
Daily Current Affairs in Telugu 13-11-2020
బంగ్లాదేశ్ కుర్రాడికి దక్కిన బాలల శాంతి పురస్కారం :

తన దేశంలో సైబర్ వేధింపులు అడ్డుకున్దేందుకు విశేషంగా కృషి చేసిన 17ఏళ్ళు కల బంగ్లాదేశ్ కుర్రాడు సదాత్ రెహ్మాన్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాన్ని సాధించారు. హేగ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో ఈ అవార్డును ను అందుకున్నాడు. ఈ సందర్బంగా రెహ్మాన్ మాట్లాడుతూ సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా పని చేయడం అంటే అది ఒక యుద్ధం లాంటిది .ఇందులో నేనో పోరాటయోడుడిని. ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తే ఈ యుద్ధంలో అందరం గెలుస్తాం. అని చెప్పారు. ఈ సైబర్ వేధింపులను అడ్డుకునే కృషిలో భాగంగా రెహ్మాన్ ఒక మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ ప్రఖ్యాత అంతర్జాతీయ బాలల పురస్కారాన్ని గతంలో పాక్ కు చెందిన మాలాల యూసఫ్ జాయ్,స్వీడన్ పర్యావరణ కార్యకర్త అయిన గ్రేటా థన్ బర్గ్ అందుకున్నారు. మాలాల దాని తరువాత నోబెల్ శాంతి బహుమతి ని కూడా అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బంగ్లాదేశ్ కుర్రాడికి దక్కిన బాలల శాంతి పురస్కారం
ఎవరు: సదాత్ రెహ్మాన్
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎప్పుడు: నవంబర్ 13
ఏడోసారి ఎఫ్1 ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన లూయిస్ హమిల్టన్ :

బ్రిటన్ ఫార్ములావన్ రేసర్ లూయిస్ హమిల్టన్ (మెర్సిడెజ్ ) రికార్డుల వేటలో దూసుకేల్తున్నాడు.ఏడో సారి ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి దిగ్గజ రేసర్ మైకేల్ షూ మాకర్ సరసన నిలిచాడు.నవంబర్ 15 న జరిగిన టర్కిష్ గ్రాండ్ ఫ్రీ రేసులో విజేతగా నిలవడం ద్వారా అతడు 2020 ఎఫ్ 1 ప్రపంచ చంపియన్ షిప్ ను చేజేక్కించుకున్నాడు. గంటా 42 నిమిషాల 19.313 సెకన్ల లో లక్ష్యాన్ని చేరుకున్న అతడు రికార్డు స్థాయిలో 94 గ్రాండ్ ఫ్రీ విజయాన్ని అతని ఖాతాలో వేసుకున్నాడు.అతడు ఇంతక ముందే గ్రాండ్ ఫ్రీ విజయాల్లో శూమాకర్ (91) రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.ఈ రేసులో పెరెజ్ (రేసింగ్ పాయింట్),వెటేల్ (ఫెరారీ) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.ఈ విజయం తో ప్రపంచ చాంపియన్ షిప్ లో పాయింట్లను 307కు పెంచుకున్న హమిల్టన్ మరో సారి టైటిల్ ను దక్కించుకున్నాడు.హమిల్టన్ కు ఇది వరుసగా నాలుగో ప్రపంచ చంపియన్ షిప్ టైటిల్ హమిల్టాన్ 2008,2014,2015 లో తన తొలి మూడు టైటిల్ ను దక్కించుకున్నాడు.మెర్సిడెజ్ తరపున అతనికి ఇది ఆరో టైటిల్ మొదటి సారి టైటిల్ ను మెక్ లారెన్ తరపున సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏడోసారి ఎఫ్1 ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎప్పుడు: నవంబర్ 13
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ కన్నుమూత :

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రి చటర్జీ (85) ఇటీవల కన్నుమూసారు.అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరిన అయన నవంబర్ 13న తుది శ్వాస విడిచారు.అక్టోబర్ 06న చటర్జీ కరోన బారిన పడి కోల్ కతా లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తరువాత ఆయనకు కరోన నెగిటివ్ వచ్చిన తరువాత ఆయనను డిశ్చార్ చేసారు.ఉన్నట్టుండి అకస్మాత్తుగా అయన ఆరోగ్యం క్షీణించడం తో కుటుంబ సబ్యులు వెంటనే ఆస్పత్రి కి తరలించారు.చికిత్స తీసుకుంటూనే అయన నవంబర్ 12న కన్నుమూసారు.అయన తన ఒక థియేటర్ ఆరిస్ట్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి స్వయం కృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు.బెంగాలీ చిత్ర రంగం లో సౌమిత్రి గారు తొలి తరం నటుల్లో ఒకరు గా పేరు. అయన సుప్రసిద్ధ దర్శకుడు అయిన సత్యజిత్ రే అపుర్ సంసార్ తో చిత్ర పరిశ్రమ కు ఎంట్రి ఇచ్చి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈయన సత్య జిత్ రే రూపొందిచిన 14 సినిమాలల్లో అయన నటించడం విశేషం.ఈయన బెంగాలీ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.2012 లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ కన్నుమూత
ఎవరు: సౌమిత్ర చటర్జీ
ఎప్పుడు: నవంబర్ 13
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |