Daily Current Affairs in Telugu 26-10-2020
నేవల్ అకాడమి ప్రిన్సిపల్ గా రియర్ అడ్మిరల్ కే.ఎస్. నూర్ నియామకం :

ఇండియన్ నేవల్ అకాడమి ప్రిన్సిపల్ గా రియల్ అడ్మిరల్ కే.ఎస్ నూర్ గారు నియమితులయ్యారు అని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్సి) వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం ఈఎన్ సి ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వెల్లింగ్ టన్ (తమిళ నాడు) లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజిలో చదివిన అయన యా౦టి సబ్ మెరైన్ వార్ ఫేర్ లాంటి అంశాల్లో ప్రతిభ కనబర్చారని వెల్లడించాయి. గతం లో ఈయన భువనేశ్వర్ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారని నౌకదళ అకాడమి (విద్య) రంగానికి విశేష సేవలు అందించారని వివరించాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: నేవల్ అకాడమి ప్రిన్సిపాల్ గా రియర్ అడ్మిరల్ కే.ఎస్. నూర్ నియామకం
ఎవరు: కే.ఎస్. నూర్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు:అక్టోబర్ 26
ఉపాద్యాయులను విశ్వసించే విషయంలో భారత్ ఆరోస్థానం :

భారత్ లో ఉపాధ్యాయులకు సముచిత గౌరవం లబిస్తుంది. వారంటే ప్రజల్లో నమ్మకం ఉ౦దా లేదా అని. బ్రిటన్ చెందిన కు చెందిన వార్కే ఫౌండేషన్ జరిపిన జరిగిన అద్యయనం లో ఉపాద్యాయులను విశాసించే విషయం లో భారత్ కు ఆరో స్థానం లబించి౦ది. మొదటి స్థానం లో చైనా,తరువాతి స్థానాలలో ఘనా,సింఘపూర ,కెనడా,మలేషియా లు ఉన్నాయి. మొత్తం 35 దేశాలలో సర్వ్ జరిపింది. ఉపాద్యాయులు నమ్మకస్తులా కాదా?, ప్రేరణ కలిగిస్తారా లేదా?, బాద్యత తీసుకుంటారా లేదా ?,మేధావులా కాదా? అంటూ తక్షణ జవాబులు ఇచ్చే ప్రశ్నలను అడిగింది. తద్వారా వారి మనసులోని అబిప్రాయాలు రాబట్టింది. ఘనా దేశంలో మొత్తం ప్రభుత్వ వ్యయం లో 22.1 శాతం నిధులు విద్యపై ఖర్చు చేస్తుండగా ఆ దేశం ప్రస్తుత సర్వే లో రెండో ర్యాంకు పొందింది. భారత్ లో 14 శాతం మేర ప్రభుత్వం నిధులు వ్యయం అవుతున్నాయి. ఇటాలి లో 8.1 శాతం నిధులు ఖర్చు చేస్తుండగా ఆ దేశానికి 24ర్యాంకు వచ్చింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఉపాద్యాయులను విశ్వసించే విషయంలో భారత్ ఆరోస్థానం
ఎవరు: భారత్
ఎప్పుడు:అక్టోబర్ 26
92 టైటిల్ లతో షూమాకర్ రికార్డు ను బద్దలు కొట్టిన హమిల్టన్ :

ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హమిల్టన్ (ఇంగ్లాండ్) చరిత్ర సృష్టించాడు. అత్యధిక టైటిల్ లతో దిగ్గజ రేసర్ అయిన మైకేల్ షూ మాకర్ (జర్మని) యొక్క రికార్డు బద్దలు కొట్టాడు. అక్టోబర్ 25న పోర్చుగీస్ గ్రాండ్ ఫ్రీ లో విజేతగా నిలిచిన 35 ఏళ్ల హమిల్టన్ (మెర్సిడెజ్) ఫార్ములావన్ చరిత్రలో అత్యధికంగా 92 టైటిల్ లతో సాధించిన డ్రైవర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. షూమాకర్ పేరిట ఉన్న 91 టైటిల్ రికార్డును హమిల్టన్ మెర్సిడెజ్ సహచర డ్రైవర్ వాల్తేరి బొటాస్ కంటే 25.6 సెకన్ల ముందు రేసును పూర్తి చేసాడు. రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వేర్గాఫ్గాన్ మూడో స్థానం లో నిలిచాడు. ఈ విజయంతో సీజన్ లో 77పాయింట్లతో చాంపియన్ షిప్ రేసులో హమిల్టన్ స్పష్టమైన ఆధిక్యం లో ఉన్నాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: 92 టైటిల్ లతో షూమాకర్ రికార్డు ను బద్దలు కొట్టిన హమిల్టన్
ఎవరు: హమిల్టన్
ఎప్పుడు:అక్టోబర్ 26
యురోపియన్ యునియన్ మానవ హక్కుల పురస్కార 2020 విజేతగా నిలిచిన స్వెత్లానా తికనోస్కాయ :

బెలారస్ ప్రతిపక్ష ఉద్యమానికి దానికి నాయకత్వం వహిస్తున్న స్వెత్లాన తికనోస్కాయాకి యురోపియన్ యునియన్ (ఈయు) ప్రతిష్టాత్మక మనవ హక్కుల అవార్డు -2020 లబించింది. సుదీర్గ కాలం లో అధికారం లో ఉన్న బెలారస్ అద్యక్షుడిగా ఉన్న లుకాశేంకో కు వ్యతిరేకంగా స్వెత్లాన,ఇతర బెలారస్ ప్రతిపక్ష పార్టీల తరపున కొనసాగిస్తున్న ఈ పోరాటానికి గాను ఈ అవార్డు ను గెలుచుకున్నారు .2020 ఆగస్టు లో జరిగిన అద్యక్ష ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో లుకాశేంకో తిరిగి అధికారం లోకి వచ్చారు. ఎన్నికల్లో అతని ప్రత్యర్థి గా స్వెత్లాన పోటీ చేసారు. రిగ్గింగ్ చేసి లుకశేంకో అధికారం లో వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. యురోపియన్ యునియన్ కూడా ఆ జరిగిన ఎన్నికలు గుర్తించలేదు .
క్విక్ రివ్యు:
ఏమిటి: యురోపియన్ యునియన్ మనవ హక్కుల పురస్కార – 2020 విజేతగా నిలిచిన స్వెత్లానా తికనోస్కాయ
ఎవరు: స్వెత్లానా తికనోస్కాయ
ఎప్పుడు:అక్టోబర్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |