
Daily Current Affairs in Telugu 20-11-2020
కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియాల్ కు దక్కిన జీవితకాల సాపల్య పురస్కారం :

కేంద్ర విద్య శాఖా మంత్రి రమేష్ ఫోక్రియాల్ నిశంక్ “వాతాయన్ జీవిత కాల సాపల్య పురస్కారాన్ని” అందుకున్నారు. గంగా నది,హిమాలయాలు,పర్యవరనంపై ఆయన రచించిన రచనలకు గాను ఈ గౌరావం దక్కింది. నవంబర్ 20న లండన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ అవార్డును అందుకుంటున్నారు. వాతాయన్ యుకె సంస్థ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. సాహిత్య రంగంలో అధ్బుత రచనలు చేసిన ఫోక్రియాల్ ఇప్పటికే అనేక అవార్డులను గెల్చుకున్నారు. నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయ్ నుంచి సాహిత్య భారతి అవార్డును మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం చేతుల మీదుగా భారత్ గౌరవ్ సమ్మాన్‌ను అందుకున్నారు. మారిషస్,ఉగాండా,నేపాల్,థాయ్‌లాండ్ ,భూటాన్ దేశాల ప్రభుత్వాధినేతల నుంచి సాహిత్య పురస్కారాలు దక్కాయి. దుబాయ్ ప్రభుత్వం నుంచి సుపరిపాలన అవార్డు కూడా లబించింది. “జస్ట్ ఎ డిజైర్”అనే పేరిట ఆయన వెలువరించిన కథా సంకలనం జర్మన్ భాషలో ప్రచురితమైంది. ఆయన చేపట్టిన స్పర్శ గంగ కార్యక్రమం మారిషస్‌లో ఒక పాట్యాంశం అయింది. మొత్తం మీద ఆయన ఇప్పటి వరకు వివిధ అంశాల పై 75కు పైగా పుస్తకాలు రాశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియాల్ కు దక్కిన జీవిత కాలసాపల్య పురస్కారం
ఎవరు: రమేష్ ఫోక్రియాల్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 20
ప్రముఖ రచయిత జూకంటి పొట్లపల్లి కి దక్కిన జీవన సాపల్య పురస్కారం :

పొట్లపల్లి జీవన సాపల్య పురస్కారానికి ప్రముఖ రచయిత జూకంటి జగన్నాధం గారు ఎంపిక అయ్యారని పొట్ల పల్లి వరప్రసాద రావు ఫౌండేషన్ నవంబర్ 20న ఒక ప్రకటనలో తెలిపింది. యువ రచయిత విభాగంలో “వ్రుత్తి రిక్త ప్రవాహం” అనే కవిత సంపుటిని రచించిన సత్యోదయ్ ను ఎంపిక చేసింది. జూకంటి రాజన్న సిరిసిల్ల జిల్లా తంబల్ల పల్లె లో జన్మించారు. ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అద్యక్షుడిగా పని చేస్తున్నారు. యన రచించిన 14సంపుటాల జగన్నాధం కవత్వం లో తెలంగాణా ప్రజల యొక్క గుండె గోస వినిపిస్తుందని ఫౌండేషన్ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ రచయిత జూకంటి పొట్లపల్లి కి దక్కిన జీవన సాపల్య పురస్కారం
ఎవరు: జూకంటి పొట్లపల్లి
ఎప్పుడు: నవంబర్ 20
2020 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్-2020 అవార్డును గెలుచుకున్న డగ్లస్ స్టువర్ట్ :

స్కాటిష్ అమెరికన్ రచయిత డగ్లస్ స్టువర్ట్ (44)ను ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. తాను రచించిన తొలి నవల (ఆత్మకథ) షగ్గి బెయిన్ తో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ బహుమతి కోసం తుది దశలో మొత్తం ఆరుగురు రచయితలు పోటీ పడ్డారు. మిగిలిన అయిదుగురు రచియితల్లో దుబాయ్ లో నివాసం ఉంటున్న భారత సంతతి రచయిత్రి అవని దోషి కూడా ఇందులో ఉన్నారు. తాను తొలిసారిగా రచించిన బర్న్ షుగర్ నవల తో బుకర్ ప్రైజ్ కోసం ఆమె పోటీ పడ్డారు. బుకర్ ప్రైజ్ ను వర్చువల్ విదానంలో నవంబర్ 20న నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు బహుమతి రూపం లో 50వేల ఫౌండ్లు (సుమారు రూ.49లక్షలు ) నగదు అందనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ 2020అవార్డును గెలుచుకున్న డగ్లస్ స్టువర్ట్
ఎవరు: డగ్లస్ స్టువర్ట్
ఎప్పుడు: నవంబర్ 20
తెలంగాణా రాష్ట్ర హెచ్.ఆర్సి చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య కు దక్కిన నెల్సన్ మండేలా అవార్డు :

తెలంగాణా రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ (హెచ్.ఆర్సి ) తొలి చైర్మన్ హైకోర్ట్ రిటైర్డ్ న్యాయ మూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య కు ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు -2020 లబించింది. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్బంగా డిల్లిలోని నేషనల్ కో ఆపరేటివ్ యనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలోనవంబర్ 19న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ గారు ఈ అవార్డును జస్టిస్ చంద్రయ్యకు అందజేశారు. పేదలు ,మహిళలు ,దివ్యంగులు,చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లబించింది. ఈ అవార్డును నేషనల్ కో ఆపరేటివ్ యునియన్ ఆఫ్ ఇండియా న్యుడిల్లి ,ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మల్టి స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లు సంయుక్తంగా నెల్సన్ మండేలా అనే అవార్డును ఇస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర హెచ్.ఆర్సి చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య కు దక్కిన నెల్సన్ మండేలా అవార్డు
ఎవరు: జస్టిస్ గుండా చంద్రయ్య
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: నవంబర్ 20
బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజి అధ్యక్షునిగాఎన్నికైన డాక్టర్ రెడ్ల శ్రీదర్ :

బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజి (బిఐఆర్) అధ్యక్షునిగా విశాఖ కు చెందిన డాక్టర్ రెడ్ల శ్రీదర్ గారు ఎన్నికయ్యారు. డాక్టర్ శ్రీదర్ లండన్ కేంద్రంగా ఉన్న ప్రిన్సెస్ అలెక్సాండర్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ గా ఆయన సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ లో నిమ్స్ లో రెండేళ్ళ పాటు సీనియర్ రెసిడెంట్ గా పని చేసిన తర్వాత 1996లో లండన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే రేడియాలజి వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. కీలకమైన బిఐఆర్ కు ఎన్.ఆర్.ఐ వైద్యుడు అధ్యక్షునిగాఎంపిక కావడం ఇదే తొలిసారి. కాగా డాక్టర్ జాన్ పిలిప్స్ నుంచి శ్రీదర్ బాద్యతలు స్వీకరించారని డాక్టర్ శశి ప్రభ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజి అధ్యక్షునిగాఎన్నికైన డాక్టర్ రెడ్ల శ్రీదర్
ఎవరు: డాక్టర్ రెడ్ల శ్రీదర్
ఎక్కడ: ఆంద్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 20
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |