Daily Current Affairs in Telugu 13-10-2020
అమెరికా లో హిందు చారిటిస్ అద్యక్షుడికి దక్కిన జీవన సాపల్య పురస్కారం :

హిందు చారిటీస్ ఫర్ అమెరికా సంస్థ వ్యవస్థాపక అద్యక్షుడు హరీష్ కోటేచా ప్రతిష్టాత్మక శాండ్రా నీస్ జీవన సాపల్య పురస్కారం అందుకున్నారు.అమెరికాలో నిరాశ్రయులైన పిల్లలకు, యువతులకు అవసరాలు తీరుస్తున్న౦దుకు గాను ఆయనకి ఈ విశిష్ట గౌరవం దక్కింది. నేషనల్ అసోసియేష్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ హోమ లెస్ చిల్డ్రన్ అండ్ యూత్ సంస్థ అక్టోబర్ 09 న ఈ అవార్డును హరీష్ కు అందజేసింది. అమెరికాలో లోని హిందు చారిటీస్ సంస్థ ఆ దేశంలో 11వేల మందికి పైగా నిరాశ్రయులైన పిల్లల చదువులకు సాయం చేస్తుంది.మరియు పేద కుటుంబాలకు 550 మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణ ఉపకార వేతనాలు ఇస్తోంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికా లో హిందు చారిటిస్ అద్యక్షుడికి దక్కిన జీవన సాపల్య పురస్కారం
ఎవరు: హరీష్ కోటేచా
ఎక్కడ: అమెరికా లో
ఎప్పుడు: అక్టోబర్ 13న
ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్స్ విభాగం గ్రే హౌండ్స్ డిజి గా ఆర్కేమీనా నియామకం:

ఆంద్రప్రదేశ్ ఆపరేషన్స్ విభాగం (గ్రేహౌండ్స్అక్టోపస్) అదనపు డిజిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.ఆర్కే మీనా సహా ఐదు గురు ఐపిఎస్ అధికారుల ను అక్టోబర్ 13న బదిలీ చేసింది. నిరీక్షణలో ఉన్న త్రివిక్రమ్ వర్మ ను గుంటూరు రేంజి డిఐజి గా నియమించింది. ఎసిబి డైరెక్టర్ గా ఉన్న శంఖబ్రథ బాగ్బి బెటాలియన్స్ ఐజి గా నిఘా విభాగం డిఐజి ఉన్న జి విజయ్ కుమార్ ను హోమ్ శాఖా ప్రత్యెక కార్యదర్శిగా నిరీక్షణలో ఉన్న సుదీర్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ గా బదిలీ చేసారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సహని అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్స్ విభాగం గ్రే హౌండ్స్ డిజి గా ఆర్.కే మీమీనా నియామకం
ఎవరు: ఆర్.కే మీమీనా
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 13న
ఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా వెల్లడించిన యువ సంపన్నుల జాబితాలో మొదటి స్థానం లో నిలిచినా జేరోదా సంస్థ :

నాలుగుపదుల వయస్సు లోపే సొంతంగా ఎదిగి వ్యాపార రంగంలో సమున్నత విజయాలు సాధించి సంపన్నులుగా మరీనా భారతీయ యువ వ్యాపర వేత్తల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా వెల్లడించింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా 40అండర్ సెల్ఫ్ మెడ్ రిచ్ లిస్టు 2020 పేరుతో రూపొందించిన ఈ జాబితాలో విజయవాడకు చెందిన శ్రీ హర్ష మాజేటి రూ 1400 కోట్ల సంపదతో 15వ స్థానం లో నిలిచారు.భుందిల్ టెక్నాలజీస్ అనే సంస్థ సహా వ్యవస్థాపకుడు గా శ్రీ హర్ష ఉన్నాడు. పుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గి కి మాతృ సంస్థ భుందిల్ టెక్నాలజీస్.స్విగ్గికి టా న్సేంట్ హోల్డింగ్స్ నాస్సేర్స్ లిమిటెడ్ డిఎస్టి గ్లోబల్ వంటి సంస్థలు పెట్టుబడి సమకూర్చిన విషయం తెలిసిందే.శ్రీహర్ష గత ఏడాదిలో ఈ జాబితాలో ఉన్నారు.అయన సంపద విలువ గత ఏడాది స్థాయిలో నే ఉన్నట్లు ఐఐఎఫ్ఎల్వెళ్త హరూన్ ఇండియా పేర్కొంది.
జాబితా లో మొదటి స్థానాలు :
- నితిన్ కామత్ నిఖిల్ కామత్ –జేరోధ సంస్థ
- దివ్యంక్ తురకియా –మీడియా నెట్
- అమోద్ మల్శియ –ఉడాన్
- సుజిత్ కుమార్ –ఉడాన్
- వైభవ్ గుప్తా –ఉడాన్
- రిజు రవీంద్రన్ – థింక్ అండ్ లేరన్
- బిన్నీ బన్సాల్ –ఫ్లిప్ కార్ట్
- సచిన్ బన్సాల్ –ఫ్లిప్ కార్ట్
- రితేష్ అగర్వాల్ –ఆరవెల్ స్టేస్
- భవిష్ అగర్వాల్ –ఎఎన్ఐటెక్నాలజీస్
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా వెల్లడించిన యువ సంపన్నుల జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన జేరోదా సంస్థ
ఎవరు: జేరోదా సంస్థ
ఎప్పుడు: అక్టోబర్ 13న
ప్రపంచ విపత్తు నివారణ దినోత్సవం గా అక్టోబర్ 13 :

విపత్తు తగ్గింపు ప్రమాదం గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం గా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 13 న జరుపుకుంటారు. 1989 లో, అంతర్జాతీయ విపత్తు ప్రమాదాన్ని తగ్గించే దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రారంభించింది. విపత్తు ప్రమాదాన్ని తగ్గించే ఉద్దేశం తో ప్రమాద౦ దాని వలన నష్టాలు ముందు జాగ్రత్త గురించి అవగాహన మరియు విపత్తు తగ్గింపు యొక్క ప్రపంచ సంస్కృతిని ప్రోత్సహించడానికి అక్టోబర్ 13 న దీనిని జరుపుకుంటారు
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ విపత్తు నివారణ దినోత్సవం గా అక్టోబర్ 13
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: అక్టోబర్ 13న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |