాందిపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్ ) నుంచి నవంబర్ 04న ఈ ప్రయోగాన్ని జరిపినట్లు డి.ఆర్.డి.వో వెల్లడించింది. ఈ రాకెట్ వ్యవస్థ నుంచి ఆరు రాకెట్ లను వెంట వెంటనే ప్రయోగించే గా ప్రతి ఒక్కటి పూర్తి లక్ష్యాన్ని చెందించినట్లు ప్రకటించింది. ప్రయోగం సందర్బంగా టెలిమెట్రి రాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థల ద్వారా రాకెట్ల ట్రాకింగ్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతమున్న పినాక ఎంకే-1 రాకెట్ల స్థానం లో నూతంగా అబివృద్ది చేసిన ఈ రాకెట్లను ప్రవేశ పెట్టనున్నట్లు డి.ఆర్.డి.వో సంస్థ వెల్లడించింది. పినాక రాకెట్లను 37 కిలోమీటర్లు దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకో గల సామర్థ్యం ఉంది. గత రెండు నెలలుగా వివిధ క్షిపణి ప్రయోగాలను డి.ఆర్.డి.వో విజయవంతంగా చేపడుతు౦ది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆధునాతన పినాక రాకెట్ వ్యవస్థ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసిన డిఆర్డివో సంస్థ
ఎవరు: డిఆర్డివో సంస్థ
ఎక్కడ: ఓడిషా
ఎప్పుడు: నవంబర్ 04
జయశంకర్ అగ్రి వర్శిటీ తో ఒప్పందం కుదుర్చుకున్న బెపాక్ సంస్థ :

తెలంగాణా రాష్ట్ర సోనా రకం రైస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చెందుకు ప్రొఫెసర్ జయాశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తో హైదరాబద్ కు చెందిన బెపాక్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ని రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనం లో వర్సిటి వి.సి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అద్వర్యం లో రిజిస్త్రార్ ఎస్.సుదీర్ కుమార్ బెపాక్ పోర్ఎక్స్ సంస్థ డైరెక్టర్ ఉదయ నదివాడే నవంబర్ 3న పరస్పరం ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు. స్వల్ప కలిక వరి రకం తెలంగాణా సోనా (ఆర్ఎన్.15408) రకం ను 2015 లో విడుదల చేసామని విసి డాక్టర్ వి.ప్రవీణ్ రావు గారు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జయశంకర్ అగ్రి వర్శిటీ తో ఒప్పందం కుదుర్చుకున్న బెపాక్ సంస్థ
ఎవరు: బెపాక్ సంస్థ
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు: నవంబర్ 04
పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినా దేశం గా నిలిచిన అమెరికా :

వాతావరణ మార్పులపై కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా నవంబర్ 04న లాంచనంగా వైదొలిగింది. గ్రీన్ హౌస్ వాయువులను ఉద్గారాలను తగ్గించడానికి కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని అద్యక్షుడు డోనాల్డ్ ట్ర౦ప్ ప్రకటించి మూడేళ్ళయింది. ఆ విషయాన్నీ గత ఏడాది ఐక్యరాజ్య సమితి కి తెలిపింది. నిబందనల ప్రకారం అప్పట్నుంచి ఏడాది కాలం తప్పనిసరి గా నిరీక్షించాల్సి ఉంటుంది. ఆ గడువును సరిగ్గా నవంబర్ 4న ముగిసింది. దీంతో ఒక పక్క అద్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ఒప్పందానికి చరమ గీతం పాడింది. భూతాపాన్ని తగ్గించే ఒప్పందం నుంచి వైదొలిగిన ఏకైక దేశం గా అమెరికా నిలిచిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినా దేశం గా నిలిచిన అమెరికా
ఎవరు: అమెరికా
ఎప్పుడు: నవంబర్ 04
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో అరుదైన రికార్డు సృష్టించిన భారత సంతతి అబ్యర్థి :

సెనేట్ లోనూ హోరాహోరి అమెరికా అద్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అనంతాని (29) ఆరుదై న రికార్డు సృష్టించాడు. ఒహియో రాష్ట్రము నుంచి సెనేట్ కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అబ్యర్థి గా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజేంటే టివ్ గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరపున సెనేట్ కు పోటీ చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఆబ్యర్థి మార్క్ ఫోగెల్ పై విజయం సాధించారు. విజేతగా నిలిచిన తరువాత నీరజ్ మాట్లాడుతూ కేవలం 70ఏళ్ల క్రితం మాత్రమే స్వాతంత్ర్యం సాధించిన భారత్ లో తన పూర్వికులు బ్రిటిష్ ఏలుబడిలో జీవించారని అటువంటి కుటుంబానికి చెందిన తానూ సెనేటర్ గా ఎన్నిక కావడం అమెరికా గొప్పతనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన రాజకీయ శాస్త్రం పట్టబద్రుడైన నీరజ్ 2014లో 23ఏళ్ల వయసులోనే ఒహియో స్టేట్ హౌస్ కు ఎన్నికై ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గాను రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా అద్యక్ష ఎన్నికల్లో అరుదైన రికార్డు సృష్టించిన భారత సంతతి అబ్యర్థి
ఎవరు: నీరజ్ అనంతాని
ఎప్పుడు: నవంబర్ 04
ప్రపంచ సునామి దినోత్సవం గా నవంబర్ 05 :

జాతీయ మరియు స్థానిక ప్రమాద తగ్గింపు ప్రణాళికలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 5న దీనినిజరుపుకుంటారు. 2020 నాటికి ప్రపంచ జనాభాలో 50 శాతం మంది వరదలు,తుఫానులు మరియు సునామీలకు గురైన తీరప్రాంతాల్లో నివసిస్తారని అంచనా వేసింది. అందువల్ల సునామీ ప్రభావాలను తగ్గించడానికి వాటి కోసం తీసుకునే ప్రణాళికలను మరియు విధానాలను గురించి చర్చిస్తుంది. ఇది మరింత స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు ప్రమాదంలో జనాభాను రక్షించడానికి సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ సునామి దినోత్సవం గా నవంబర్ 05
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: నవంబర్ 04
అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి శామ్యూల్స్ రిటైర్ మెంట్ :

వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ఏడాది జూన్ లోనే రిటైర్ మెంట్ గురించి అతను క్రికెట్ వెస్టిండీస్ బోర్డుకు సమాచారం అందించారు. 39ఏళ్ల ఈ జమైక క్రికేటర్ విండీస్ తరపున 71టెస్టులు,207 వన్డేలు,67 టి20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 11వేలకు పైగా పరుగులు చేసిన అతను 150 కి పైగా వికెట్లు పడగొట్టాడు. 2012,2016 టి 20 ప్రపంచ కప్ లో విండీస్ పడగొట్టాడు. 2012 లో శ్రీలంక ఫైనల్లో 56 బంతుల్లో 78 పరుగులు చేసిన అతను .2016 ఫైనల్లో ఇంగ్లాండ్ పై 66 బంతుల్లో 85పరుగులు చేసాడు. రెండు ఐసిసి టోర్నీ ఫైనల్లో లో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఏకైక ఆటగాడు శామ్యూల్స్ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి : అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి శామ్యూల్స్ రిటైర్ మెంట్
ఎవరు: శామ్యూల్స్
ఎక్కడ:వెస్టిండీస్
ఎప్పుడు: నవంబర్ 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |