Daily Current Affairs in Telugu 10-11-2020
మహిళా టి20 చాలెంజ్ టోర్నీ విజేతగా విన్నర్ ట్రయల్స్ బ్లేజర్స్ జట్టు:

మహిళల టి20 చాలెంజ్ లో కొత్త విజేత గా టోర్నీ మొత్తం ఆసాంతం అదరగొట్టిన ట్రయల్స్ బ్లేజర్స్ చివరలో కూడా అద్బుతంగా పోరాడింది. చిన్న టార్గెట్ ను సమర్దవంతంగా కాపాడుకోవడం వలన టైటిల్‌ను సాదించింది. ఆల్ రౌండర్స్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన బ్లేజర్స్ నవంబర్ 09న జరిగిన ఫైనల్లో 16పరుగుల తేడాతో సూపర్ నోవాక్ ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్స్ బ్లేజర్స్ 20ఓవర్లలో 118/8స్కోరు నమోదు చేసింది.ఐదు వికెట్లు తీసి రాదా యాదవ్ (5/16) టోర్నీలో ఈ ఘనత సాదించిన ఫస్ట్ బౌలర్ గా నిలిచింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ (30)టాప్ స్కోరర్ గా నిలిచింది. స్మృతి మంథనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మూడు మ్యాచ్ లో 8వికెట్లు తీసిన రాదా యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళా టి20 చాలెంజ్ టోర్నీ విజేతగా విన్నర్ ట్రయల్స్ బ్లేజర్స్ జట్టు
ఎవరు: ట్రయల్స్ బ్లేజర్స్ జట్టు
ఎప్పుడు: నవంబర్ 10
ఐపిఎల్ -13 చాంపియన్ గానిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు :

డిపెండింగ్ చాంపియన్ ముంబ ఇండియన్స్ కు ఎదురు లేకుండా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రోహిత్ సేన అలవోకగా ఐపిఎల్-13 విజేతగా నిలిచింది. నవంబర్ 10న జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో డిల్లి క్యాపిటల్స్ జట్టు పై ఘన విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ (65) రిషబ్పం త్ (56) బ్యాటింగ్‌తో మొదట డిల్లి 7వికెట్లకు 156పరుగులు సాదించింది. బౌల్ట్ (3/30),కౌల్టార్నైల్ (2/29) జయంత్ యాదవ్ 1/25) బౌలింగ్ తో డిల్లి టీంను కట్టడి చేసారు. రోహిత్ శర్మ (68) ఇషాన్ కిషన్(33) సత్తా చాటడంతో లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 18.4ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. ముంబై ఇండియన్స్ సాధించిన ఇది ఐదో టైటిల్.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ –ట్రెంట్ బౌల్ట్
టోర్నీ లో విలువైన ఆటగాడు: జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్)
పర్పుల్ క్యాప్ : (అత్యదిక వికెట్లు తీసిన వీరుడు) :రబాడా
ఆరెంజ్ క్యాప్ (అత్యదిక పరుగుల వీరుడు) :కే.ఎల్ రాహుల్ (పంజాబ్)
వర్తమాన ఆటగాడు : దేవ్ దత్ పడి క్కల్ (బెంగళూర్ )
ఫెయిర్ ప్లే అవార్డు : ముంబై ఇండియన్స్
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : పోలార్డ్ (ముంబై)
గేం చెంజర్ ఆఫ్ ది సీజన్ : కే.ఎల్ రాహుల్ (పంజాబ్)
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపిఎల్ -13 చాంపియన్ గానిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు
ఎవరు: ముంబై ఇండియన్స్ జట్టు
ఎక్కడ: యునైటెడ్ అమిరేట్స్
ఎప్పుడు: నవంబర్ 10
దేశం లోనేపొడవైన మోటరబుల్ సింగిల్ లేన్ వంతెన ఉత్తరాఖండ్‌లో ప్రారంభ౦ :

భారతదేశం లోనే అతి పొడవైన సింగిల్ లేన్ వేలాడే వంతెనను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ-గర్హ్వాల్ జిల్లాలో ఇటీవల ప్రారంభించారు. డోబ్రా-చంతి అనే (సస్పెన్షన్) వంతెనను 2020 నవంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ప్రారంభించారు. 725 మీటర్ల పొడవున్న ఈ వంతెన తెహ్రి సరస్సు మీదుగా 14 సంవత్సరాల సమయంలో రూ. 2.95 కోట్ల తో నిర్మించడుతుంది. ఇది టెహ్రీ మరియు ప్రతాప్‌నగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 5గంటల సమయం నుండి 1.5 గంటలకు తగ్గుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి:దేశం లోనేపొడవైన మోటరబుల్ సింగిల్ లేన్ వంతెన ఉత్తరాఖండ్‌లో ప్రారంభ౦
ఎవరు: త్రివేంద్ర సింగ్ రావత్
ఎక్కడ: ఉత్తరాఖండ్‌లో
ఎప్పుడు: నవంబర్ 10
సినీ రచయిత కళాకారులు రామచంద్ర మూర్తి కన్నుమూత :

సినీ కథా.నాటకరచయిత,రేడియో కళాకారులు జీడిగుంట రామచంద్రమూర్తి(80) కన్నుమూసారు. ఇటీవల కరోన బారినపడిన ఆయన బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 10న మరణి౦చారు. రామచంద్రమూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. బుల్లితెర ఉత్త్తమ రచయిత గా రెండు సార్లు నంది పురస్కారాలను అందుకున్నారు. సితార అనే పత్రిక వ్యాసాలు కూడా రాసారు. అయన 250పైగా కథలు రాసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సినీ రచయిత కళాకారులు రామచంద్ర మూర్తి కన్నుమూత
ఎవరు: రామచంద్ర మూర్తి
ఎప్పుడు: నవంబర్ 10
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |