
Daily Current Affairs in Telugu 23-11-2020
ఏటిపి ఫైనల్స్ టోర్నీ చాంపియన్ గా నిలిచిన రష్యా ప్లేయర్ డానిల్ మెద్వదేవ్ :

రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ తన కేరీర్ లో అతి పెద్ద టైటిల్ సాధించాడు. ఫైనల్లో 4-6,7-6 (2),6-4తో ప్రపంచ నంబర్-3 ఆటగాడు అయిన డొమినిక్ థీం(ఆస్ట్రియా)ను మట్టి కరిపి౦చి ఏటిపి ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. మెద్వెదేవ్ కు నిజంగా ఇది గొప్ప విజయమే. ఎందుకంటే చాంపియన్ షిప్ ను గెలుచుకున్న క్రమంలో అతడు ఇంతకముందు ప్రపంచనంబర్ వన్ జకోవిచ్ నంబర్-2 రఫెల్ నాదల్ ను ఓడించారు. నంబర్-4 మెద్వెదేవ్ ఫైనల్లో తొలి సెట్ ను కోల్పోయాక మెద్వెదేవ్ బలంగా పుంజుకున్నాడు. ఏటిపి ఫైనల్లో 1,2,3 ర్యాంకులు ఆటగాళ్ళ ను ఓడించిన తొలి ఆటగాడిగా అతడు ఈ ఘనతను సాదించారు. ఈ విజయంతో ఫైనల్లో డొమినిక్ థీంపై నెగ్గిన మెద్వెదేవ్ ఈ చరిత్రలో ప్రపంచ టాప్ 3 ర్యాంకర్ లను ఓడించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ విజయంతో మెద్వెదేవ్ కు 15లక్షల 64వేల డాలర్ల ప్రైజ్ మని (రూ .11కోట్ల 58లక్షలు) తో పాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి. రన్నరప్ గా నిలిచిన డొమినిక్ థీంకు 8లక్షల 61వేల డాలర్ల ప్రైజ్ మని (రూ.6కోట్ల 37లక్షల) తో పాటు 800 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏటిపి ఫైనల్స్ టోర్నీ చాంపియన్ గా నిలిచిన రష్యా ప్లేయర్ డానిల్ మెద్వదేవ్
ఎవరు: డానిల్ మెద్వదేవ్
ఎక్కడ:లండన్
ఎప్పుడు: నవంబర్ 23
మహిళల,బాలల ప్రయాణ బద్రతకు అభయం అనే కార్యక్రమం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

ఆటోలు,ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు,పిల్లల యొక్క బద్రత కోసం అభయం అనే ఒక ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానున్నారు.అని దీని కోసం రూపొందించిన యాప్ ద్వారా గాని ఆటోలో ఏర్పాటు చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటి) పరికరం పై ఉండే బటన్ నొక్కడం ద్వారా గాని రక్షణ పొందవచ్చు ఎటువంటి ఆపద వచ్చిన 10నిమిషాలలో పోలిస్ లు వచ్చి తోడుగా నిలుస్తారు.అని సిఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఈ ప్రాజెక్టు ను సిఎం నవంబర్ 23న ప్రారంబించారు. అనంతరం అన్ని జిల్లాల అధికారులతో వీడియో మాట్లాడారు. మహిళలు పిల్లలు రక్షణ లో రాజి ఉండకూడదని కలెక్టర్లు ఎస్పి లతో మాట్లాడారు. దేశం లోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశ పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల ,బాలల ప్రయాణ బద్రతకు అభయం అనే కార్యక్రమం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 23
గాలే గ్లాడియేటర్స్ జట్టు కెప్టెన్ గా పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నియామకం :

శ్రీలంక లో నిర్వహిస్తున్న లంక ప్రిమియర్ లీగ్ (ఎల్.పి.ఎల్) లో గాలే గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ అయిన షహీద్ అఫ్రిదిని ఎంపిక చేసారు. 2020 నవంబర్ 26న నుండి డిసెంబర్ 16వరకు జరగబోయే టి20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీలో సర్ఫారాజ్ అహ్మద్ యొక్క స్థానాన్ని షాహిద్ అఫ్రిది బర్తీ చేస్తున్నారు. ఈవిషయాన్ని ఫ్రాంచైజీ యజమాని పాకిస్తాన్ పారిశ్రామిక వేత్త నదీం ఒమర్ నవంబర్ 22 ప్రకటించారు. తొలి సారిగా జరగనున్న ఎల్ పి ఎల్ టోర్నీ లో జాఫ్నా స్తాలియంస్ జట్టు,క్యాండి టాస్కర్స్ జట్టు ,గాలే గ్లాడి యేటర్స్ జట్టు ,కోలోమ్బోకింగ్ దంబులా హక్స్ టీమ్స్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: గాలే గ్లాడియేటర్స్ జట్టు కెప్టెన్ గా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది నియామకం
ఎవరు: షాహిద్ ఆఫ్రిది
ఎక్కడ: శ్రీలంక లో
ఎప్పుడు: నవంబర్ 23
ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా కు దక్కిన 2020 ఆదిత్య విక్రం బిర్లా కలశికర్ పురస్కారం :

ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షాకు 2020 సంవత్సరానికి గాను “ఆదిత్య విక్రం బిర్లా కళాశిఖర్” పురస్కారాన్ని వార్షిక సంగీత కళా కేంద్ర అవార్డుల ప్రదానోత్సవం లోఈయనను సత్కరించారు. ఇందులో బాగంగానే నీతాచౌదరి మరియు ఐరావతి కార్నిక్ లతో పాటు ఇద్దరు వర్తమాన తారలకు అదీత్య విక్రం బిర్లా కలకిరణ్ అనే పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ 2020 సంవత్సరం అవార్డుల ప్రదానోత్సవం గా కేంద్ర థీం గా “థియేటర్” అని ప్రకటించారు. ఈ ఆదిత్య విక్రం బిర్లా కలశిఖర్ అనే పురస్క్రాలను 1996 లో సంగీత కళా కేంద్రం స్థాపించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా కు దక్కిన 2020 ఆదిత్య విక్రం బిర్లా కలశికర్ పురస్కారం :
ఎవరు: నసీరుద్దిన్ షా
ఎప్పుడు: నవంబర్ 23
అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కన్నుమూత :

అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గగోయ్ (84) కోవిద్-19 అనంతర అనారోగ్యం పరిస్థితులు కారణంగా నవంబర్ 23 ఆసుపత్రిలో కన్నుమూసారు. వరుసగా మూడు సార్లు అసోం సిఎంగా బాద్యతలు నిర్వహించారు. ఈయన కాంగ్రెస్ ఎంపి,ఆగస్టు 26న గగోయ్ కోవిద్-19 సోకింది. కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. కొన్ని రోజుల నుంచి ఆయన వెంటి లెటర్ పైన ఉన్నారు. పరిస్థితి విషమించడంతో అయన కన్నుమూసారు. ఆయన ఆరు సార్లు పార్లమెంట్ సబ్యుడిగా,మూడు సార్లు సిఎంగా (2001-2016),రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేసి అసోం లోని ఏ నాయకుడికి లేని రాజకీయ అనుబవం ఆయన కు సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కన్నుమూత
ఎవరు: తరుణ్ గగోయ్
ఎక్కడ: అసోం రాష్ట్ర౦
ఎప్పుడు: నవంబర్ 23
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |