Daily Current Affairs in Telugu 19-11-2020
తెలంగాణా రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయ మూర్తిగా జస్టిస్ శ్రీ దేవి ప్రమాణ స్వీకారం :

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి గారు నవంబర్ 19న ప్రమాణ స్వీకారం చేసారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహన్ నవంబర్ 19న జస్టిస్ శ్రీదేవి గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. విశాఖ పట్నానికి చెందిన ఆమె రూర్కెల న్యాయ కళాశాలలో 1986లో న్యాయ శాస్త్రం లో పట్టా పొందారు. ఓడిశా సబార్డినేట్ కోర్టులతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు లో ప్రాక్టిస్ చేసారు. 2005లో ఉత్తరప్రదేశ్ ఝాన్సి లో అదనపు జిల్లా జడ్జి గాఎంపిక అయ్యాక జిల్లా జడ్జి గా 2016లో పదోన్నతి పొందారు. అదనపు జడ్జిగా 2018,నవంబర్ లో ఎంపిక అయిన శ్రీదేవి గారు 2019మే 15న తెలంగాణా హైకోర్టు కు బదిలీ పైన వచ్చారు. ఈ మేరకు అదనపు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ శ్రీదేవి గారిని శాశ్వత న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయ మూర్తిగా జస్టిస్ శ్రీ దేవి ప్రమాణ స్వీకారం
ఎవరు: జస్టిస్ శ్రీ దేవి
ఎక్కడ: తెలంగాణా రాష్ట్రo
ఎప్పుడు: నవంబర్ 19
హుబ్బలి లో ఏర్పాటు కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రైల్వే ఫ్లాట్ ఫాం :

నైరుతి రైల్వే ప్రదాన కేంద్రం హుబ్బలి లో ప్రపంచ లోనే అతి పొడవైన రైల్వే ఫ్లాట్ ఫాం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్ ఫాం ను తొలుత 1400మీటర్ల కు పెంచాలని భావించారు. ఇప్పుడు దాన్ని 1505 మీటర్లకు పెంచుతున్నారు. రూ.90కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్ ఫాం నిర్మాణ అబివృద్ది పనులు 2021 జనవరి నాటికి పూర్తీ అవుతాయి అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ఈశాన్య రైల్వే జోన్ లో ప్రధాన కేంద్రంగా గోరఖ్ పూర్ లో ప్రపంచంలోనే అతి పొడవైన 13,66మీటర్ల పొడవైన ఫ్లాట్ ఫాం ఉంది. ఇపుడు హుబ్బలి ఫ్లాట్ ఫాం అందుబాటులోకి వస్తే ఇది సరికొత్త రికార్డు గా నమోదవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హుబ్బలి లో ఏర్పాటు కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన రైల్వే ఫ్లాట్ ఫాం
ఎక్కడ: హుబ్బలి (కర్ణాటక )
ఎప్పుడు: నవంబర్ 19
స్వచ్చత లో జాతీయ అవార్డులకు తెలంగాణ నుంచి రెండు జిల్లాలు ఎంపిక :

స్వచ్చత లో పెద్దపల్లి సిద్ధిపేట జిల్లాలు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నాయి. నవంబర్ 19న ప్రపంచ టాయ్ లెట్ దినోత్సవ సందర్బంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెద్దపల్లి మరియు సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లకు అవార్డులకు ఆన్ లైన్ ద్వారా అందజేశారు. మరుగు దొడ్ల వినియోగం పైన ప్రజల్లో అవగాహన పెంపొందించడం కమ్యునిటీ టాయ్ లెట్ల నిర్మాణం,స్వచ్చ భారత్ మిషన్ లో కనబరిచిన ప్రదర్శన ఆదరంగా దేశ వ్యాప్తంగా 20జిల్లాలను అవార్డులకు ఎంపిక చేసారు.అందులో తెలంగాణ రాష్ట్రము లో నుంచి పెద్ద పల్లి ,సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది.కరోన నేపద్యం లో అవార్డుల ప్రదానం కేంద్రజలశక్తి మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ లో నిరహించింది.
. క్విక్ రివ్యు :
ఏమిటి: స్వచ్చత లో జాతీయ అవార్డులకు తెలంగాణ నుంచి రెండు జిల్లాలు ఎంపిక
ఎవరు: కేంద్రజలశక్తి మంత్రిత్వ శాఖ
ఎప్పుడు: నవంబర్ 19
గోవుల సంరక్షణ కోసం ఒక ప్రత్యెక కేబినేట్ ను ఏర్పాటు చేసిన మద్యప్రదేశ్ ప్రభుత్వం :

గోవుల సంరక్షణను ప్రోత్సహించడానికి కోసం ప్రత్యెక కేబినేట్ ను ఏర్పాటు చేయాలని మద్యపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 18న ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తో పాటుగా హోమ్ మంత్రి నరోత్తం,అటవీ శాఖ మంత్రి విజయ్ షా,వ్యవసాయశాఖా మంత్రి కమల్,పంచాయితి గ్రామీణ అబివృద్ది శాఖా మంత్రి మహేంద్ర ,పశుసవర్డక శాఖ మంత్రి ప్రేమ్ లు ఈ కేబినేట్ లో ఉంటారు. ఈ గోపాష్టమి సందర్బంగా నవంబర్ 22న కేబినేట్ తొలి బేటి జరగనుంది. గోవుల పాసంరక్షణతో పాటు ఆవు పాలతో తయారు చేసిన ఉత్పత్తులు ఔషద విలువలు కలిగిన గో మూత్రం,పిడకలు వంటి వాటికీ మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ కేబినేట్ పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గోవుల సంరక్షణ కోసం ఒక ప్రత్యెక కేబినేట్ ను ఏర్పాటు చేసిన మద్యప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: మద్యప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: మద్యప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 19
ప్రపంచ టాయ్ లెట్ దినోత్సవం గా నవంబర్ 19

ప్రపంచ పారిశుద్యంలో ఉన్న సమస్యలను గూర్చి ప్రజలకు తెలియచేసి వారిని పరిశుబ్రత వైపు ప్రేరేపించడం మరియు 2023నాటికి అందరికి పారిశుద్యానికి హామీ ఇచ్చే సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్ (ఎస్డిజి) ను సాధించడానికి ప్రపంచ టాయ్ లెట్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 19న జరుపుకుంటారు. డబ్ల్యు.హెచ్.వో ఆరోగ్య సంస్థ మరియు యునిసెఫ్ ప్రకారం 60శాతం ప్రపంచ జనాభా సుమారు 4.5బిలియన్ల మందికి ఇంట్లో మరుగు దొడ్డి లేవు.మల మూత్రాలను బహిరంగంగా చేస్తున్నారు. వాటి వల్ల పరిసరాలు నాశనం మరియు వాటి వల్ల ఇతర రోగాలు కూడా వ్యాప్తిస్తున్నాయి. వాటి ద్వారా జరిగే నష్టాలను ప్రజల కు వివరించి వాటి ఉపయోగం మరియు పారిశుద్యం మరుగు దొడ్ల వినియోగం పైన ప్రజల్లో అవగాహన పెంపొందించడం కమ్యునిటీ టాయ్ లెట్ల నిర్మాణం,పై న అవగాహన పెంపొందించం దీని ఉద్దేశం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ టాయ్ లెట్ దినోత్సవం గా నవంబర్ 19
ఎవరు: డబ్ల్యు.హెచ్.వో
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: నవంబర్ 19
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |