
Daily Current Affairs in Telugu 09-11-2020
యు.ఎస్ అద్యక్షుడైన బైడేన్ జట్టులో వివేక్ మూర్తి కి దక్కిన కీలక స్థానం :

అమెరికాలో త్వరలో అద్యక్ష పీటాన్ని అధిరోహించబోతున్న జోబైడేన్ గారి కొలువులో ఒక ప్రవాస భారతీయుడు కీలక పదవిలో నియమితులయ్యారు. దేశంలో కోవిద్-19 నియంత్రణలో బాగంగా బైడేన్ కు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురితో ఏర్పాటు చేసిన సలహా మండలి కి డా.వివేక్ మూర్తి (43) గారు నేతృత్వం వహించనున్నారు. డా.డేవిడ్ కేస్లార్,డా.మార్సెల్ల న్యునేజ్ స్మిత్ లతో కలిసి ప్రజారోగ్య నిపుణులకు ఆయన నాయకత్వం వహిస్తారు. 2014 నుంచి 2017 వరకు అమెరికా సర్జన్ జనరల్ గా డా.మూర్తి పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యు.ఎస్ అద్యక్షుడైన బైడేన్ జట్టులో వివేక్ మూర్తి కి దక్కిన కీలక స్థానం
ఎవరు: వివేక్ మూర్తి
ఎక్కడ: యు.ఎస్
ఎప్పుడు: నవంబర్ 09
జాతీయ స్థాయిలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ అప్కాబ్ :

ఆంద్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది .రుణాల మంజూరు ,వసూళ్ళ తో పాటు వివిధ అంశాలలో మెరుగైన పని తీరుతో ముందుకు సాగుతుందని రైతులు వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ (నాప్కాబ్)పేర్కొంది. 2018-19 సంవత్సరం లో రాష్ట్ర జిల్లా సహకార బ్యాంకులు ,సహకార సంఘాల పని తీరును నాప్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. అదే విదంగా డిసిసిబి స్థాయిలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసిబి) కు ఉత్తమ పని తీరుతో ద్వితీయ స్థానం లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ స్థాయిలో మొదటి స్థానం లో నిలిచినా ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ అప్కాబ్ :
ఎవరు: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ అప్కాబ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 09
ఐక్య రాజ్య సమితి నుండి ఉత్తమ మహిళా పోలిస్ అవార్డ్ అందుకున్న డోరిస్ మేలంబో :

జాంబియా దేశానికి చెందిన ఒక మహిళా పోలిస్ ఆఫీసర్ ఇటీవల యునైటెడ్ నేషన్స్ (యు.ఎన్) “ఉత్తమ మహిళా పోలిస్ అవార్డు -2020 “ను (యు.ఎన్ ఉమెన్ పోలీస్ ఆఫ్ ది ఇయర్) కు ఎంపిక అయ్యారు. నవంబర్03న జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఆమె ఉత్తమ పోలిస్ అవార్డును స్వీకరించారు .ప్రస్తుతం దక్షిణ సూడాన్ లోని యు.ఎన్ మిషన్ (యుఎన్మిస్)లో మేలాంబో పని చేస్తుంది. మహిళల సాధికారత పెంచాలనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించడానికి 2011లో యు.ఎన్ ఉమెన్ పోలిస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్థాపించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్య రాజ్య సమితి నుండి ఉత్తమ మహిళా పోలిస్ అవార్డ్ అందుకున్న డోరిస్ మేలంబో
ఎవరు: డోరిస్ మేలంబో
ఎప్పుడు: నవంబర్ 09
మత్స్యకారుల మెరుగైన జీవనోపాధి కోసం “పరివర్ణం” పథకాన్ని ప్రారంభి౦చిన కేరళా ప్రభుత్వం :

మత్స్యకారవర్గాల ప్రజల యొక్క జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కేరళ ప్రభుత్వం ఇటీవల ‘పరివర్ణం’ అనే మార్గదర్శక పర్యావరణ సుస్థిర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం తీరప్రాంతంలో యువకుల జీవనోపాధి నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు మత్స్యకారుల సమాజ సామాజిక-ఆర్ధిక అభ్యున్నతికి దోహదపడుతు౦దనే ఉద్దేశంతో ప్రారంబించారు. పరివర్తనం అంటే మార్పు. కేరళ రాష్ట్ర తీర ప్రాంత అభివృద్ధి సంస్థ దీనికి (కెఎస్సిఎడిసి) నేతృత్వం వహించనుంది. ఈ పథకం ద్వారా శుభ్రమైన చేపలు మరియు దాని తాజా ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్నునిర్వహించటం. పరివర్తనం ద్వారా చేపలను పట్టుకునేవారికి న్యాయమైన పరిహారంగా నిర్ణీత ధరను కూడా ఇస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మత్స్యకారుల మెరుగైన జీవనోపాధి కోసం “పరివర్ణం” పథకాన్ని ప్రారంభి౦చిన కేరళా ప్రభుత్వం
ఎవరు: కేరళా ప్రభుత్వం
ఎక్కడ: కేరళా రాష్ట్రం
ఎప్పుడు: నవంబర్ 09
బాలీవుడ్ చిత్ర నిర్మాత సుదర్శన్ రట్టన్ కన్నుమూత :

కోవిడ్ -19 కారణంగా బాలీవుడ్ చిత్రనిర్మాత సుదర్శన్ రట్టన్ ఇటీవల కన్నుమూశారు. అతను మాధురి దీక్షిత్ మరియు శేఖర్ సుమన్ నటించిన 1986 చిత్రం “మానవ్ హత్య” చిత్రం తో ప్రసిద్ది చెందారు. ఇవే కాకుండా, దివంగత చిత్రనిర్మాత 1996 లో సుహీర్ పాండే, షఫీ ఇనామ్దార్, నీలిమా అజీమ్ మరియు జానీ లివర్ తదితరులు నటించిన “హహకార్” అనే యాక్షన్ డ్రామా చిత్రం కూడారూపొందించారు,. మరియు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బాలీవుడ్ చిత్ర నిర్మాత సుదర్శన్ రట్టన్ కన్నుమూత
ఎవరు: సుదర్శన్ రట్టన్
ఎప్పుడు: నవంబర్ 09
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |