
Daily Current Affairs in Telugu 27-10-2020
భారత్ అమెరికా మద్య 2+2చర్చలో బాగంగా కుదిరిన బెకా ఒప్పందం :

తూర్పు లద్దాక్ సరిహద్దులో యుద్దానికి కాలు దువ్వుతున్న చైనా కు అమెరికా విస్పష్ట హెచ్చరిక జరీ చేసింది.భారత్ కు తమ అండ ఉన్న సంగతిని గుర్తు చేసింది.సార్వ బౌమత్వం స్వేచ్చను కాపాడుకునేందుకు భారత్ చేసే ప్రయత్నాల్లో నిరంతరం ఉంటామని ఉద్గాటించింది. డిల్లి వేదికగా ప్రతిష్టాత్మక 2+2చర్చల్లో ముగిసిన అనంతరం ఈ మేరకు కీలక ప్రకటనలు చేసింది. తాజా చర్చల్లో భారత్ ,అమెరికా మొత్తం ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. దీర్గాకాలంగా పెండింగ్ లో ఉన్న బేసిక్ ఎక్స్ చేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) కూడా వాటిలో ఒకటి. దీంతో భారత్ అమెరికా మద్య సైనిక పరమైన సహకారం మరింత పెరగనుంది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లతో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం 2+2చర్చలు జరిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత్ అమెరికా మద్య 2+2చర్చలో బాగంగా కుదిరిన బెకా ఒప్పందం
ఎవరు: భారత్ అమెరికా
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 27
యు.ఎస్ సుప్రీం జడ్జీ గా బారెట్ ప్రమాణ స్వీకారం :

ట్రంప్ సుప్రీం కోర్టు జడ్జీ గా నియమించిన ఆమె కొని బారెట్ అక్టోబర్ 27న ప్రమాణ స్వీకారం చేసారు.ఆమె నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపిన గంటలోనే ప్రమాణ స్వీకారం జరిపారు.ఇందులో ట్రంప్ తో పాటు సుప్రీం జడ్జీ కార్లేస్ థామస్ తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు బారెట్ నియామకానికి సెనేట్ 52-48 ఓట్లతో మద్దతు తెలిపింది.బారెట్ ప్రమాణ స్వీకారం అమెరికా గుర్తుంచుకునే రోజు అని ట్రంప్ వ్యాక్యనించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న 9మంది న్యాయ ముర్త్తుల్లో ట్రంప్ ముగ్గిరిని నియమించారు.అమెరికా సుప్రీం కోర్టులో జడ్జీలకు రిటైర్మెంట్ ఉండదు.జీవిత కాలం వారు న్యాయ మూర్తులుగా ఉంటారు. తాజాగా నియామకం తో కన్సర్వేటివ్ కు సుప్రీం లో 6:3 నిష్పత్తి లో మద్దతు లబించనుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: యు.ఎస్ సుప్రీం జడ్జీ గా బారెట్ ప్రమాణ స్వీకారం :
ఎవరు: బారెట్
ఎక్కడ: యు.ఎస్
ఎప్పుడు: అక్టోబర్ 27
జల సంరక్షణ లో విజయ నగరం జిల్లాకు ఉత్తమ జిల్లా అవార్డు :

జల సంరక్షణ పనులు అత్యుత్తమ౦గా చేపట్టినందుకు గాను విజయ నగరం జిల్లాకు కేంద్ర జల శక్తి శాఖ ఉత్తమ జిల్లా అవార్డు ను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ నెహ్రు చొరవతో జిలాల్లో జల సంరక్షణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1500 చెరువులు శుద్ధి చేసారు. దీని వల్ల నీటి సంరక్షణ మెరుగుపడుతుంది. దేశంలో వివిధ జిల్లా ల నుంచి వచ్చిన నామినేషన్ల ను పరిశీలించిన జల శక్తి శాఖ జల సంరక్షణ విజయ నగరాన్ని ఉత్తమ జిల్లా గా ప్రకటించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: జల సంరక్షణ లో విజయ నగరం జిల్లాకు ఉత్తమ జిల్లా అవార్డు
ఎవరు: విజయ నగరం జిల్లా
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 27
అండర్ -19 ప్రపంచ కప్ విజేత తన్మయ్ శ్రీవాస్తవ క్రికెట్ నుంచి రిటైర్,మెంట్ :

2008 లో భారత అండర్ -19 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను 90 ఫస్ట్ క్లాస్ ఆటలు ఆడాడు. 4918 పరుగులు చేశాడు. అతను 44 లిస్ట్ ఎ మ్యాచ్లు మరియు 34 టి 20 లు కూడా ఆడాడు. అతను ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కూడా ఆడాడు, అక్కడ అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డెక్కన్ ఛార్జర్స్ మరియు కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిధ్యం వహించాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: అండర్ -19 ప్రపంచ కప్ విజేత తన్మయ్ శ్రీవాస్తవ క్రికెట్ నుంచి రిటైర్,మెంట్
ఎవరు: తన్మయ్ శ్రీవాస్తవ
ఎప్పుడు: అక్టోబర్ 27
ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంఖి దాస్ రాజీనామా :

భారత్ లో విద్వేషపూరిత సమాచారాన్ని నియత్రణ కు సంబంధించి ఇటీవల రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు గా మారిన సామజిక మాద్యమ సంస్థ ఫేస్ బుక్ లో మరో కుదుపు .ఆ సంస్థ ఇండియా పాలసి హెడ్ అంఖి దాస్ అక్టోబర్ 27 న రాజీనామా చేసారు. అంఖి దాస్ భారతీయ జనత పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు,హిందుత్వ వాదులు ఫేస్ బుక్ లో చేస్తున్న విద్వేష పూరిత పోస్టులను అడ్డుకోవడం లేదని రెండు నెలల క్రితం వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనం ప్రచురించడం సంచలనం సృష్టించింది.ఆ తర్వాత ప్రతిపక్షాలతో పాటు పదుల సంఖ్యలో ఆమె పై విమర్శలు చేసారు. దానిలో బాగంగా అంఖి దాస్ ఆ సంస్థ ఇండియా పాలసి హెడ్ అంఖి దాస్ అక్టోబర్ 27 న రాజీనామా చేసారు
క్విక్ రివ్యు:
ఏమిటి: ఫేస్ బుక్ ఇండియా హెడ్ అంఖి దాస్ రాజీనామా
ఎవరు: అంఖి దాస్
ఎప్పుడు: అక్టోబర్ 27
జియో లైఫ్ సంస్థ తొలి సియివో గా అమిత్ త్రిపాటి నియామకం :

సేంద్రియ ఎరువులు సస్య రక్షణ ఉత్పత్తులు తయారీలో ఉన్న జియో లైఫ్ అగ్రిటెక్ ఇండియా సంస్థ తొలి సియివో గా అమిత్ త్రిపాటి గారు నియమితులయ్యారు. ఇండో ఫిల్,బయో స్టాట్,డ్యుపంట్,జైటేక్స్ వంటి సంస్థల్లో ఆయన గతంలో పని చేసారు. ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుబవం ఉంది. బయో అగ్రికల్చర్ విభాగంలో విస్తరించాలన్న సంస్థ యొక్క లక్ష్యంలో బాగంగా ఈ నియామకం చేపట్టినట్లు కంపెని తెలిపింది.70పైగా దేశాలకు కంపెని తన ఉత్పత్తులను సేవలతో విస్తరించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: జియో లైఫ్ సంస్థ తొలి సియివో గా అమిత్ త్రిపాటి నియామకం
ఎవరు: అమిత్ త్రిపాటి
ఎప్పుడు: అక్టోబర్ 27
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |