Daily Current Affairs in Telugu 05-11-2020
న్యూజిలాండ్ క్రికెట్ టీం కోచ్ గా ఎంపిక అయిన ల్యుక్ రోంచి :

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా మాజీ వికెట్ కీపర్ ల్యుక్ రోంచి ఎంపిక య్యాడు. త్వరలో జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్ లో తమ సొంత గడ్డ నుంచి జరగనున్న మ్యాచ్ తో ఈయన కోచ్ గా పదవి బాద్యతలు స్వీకరించనున్నారు.ఇంతకు ముందు వరకు ఈ స్థానం లో మరో మాజీ క్రికెటర్ పీటర్ ఫల్టన్ కోచ్ గా బాద్యతలు నిర్వర్తించారు.గత వందే వరల్డ్ కప్ సమయం లోనే రోంచి టీం కోచింగ్ బృందం లో భాగంగా ఉన్నాడు. ఇపుడు అతడికి బ్యాటింగ్ కోచ్ గా పూర్తి స్థాయి కోచ్ గా ఆయనకు బాద్యతలు అప్పగించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: న్యూజిలాండ్ క్రికెట్ టీం కోచ్ గా ఎంపిక అయిన ల్యుక్ రోంచి
ఎవరు: ల్యుక్ రోంచి
ఎక్కడ: న్యూజిలాండ్
ఎప్పుడు: నవంబర్ 05
భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే కు దక్కిన నేపాల్ దేశ గౌరవ జనరల్ హోదా :

భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే ను నేపాల్ రాష్ట్రపతి బిద్య దేవి బండారి తమ దేశ సైన్యం లో గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు.రాష్టపతి అధికారిక నివాస్ శీతల్ నివాస్ లో నవంబర్ 05న జరిగిన ప్రత్యెక కార్యక్రమం లో ఆయనకు ఓ ఖడ్గం,సైనిక చిహ్నం,,గౌరవ జనరల్ హోదాకు సంబంధించిన అధికారిక ద్రువికరణ పత్రాన్ని అందజేశారు. ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక సంబందాలను మెరుగు పరిచేందుకు అవ్వసరమైన చర్యల గురించి చర్చించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే కు దక్కిన నేపాల్ దేశ గౌరవ జనరల్ హోదా
ఎవరు: భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే
ఎక్కడ: నేపాల్
ఎప్పుడు: నవంబర్ 05
కెరీర్ లో వెయ్యి విజయాలు అందుకున్న నాలుగవ ఆటగాడిగా నిలిచిన రాఫెల్ నాదల్ :

స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తన అసమాన కేరీర్ లో మరో మెయిలు రాయిని దాటాడు.పారిస్ మాస్టర్స్ -1000 టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రి క్వార్టర్స్ లో చేరడం ద్వారా 1000 టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రిక్వర్తర్స్ ల కు చేరడం ద్వారా 1000వ విజయాన్ని నమోదు చేసాడు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 05 రెండో రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన నాదల్ 4-6,7-6,(7/5),6-4 తో ఫెలిసియానో లోఫెజ్ (స్పెయిన్ ) పై గెలుపు సాధించాడు. తద్వారా ఓపెన్ శకం (1968 తర్వాత ) లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్ కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (1274) ,రోజర్ ఫెదరర్ (1242) ,ఇవాన్ లెండిల్ (1068) ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: కెరీర్ లో వెయ్యి విజయాలు అందుకున్న నాలుగవ ఆటగాడిగా నిలిచిన రాఫెల్ నాదల్
ఎవరు: రాఫెల్ నాదల్
ఎక్కడ: స్పెయిన్
ఎప్పుడు: నవంబర్ 05
యు.ఎస్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా రికార్డు కెక్కిన టోరేస్ :

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అబ్యార్తి రఛీ టోరేస్ (32) సరికొత్త చరిత్ర సృష్టించారు. యు.ఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) లో ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా టోరేస్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం అయన న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెశనల్ జిల్లా నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అబ్యర్థి పాట్రిక్ డేలిసేస్ ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని అయన వ్యాఖ్యానించాడు. ఈయన 2013 నుంచి సిటీ కౌన్సిల్ సబ్యుడిగా కొనసాగుతున్నాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: యు.ఎస్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా రికార్డు కెక్కిన టోరేస్
ఎవరు: టోరేస్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: నవంబర్ 05
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |