
Daily Current Affairs in Telugu 05-10-2020
ఎస్బిఐ సిఎఫ్ఓగా నియమితులయిన చరంజిత్ అట్రా :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 2020 అక్టోబర్ 01 నుండి చరంజిత్ సింగ్ అట్రాను తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమించింది. మాజీ డిప్యూటీ ఎండి & సిఎఫ్ఓ ప్రశాంత్ కుమార్‌ను మార్చి 2020 లో యెస్ బ్యాంక్ సిఇఒగా నియమించిన తరువాత ఈ పదవి ఖాళీగా ఉంది.సి వెంకట్ నాగేశ్వర్ తాత్కాలిక ౦గా ఈ పదవిలో పనిచేస్తున్నారు. చరంజిత్ సింగ్ అట్రా గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఈవై ఇండియాలో మాజీ భాగస్వామి మరియు ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌లో CFO గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎస్బిఐ సిఎఫ్ఓగా నియమితులయిన చరంజిత్ అట్రా
ఎవరు; చరంజిత్ అట్రా
ఎప్పుడు: అక్టోబర్ 05
కృష్ణ బిలం పరిశోదన గాను భౌతిక శాస్తం లో ముగ్గురు శాస్తవేత్తలకు నోబెల్ పురస్కారం :

కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపార శక్తి ని కేంద్ర కృష్ణ బిలం పై మన అవగాహన మరింత పెంచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది బౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ ఫేస్ రోజ్ కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని జర్మనికి చెందిన రైన్ హార్డ్ గెంజేల్ ,అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్ లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ అక్టోబర్ 06న ప్రకటించింది.కృష్ణ బిలం ఏర్పడటం ఐన్ స్టీన్ సాపేక్ష సిద్దాంతానికి ప్రజలే ఉదాహరణ అని గుర్తించినందుకు ఫేస్ రోజ్ కు అవార్డు లబించగా మన పాలపుంత మద్యలో అతి భారయుతమైన తక్కువ ప్రాంతాన్నిఆక్రమిచిన ఖగోళ వస్తువు ను గుర్తించినందుకు గాను రైన్ హార్డ్ గెంజేల్ ,ఆంధ్రియా గేజ్ లకు అవార్డ్ అందిస్తున్నట్లు అకాడమి సెక్రటరి జనరల్ గోరన్ కే హస్సన్ వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కృష్ణ బిలం పరిశోదన గాను భౌతిక శాస్తం లో ముగ్గురు శాస్తవేత్తలకు నోబెల్ పురస్కారం
ఎవరు; రోజర్ ఫేస్, రైన్ హార్డ్ గెంజేల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్
‘యుధ్ ప్రధూషణ్ కే విరుధ్ అనే’ ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ :

డిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి కాలుష్య నిరోధక ప్రచారం ‘యుధ్ ప్రధూషణ్ కే విరుధ్’ అనే ఒక కార్యక్రమం ను ప్రారంభించినట్లు డిల్లి సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వాతహవరనం లో పెరుతున్న కాలుష్యానికి నిరోధించడానికి డిల్లీ ప్రభుత్వం దుమ్మునిరోధక ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా, పుసా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం దహనం ద్వారా వచ్చే పొగను అరికట్టడానికి ఉపయోగించబడుతుంది.కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఫోటో ఆధారిత యాప్ ‘గ్రీన్ డిల్లి” ను ప్రారంభించనుంది. ఈ యాప్ పౌరుల కోసం ప్రారంభించబడింది..
క్విక్ రివ్యు :
ఏమిటి: యుధ్ ప్రధూషణ్ కే విరుధ్ అనే’ ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఎవరు; సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: : అక్టోబర్ 05
ప్రముఖ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత :

మూడుసార్లు శాసనమండలి సభ్యుడు, ఔరియా చెందిన ప్రముఖ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సుదీర్గ అనారోగ్యంతో ( 92) అయన కన్నుమూశారు.అతను ఒక దశాబ్దానికి పైగా ఔరియ బ్లాక్, భాగ్య నగర్ యొక్క బ్లాక్ చీఫ్.1973 నుండి 1988 వరకు, అతను భాగ్య నగర్ యొక్క బ్లాక్ చీఫ్ గా మరియు తరువాత 1990 లో మొదటిసారి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి 2010 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ఎవరు; ములాయం సింగ్ యాదవ్
ఎప్పుడు : అక్టోబర్ 05
ప్రపంచ నివాస దినోత్సవం గా అక్టోబర్ 05

ప్రపంచ నివాస దినోత్సవం గా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెల మొదటి సోమవారం రోజును నివాస దినోత్సవం గా పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ నివాస దినోత్సవం ను 1985 లో సర్వ సభ్య తీర్మానం ద్వారా గుర్తించింది.మరియు దీనిని మొదటి సారి 1986 లో జరుపుకున్న్నారు. ఈ నివాస దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మన పట్టణాలు మరియు నగరాల స్థితి గతుల పై అక్కడి నివసించే ప్రజల యొక్క అందరి ప్రాథమిక హక్కుల ను ప్రతిబింబిచడం మరియు మన నగరాలు పట్టణాలు యొక్క భవిష్యత్ ను మార్చుకునే శక్తి బాధ్యత మనందరికీ ఉందని గుర్తు చేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం .
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ నివాస దినోత్సవం గా అక్టోబర్ 05
ఎవరు; ఐక్యరాజ్య సమితి
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: అక్టోబర్ 05
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |