Daily Current Affairs in Telugu 14-10-2020

Daily Current Affairs in Telugu 14-10-2020

rrb ntpc online exams in telugu

ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి మళ్ళి ఎన్నికైన పాకిస్తాన్ :

ఐక్య రాజ్య సమితి  మానవహక్కుల సంఘానికి పాకిస్తాన్ దేశం తిరిగి ఎన్నిక అయింది. మానవ హక్కుల పరంగా పాకిస్తాన్ చరిత్ర ఏమంత గొప్పగా లేకున్నా విమర్శలు ఎదురైనా వాటిని అధిగమించి ఈ ఘనత సాధించింది.ఖాలిగా ఉన్న నలుగు స్థానాలకు ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో అయిదు దేశాలు పోటీ పడగా పాకిస్తాన్ అత్యధిక ఓట్లు సాధించడం గమనార్హం.సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలో పాకిస్తాన్ కు 169 ,ఉజ్బెకిస్తాన్ 164 నేపాల్ కు 150 చైనా కు 139 ఓట్లు పడగా 90ఓట్లతో  సౌది అరేబియా ఓటమి చవి చూసింది.2006 లో ఈ సంఘం ఏర్పడగా పాకిస్తాన్ ఎన్నిక అవడం ఇది అయిదో సారి.తాజాగా  ఈ ఎన్నికతో 2021 జనవరి 1 నుంచి మరో మూడేళ్ళు వరకు పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మనవ హక్కుల సంఘం సభ్య దేశంగా కొనసాగనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి మళ్ళి ఎన్నికైన పాకిస్తాన్

ఎవరు: పాకిస్తాన్

ఎక్కడ:న్యూయార్క్

ఎప్పుడు: అక్టోబర్ 14

 ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశ౦ 2021 దావోస్ కు మార్పు :

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) తన వార్షిక సమావేశాన్ని 2021 మే 18 నుండి 21 వరకు స్విట్జర్లాండ్‌లోని లూసర్న్-బర్గెన్‌ స్టాక్‌లో నిర్వహి౦చ నిర్ణయించింది, స్కీ రిసార్ట్ పట్టణం దావోస్ లో 2021 జనవరి చివరిలో నిర్వహించనుంది..కరోనా వైరస్ మహమ్మారి కారణంగా  షెడ్యూల్ మరియు వేదికలో మార్పు అవసరంగా భావించింది. లూసర్న్-బర్గెన్‌స్టాక్‌లో వార్షిక సమావేశం 2021 ‘ది గ్రేట్ రీసెట్’ అనే థీమ్ చుట్టూ జరుగనుంది. ఈ సమావేశం ప్రపంచంలోని అత్యంత సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన పరిష్కారాలపై ఈ సమావేశం దృష్టి పెట్టనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశ౦ 2021 దావోస్ కు మార్పు

ఎవరు: ప్రపంచ ఆర్థిక ఫోరం

ఎక్కడ: దావోస్

ఎప్పుడు: అక్టోబర్ 14

ప్రముఖ నృత్య కళాకారిణి  శోబానాయుడు కన్నుమూత :

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి  శోభానాయుడు (64) కన్నుమూసారు.కొంత కాలంగా  ఆమె న్యూరో సంబంధిత సమస్యతో భాదపడుతూ  చికిత్స పొందుతున్నారు.ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడటంతో  తలకు బలమైన దెబ్బ తగిలింది.దీంతో సోడియం స్తాయిలు పడిపోయాయి.పది రోజులు క్రితం జ్వరం ఇతర ఇబ్బందులు తలెత్తడం తో కుటుంబ సబ్యులు ఆమెను బంజర హిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.తరువాతి రోజు ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 14న కన్నుమూసారు.ఈమె హైదరాబాద్ లో కూచిపూడి  ఆర్ట్స్ అకాడమి స్థాపించి ఎంతో మందికి శోబానాయుడు నృత్యంలో శిక్షణ ఇచ్చారు.1992 లో చెన్నై లోని ప్రతిస్తాత్మక కృష్ణ గాన సభ  వారి నుంచి నృత్య చూడామణి పురస్కారం ,1990లో కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు ,1998 లో ఎన్టీ ఆర్ పురస్కారం ,2001 లో పద్మ శ్రీ  2011 లో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక అవార్డ్  ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ నృత్య కళాకారిణి  శోబానాయుడు కన్నుమూత

ఎవరు: శోబానాయుడు

ఎప్పుడు: అక్టోబర్ 14

మాజీ దిగ్గజ క్రికెటర్ రీడ్ కన్నుమూత :

న్యూజిలాండ్ తొలి తరం క్రికెట్ లో జీవించి ఉన్న ఆ దేశ టెస్టు క్రికెటర్లలో  అత్యంత  పెద్ద వయస్కుడైన  జాన్ రీడ్  మరణించాడు.92ఏళ్ల  వయసులో  ఆయన తుది శ్వాస విడిచినట్లు అక్టోబర్ 14 న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎన్ జెడ్సి ప్రకటించింది.దేశ  క్రికెట్ కు గొప్ప దారి చూపిన రీడ్ పేరు ఎప్పటికి నిలిచిపోతుది అని ఎన్జెడ్సి సియివో డేవిడ్ వైట్ తెలిపాడు.1950 ,60 వ దశకాల్లో అత్యుత్తమ  ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న అయన 34టెస్టులు  జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు.ఆ దేశ జట్టు సాధించిన తొలి మూడు విజయాలు ఆయన సారద్యంలో నే కావడం విశేషం.246 ఫస్ట్ క్లాస్  మ్యాచ్ లు ఆడిన రీడ్  16128 పరుగులు చేయడమే కాకుండా 85వికెట్లు పడగొట్టాడు.ఆరు శతకాలు నమోదు చేసాడు.1965 ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సెలక్టర్ గా మేనేజర్ గా ఐఐసి మ్యాచ్ రిఫరీగా  వివిధ బాద్యతలు నిర్వర్తించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: మాజీ దిగ్గజ క్రికెటర్ రీడ్ కన్నుమూత

ఎవరు: క్రికెటర్ రీడ్

ఎక్కడ: న్యూజిలాండ్

ఎప్పుడు: అక్టోబర్ 14

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

rs aggarwal online video classes

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily current affairs in telugu -August 2020
Daily current affairs in telugu -01-08- 2020
Daily current affairs in telugu -02-08- 2020
Daily current affairs in telugu -03-08- 2020
Daily current affairs in telugu -04-08- 2020
Daily current affairs in telugu -05-08- 2020
Daily current affairs in telugu -06-08- 2020
Daily current affairs in telugu -07-08- 2020
Daily current affairs in telugu -08-08- 2020</strong>
Daily current affairs in telugu -09-08- 2020
Daily current affairs in telugu -10-08- 2020
Daily current affairs in telugu -11-08- 2020
Daily current affairs in telugu -12-08- 2020
Daily current affairs in telugu -13-08- 2020
Daily current affairs in telugu -14-08- 2020
Daily current affairs in telugu -15-08- 2020
Daily current affairs in telugu -16-08- 2020
Daily current affairs in telugu -17-08- 2020
Daily current affairs in telugu -18-08- 2020
Daily current affairs in telugu -19-08- 2020
Daily current affairs in telugu -20-08- 2020
Daily current affairs in telugu -21-08- 2020
Daily current affairs in telugu -22-08- 2020
Daily current affairs in telugu -23-08- 2020
Daily current affairs in telugu -24-08- 2020
Daily current affairs in telugu -25-08- 2020
Daily current affairs in telugu -26-08- 2020
Daily current affairs in telugu -27-08- 2020
Daily current affairs in telugu -28-08- 2020
Daily current affairs in telugu -29-08- 2020
Daily current affairs in telugu -30-08- 2020
Daily current affairs in telugu -31-08- 2020

current affairs questions in telugu

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *