
Daily Current Affairs in Telugu 22-11-2020
అథ్లెటిక్స్ హై పెర్ఫార్మన్స్ డైరెక్టర్ గా ఉన్న హెర్మన్ పదవికి రాజీనామా :

టోక్యో ఒలింపిక్స్ కు ముందు ఇండియన్ అథ్లెటిక్స్ కు ఎదురుదెబ్ .అథ్లెటిక్స్ పెదరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్ మెన్స్ డైరెక్టర్ గా ఉన్న వోల్మార్ హెర్మన్ తన పదవికి రాజీనామా చేసాడు. అయితే తన పదవికి రాజీనామా కు గల కారణాలను ఆయన మాత్రం వెల్లడించలేదు. జర్మని కి చెందిన హెర్మన్ 2019లో హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ గా బాద్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ సెప్టెంబర్ లో అతని కాంట్రాక్ట్ ను 2024 కు పొడగించింది. ఇండియన్అ థ్లెటిక్స్ తో ఏడాదిన్నర కాలం అద్బుతంగా గడించింది. అయితే నాపై పెట్టుకున్న అంచనాలను నేను అందుకోలేక పోయాను నా రోల్ కు న్యాయం చేయలేక పోతున్న అనే భయం తో పదవి కి రాజీనామా చేస్తున్న అని హెర్మన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అథ్లెటిక్స్ హై పెర్ఫార్మన్స్ డైరెక్టర్ గా ఉన్న హెర్మన్ పదవికి రాజీనామా
ఎవరు: హెర్మన్
ఎప్పుడు: నవంబర్ 22
సిఆర్పిఎఫ్ ఐజి గా మహేష్ చంద్ర లడ్డా నియామకం :

ఆంధ్రప్రదేశ్ పోలిస్ పర్సనల్ విభాగం ఐజి గా మహేష్ చంద్ర లడ్డా సిఆర్పిఎఫ్ ఐజి గా నియమితులయ్యారు. ఈ మేరకు అయిదేళ్ళ పాటు ఈ పోస్టు లో ఆయన డిప్యుటేషన్ పై పని చేయనున్నారు. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు వీలుగా పర్సనల్ విభాగం ఐజి పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు ఉత్తర్వులు జారీ చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సిఆర్పిఎఫ్ ఐజి గా మహేష్ చంద్ర లడ్డా నియామకం
ఎవరు: మహేష్ చంద్ర లడ్డా
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 22
ప్రముఖ సాహితి వేత్త దేవి ప్రియ కన్నుమూత :

ప్రముఖ కవి పాత్రికేయుడు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత దేవి ప్రియ (71) కన్ను మూసారు.అనారోగ్యంతో కొంత కాలంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన నవంబర్ 21న కన్ను మూసారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లా తాటి కొండ లో 1949 ఆగస్టు 15 న జన్మించారు. అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్ . దేవిప్రియ అనే కలం పేరుతో అమ్మ చెట్టు,నీటి పుట్ట,చేప చిలుక ,తుఫాన్,తుమ్మెద,గరీలు,గీతాలు సమజానంద స్వామి వంటి రచనలు చేసారు. దాని రంగుల కల తదితర సినిమాలకు పని చేసారు. పాత్రికేయుడిగా ఆయన సేవలు అందించారు. ఆయన గాలి రంగు కవితా సంపుటికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ సాహితి వేత్త దేవి ప్రియ కన్నుమూత
ఎవరు: దేవి ప్రియ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 21
ఇన్ ల్యాండ్ కేటగిరిలో తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కు దక్కిన అవార్డు :

మత్స్య రంగంలో ఉత్తమ పని తీరు కనబరచిన తెలంగాణా రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టిఎస్ఎఫ్సివోఎఫ్) కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లబించింది. నవంబర్ 21న డిల్లి లో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర పశు సంవర్దక ,పాడి పరిశ్రమ మత్స్య శాఖా సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి గారి చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్డక,మత్స్య ,పాడి పరిశ్రమల అబివృద్ది శాఖా కార్యదర్శి మత్స్య శాఖా ఇన్ చార్జి కమిషనర్ అనితా రాజేంద్ర ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు తో పటు రూ.5 లక్షల నగదు బహుమతిని అందించారు. ఇన్ ల్యాండ్ (సముద్రేతర ప్రాంతాల్లో మత్స్య రంగ అబివృద్ది)కేటగిరి కింద రాష్ట్ర మత్స్య శాఖకు ఈ అవార్డు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇన్ ల్యాండ్ కేటగిరిలో తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కు దక్కిన అవార్డు
ఎవరు: తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 22
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |