
Daily Current Affairs in Telugu 14& 15-11-2020
ఆర్ సెప్ ఒప్పందం పై సంతకాలు చేసిన 15 దేశాలు:

ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన 15దేశాలు నవంబర్ 15న భారీ స్థాయి వాణిజ్య ఒప్పంద౦ పై సంతకాలు చేసాయి. ప్రపంచం లోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందం గా భావిస్తున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు చర్చలు కొనసాగించిన తర్వాత ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక బాగస్వామ్యం (ఆర్సి.ఈపి -ఆర్సెప్) ఒప్పందం కొలిక్కి వచ్చింది. దీనిపై సంతకం చేయడానికి భారత్ మాత్రం నిరాకరించింది. కోవిద్-19 వల్ల ఒప్పందం దోహదపడుతుందని సబ్య దేశాలు పేర్కొన్నాయి. కరోన నేపద్యంలో ఈ సారి ఆగ్నేయాసియ దేశాల ఇతర ప్రాంతీయ భాగస్వాముల వార్షిక శికరాగ్ర బేటీ ని దృశ్యా మాద్యమ విధానం లో నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక రంగం లో దాదాపు మూడో వంతు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో రుసుములకు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం పై సంతకాలు చేసిన రెండేళ్ళ లో ఆయ దేశాలన్ని దానిని ద్రువికరించాల్సి ఉంది. అపుడు అమల్లోకి వస్తుంది. ఈ ఆర్ సెప్ లో చైనా,జపాన్,దక్షిణ కొరియా,న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,ఇండో నేషియా మలేషియా ,పిలిప్పిన్స్,సింగపూర్ ,థాయ్ లాండ్ ,బ్రూనై,వియత్నాం,లావోస్ ,మయన్మార్,కంబోడియా లు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్ సెప్ ఒప్పందం పై సంతకాలు చేసిన 15 దేశాలు
ఎప్పుడు: నవంబర్ 14
భారత్ లో ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన డబ్ల్యు హెచ్.వో సంస్థ :

భారతీయ సంప్రదాయాలను వైద్య విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లబించింది. భారత్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన (డబ్ల్యు.హెచ్.వో) సంస్థ ప్రకటించింది. నవంబర్ 12 న ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదాన మంత్రి నరేంద్ర మోడి గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఐఎ) లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబించారు.ఈ సందర్బంగా వీడియో సందేశాన్ని పంపిన డబ్ల్యు.హెచ్ .వో డైరెక్టర్ జనరల్ తెడ్రోస్ అథనాం గేబ్రేసియాస్ భారత్ లో సంప్రదాయ వైద్యం కోసం ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గా ప్రకటించారు. దీని ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది.అని ప్రదాని నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన డబ్ల్యు హెచ్.వో సంస్థ
ఎవరు: డబ్ల్యు హెచ్.వో సంస్థ
ఎక్కడ: భారత్ లో
ఎప్పుడు: నవంబర్ 14
ప్రపంచ అత్యుత్తమ శాస్తవేత్తల జాబితాలో స్థానం దక్కి౦చుకున్న కాశ్మీర్ యువ ప్రొఫెసర్ :

జమ్మూ కాశ్మీర్ లోని రాజోరి కి చెందిన ఒక యువ ప్రొఫెసర్ ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించారు. మెందార్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రసాయన శాస్త్ర విభాగంలో సహా ఆచార్యుడిగా పని చేస్తున్న డా.షకీల్ అహ్మద్ (31) కు అమెరికాలో ని స్టాన్ ఫార్డ్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక౦గా రూపొందించిన అత్యుత్తమ శాస్త్రవేత్తల తాజా జాబితాలో స్థానం లబించింది. డా.ఎం.ఎస్ ఖురు ,డా.పర్వేజ్ ఎకౌల్,డా.ఆహాసనుల్లాక్ ఖురేషి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన సుమారు 1.59 లక్షల మంది శాస్త్రవేత్తలలో 2శాతం మందిని మాత్రమే ఈ జాబితాలో ఎంపిక చేశారు. గ్రీన్ నానో మెటిరియల్స్ ,బయోపాలిమర్స్ పై పరిశోదన పత్రాలను ,15 పుస్తకాలను షకీల్ గారు ప్రచురించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ అత్యుత్తమ శాస్తవేత్తల జాబితాలో స్థానం దక్కి౦చుకున్న కాశ్మీర్ యువ ప్రొఫెసర్
ఎవరు: డా.షకీల్ అహ్మద్
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్
ఎప్పుడు: నవంబర్ 15
మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ దక్కిన విజయం :

మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ కి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్.ఎల్.డి.) పార్టీ కి తిరిగి అధికారం లో రావడానికి అవసరమైన ఆధిక్యాన్నిసాదించింది. ఈ మేరకు నవంబర్ 13న ఎన్నికల కమిషన్ అధికారంగా పలితాలను వెల్లడించింది. మయన్మార్ పార్లమెంట్ దిగువ సభ,ఎగువ సభ కమిషన్ అధికారికంగా పలితాలను వెల్లడించింది. మయన్మార్ పార్లమెంట్ దిగువ ,ఎగువ సభలో మెజారిటీ సాధించడానికి అవసరం అయిన సంఖ్యా బలం 322 కాగా ఎన్.ఎల్.డి 346 సీట్లు సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ దక్కిన విజయం
ఎవరు: ఆంగ్ సాన్ సూకీ
ఎక్కడ: మయన్మార్ లో
ఎప్పుడు: నవంబర్ 13
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |