
Daily Current Affairs in Telugu 02-11-2020
కేరళ ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపిక అయిన పాల్ జకారియా:

ప్రఖ్యాత మలయాళ రచయిత పాల్ జకారియా గత ఐదు దశాబ్దాలలో మలయాళ సాహిత్య రంగం లోఆయన చేసిన విశేష కృషికి గాను 2020 ఎజుతాచన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎజుతాచన్ పురస్కరం అనేది కేరళ ప్రభుత్వ అత్యున్నత సాహిత్య గౌరవ పురస్కారం. దీనికి మలయాళ భాష పితామహుడు అయిన ఎజుతాచన్ గారి పేరును పెట్టారు. ఈ అవార్డుకు రూ .5 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇస్తారు. నవంబర్ 01 కేరళా లోఅవార్డును ప్రకటించిన సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె. గత యాభై సంవత్సరాలుగా మలయాళ సాహిత్యానికి చేసిన కృషికి గాను ఈ అవార్డును ఎంపిక చేసినట్లు చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేరళ ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపిక అయిన పాల్ జకారియా
ఎవరు: పాల్ జకారియా
ఎక్కడ:కేరళా
ఎప్పుడు: నవంబర్ 02
అలెక్సిస్వాస్టిన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన భారత బాక్సర్ అమిత్ పంగల్ :

ఇటీవల ఫ్రాన్స్‌లోని నాంటెస్‌లో జరిగిన అలెక్సిస్ వాలెంటైన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అమిత్ పంగల్, సంజీత్, ఆశిష్ కుమార్ బంగారు పతకాలు సాధించారు.ఈ టోర్నమెంట్ లాక్డౌన్ తరువాత భారత బాక్సర్లు పాల్గొన్న మొదటి అంతర్జాతీయ ఈవెంట్.
క్విక్ రివ్యు :
ఏమిటి: అలెక్సిస్వాస్టిన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన భారత బాక్సర్ అమిత్ పంగల్
ఎవరు: అమిత్ పంగల్, సంజీత్, ఆశిష్ కుమార్
ఎక్కడ: ఫ్రాన్స్‌లో
ఎప్పుడు: నవంబర్ 02
టర్కీ మాజీ ప్రధాని మెసూట్ యిల్మాజ్ కన్నుమూత :

ప్రముఖ రాజకీయ నాయకుడు, టర్కీ మాజీ ప్రధాని అయిన మెసూట్ యిల్మాజ్ ఇటీవల కన్నుమూశారు. 1991 నుండి 2002 వరకు ఇప్పుటికీ సెంటర్-రైట్ మదర్ ల్యాండ్ పార్టీ లేదా ANAP కి చీఫ్ గా ఉన్నారు. 1990 లలో మూడుసార్లు టర్కీ ప్రధానిగా పనిచేశారు. అతని మొదటి రెండు ప్రధాన మంత్రి పదవులు 1991 లో మరియు తరువాత 1996 లో కేవలం ఒక నెల పాటు కొనసాగాయి. మూడవ సారి ప్రదాని పదవి జూన్ 1997 నుండి జనవరి 1999 వరకు కొనసాగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టర్కీ మాజీ ప్రధాని మెసూట్ యిల్మాజ్ కన్నుమూత
ఎవరు: మెసూట్ యిల్మాజ్
ఎక్కడ: టర్కీ
ఎప్పుడు: నవంబర్ 02
న్యూజిలాండ్ మంత్రివర్గం లో తొలిసారి చోటు దక్కించుకున్న భారతీయ మహిళా ప్రియాంక రాదా కృష్ణన్

న్యూజిలాండ్ లో భారత సంతతి మహిళా ప్రియంక రాదాక్రిష్ణన్ అరుదైన ఘనత ను సాధించారు. ప్రధాన మంత్రి జెంసిండా ఆర్నేర్డ్ మంత్రి వర్గం లోచోటు దక్కించుకున్నారు. ఓక్ భారత సంతితి వాసికి న్యూజిలాండ్ లో మంత్రి పదవి లబించడం ఇదే తొలిసారి. కేరళా తల్లిదండ్రులకు పుట్టి సింగపూర్ లో చదివి న్యూజిలాండ్ లో స్థిర పడిన 41ఏళ్ల ప్రియంక గృహ హింస బాధిత మహిళల కోసం,వలస కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 2017లో లేబర్ పార్టీ తరపున ఎంపి గా ఎన్నికయ్యారు. 2019లో ఎతిక్స్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖా పార్లమెంటరి ప్రైవేటు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ స్థానం లో ఆమె పని తీరు మెచ్చి జేసిండా తన మంత్రి వర్గంలోడైవర్సిటి,ఇంక్లుజన్,ఎతిక్స్ కమ్యునిటిస్ మంత్రిగా ప్రియాంక ను ఎంపిక చేశారు. అంతే కాదు ఉపాధి,సామజిక అబివృద్ది సహాయ మంత్రిగా అదనపు బాద్యతలు అప్పగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: న్యూజిలాండ్ మంత్రివర్గం లో తొలిసారి చోటు దక్కించుకున్న భారతీయ మహిళా ప్రియాంక రాదా కృష్ణన్
ఎవరు: ప్రియాంక రాదా కృష్ణన్
ఎక్కడ: : న్యూజిలాండ్
ఎప్పుడు: నవంబర్ 02
నీటి సంరక్షణ చర్యల్లో వికారాబాద్ కు దక్కిన జాతీయ అవార్డు :

నీటి సంరక్షణ చర్యల్లో వికరాబాద్ జిల్లాకు కేంద్ర జల్ శక్తి అభియాన్ అవార్డును ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆరు జిల్లాలకు గుర్తించగా దక్షిణ,ఉత్తర భారత దేశం నుంచి మూడు జిల్లాల చొప్పున ఎంపిక చేసారు. దక్షిణ భారత ను నుంచి ఎంపిక అయిన జిల్లాలలో తెలంగాణా నుంచి వికరాబాద్ ఉందని గ్రామీణ అబివృద్ది అధికారి కృష్ణన్ నవంబర్ 02న తెలిపారు. గత ఏడాది జిల్లలో చేపట్టిన ఇంకుడు గుంత సేద్యపు కుంటలు ఏర్పాటు మరియు ఇతర విభాగాలలో కార్యక్రమాల వలన మంచి పలితాలు వచ్చాయన్నారు. జూన్,జులై లోకేంద్ర బృందం జిల్లలో వీటిని పరిశీలిచింది అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నీటి సంరక్షణ లో వికారాబాద్ కు దక్కిన జాతీయ అవార్డు
ఎవరు: వికారాబాద్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 02
అన్ని అంతర్జాతియ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వాట్సన్ :

చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్.కే) జట్టు తరపున ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ చివరి మ్యాచ్ ను ఆడేశాడు. 2018నుంచి ఒపెనర్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాలలో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ నవంబర్ 02 నుంచి ప్రాంచైజీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై గెలుపు అనంతరం వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న39ఏళ్ల వాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ప్రాంచైజీ లకు ఆడుతున్నాడు. నవంబర్ 02నుంచి ఇక అన్ని పార్మట్లలోనుంచి రిటైర్ అవుతున్నట్లు సిఎస్.కే సహచరులతో వాట్సన్ చెప్పాడు. ఓవరాల్ గా వాట్సన్ తన టి20 క్రికెట్ కెరీర్ లో 343మ్యాచ్ లు ఆడి,8821పరుగులు చేసాడు. ఇందులో ఆరు సెంచరీలు,53అర్థ సెంచరీలు ఉన్నాయి. 216వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101క్యాచ్ లు తీసుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అన్ని అంతర్జాతియ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వాట్సన్
ఎవరు: వాట్సన్
ఎప్పుడు: నవంబర్ 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |