Daily Current Affairs in Telugu 03-10-2020
అంతర్జాతీయ ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విష్ణు శివరాజ్ పాండియన్ :

అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత ఆటగాడు విష్ణు శివరాజ్ పాండియన్ సత్తా చాటాడు.అక్టోబర్ 03న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైపిల్ పోటీలలో ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకం ను కైవసం చేసుకున్నాడు.క్వాలిఫైయంగ్ లో 630.8 పాయింట్ల తో రెండో స్థానం ల నిలిచి ఫైనల్ కు వెళ్ళిన 16ఏళ్ల ఆటగాడు విష్ణు ఈ తుది పోరులో 251.4 పాయింట్లతో అగ్రస్థానం లో నిలిచాడు. ఈ పోటీలలో మరో భారత ఆటగాడు ప్రత్యూష్ అమన్ ఎడోస్థానం తో సరిపెట్టుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విష్ణు శివరాజ్ పాండియన్
ఎవరు: విష్ణు శివరాజ్ పాండియన్
ఎప్పుడు: అక్టోబర్ 03
ఫార్ములావన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆటోమొబైల్ కంపెని హోండా :

అంతర్జాతీయ ఆటో మొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ )ఫార్ములావన్ నుంచి ఆటో మొబైల్ కంపెని అయిన హోండా ఈ టోర్నీ నుంచి వైదోలుగుతుంది అని ప్రకటించింది.ప్రఖ్యాత రెడ్ బుల్ మరియు ఆల్ఫా టోరీ వంటి జట్లకు ఇంజిన్లను సరఫరా చేసే జపాన్ కంపెని హోండా 2021 సీజన్ ముగింపు నాటికీ ఫార్ములావన్ ఎఫ్1 నుంచి వైదొలుగుతున్నట్లు అక్టోబర్ 02 న ప్రకటించింది.ఇది పర్యావరణానికి కీలకమైన కార్బన్ న్యూట్రిలిటి ని 2050 నాటికీ సాధించాలనే లక్ష్యానికి కట్టు బడినందువల్లే ఈ కటిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ కంపెని యొక్క చీఫ్ ఎగ్సికుటివ్ అయిన తక హిరో హచిగో తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫార్ములావన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆటోమొబైల్ కంపెని హోండా
ఎవరు: హోండా
ఎప్పుడు: అక్టోబర్ 03
అణ్వస్త్ర క్షిపణి శౌర్య ను విజయావంతంగా ప్రయోగించిన భారత్ :

అణ్వస్త్ర సామర్త్యం ఉన్న హైపర్ సోనిక్ క్షిపణి శౌర్య లో కొత్త వెర్షన్ ను భారత్ అక్టోబర్ 03న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అస్త్రం దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం లోని లక్ష్యాలకు నాశనం చేస్తుంది. ఓడిశా లోని ఎపిజే అబ్దుల్ కలాం దీవి లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటిఆర్) నుంచి మద్యహ్నం 12.10గంటలకు ఈ ప్రయోగం జరిగింది. తూర్పు లాడాక్ లో చైనా తో ఉన్న సరిహద్దు లలో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ ప్రయోగం ప్రాదాన్యం ఏర్పడింది.
ప్రత్యేకతలు :
- ఈ శౌర్య అస్త్రం జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే-15 తరగతి క్షిపణి కి చెందిన బూతల వెర్షన్ ప్రపంచం లో ఈ శ్రేణికి చెందిన 10అత్యుత్తమ క్షిపణి లో శౌర్య కూడా ఒకటని రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డిఆర్డివో) శాస్త్రవేత్తలు తెలిపారు.
- అధునాతన మార్గ నిర్దేశక చోదక నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉన్నాయన్నారు.ఇది స్వయంగా మార్గ నిర్దేశకం చేయగలదు.
- 200నుంచి వెయ్యి కిలో మీటర్ల పేలోడ్ ను ఈ క్షిపణి మోసుకేల్లుతుంది.ఈ క్షిపణి ట్రక్కు పై ఉంచిన క్యాన్సిస్టర్ల నుంచి సులువుగా ప్రయోగించవచ్చు.
- దీనిని శత్రువ్లుల కంట పడకుండా దీనిని దాచే వీలు కూడా ఉంది. ప్రత్యర్ది ఉపగ్రహాలు తీసే ఫోటోలకు దీన్ని గుర్తించడం చాలా కష్టం .
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వస్త్ర క్షిపణి శౌర్య ను విజయావంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు: అక్టోబర్ 03
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :

హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ప్రపంచం లోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని టన్నెల్ ని ప్రదాని నరేంద్ర మోడి గారు అక్టోబర్ 23న ప్రారంబించారు.హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లెహ్ మద్య 46 కిమీ దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది.9.02 కిమీ ల పొడవైన ఈ టన్నెల్ వాళ్ళ ప్రయాణ సమయం 5గంటలకు తగ్గిపోతుంది.బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్వో)అత్యంత ప్రతికూల పరిష్థితుల మద్య ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది.మొదట్లో దీనిని “రోహతంగ్ సొరంగం” అని పిలిచేవారు.2019 లో దీనికి “అటల్ సొరంగం” అని పేరు మార్చారు.
ప్రత్యేకతలు :
- సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచం లోనే అత్యంత పొడవైన హైవే సొరంగం ఇది.నిర్మాణ వ్యయం రూ.3.300 కోట్లు .
- సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యహాత్మక మైనది.ఎలాంటి ఉద్రిక్తల పరిస్థితుల తలెత్తిన మిలిటరీ సామగ్రి ని తరలించడానికి ఈ సొరంగం ఎంతో ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్ లో
ఎప్పుడు: అక్టోబర్ 03
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |