
Daily Current Affairs in Telugu 06-10-2020
ఎస్బిఐ చైర్మన్ గా దినేష్ కుమార్ ఖరా నియామకం :

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)చైర్మన్ గా దినేష్ కుమార్ ఖరా నియమితులయ్యారు.ప్రస్తుత చైర్మన్ గా ఉన్న రజనీష్ కుమార్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.అక్టోబర్ 7 నుంచి మూడేళ్ళ పాటు దినేష్ కుమార్ చైర్మన్ గా వ్యవహరించానున్నారు అని ఆర్ధిక శాఖా జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రస్తుతం ఎస్బిఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ పేరును ఎస్బిఐ తదుపరి చైర్ పర్సన్ పదవికి బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో గత నెలలో సిపారసు చేసిన విషయం తెల్సిందే.2017 లో సైతం చైర్మన్ గా పదవికి పోటీ పడిన వారిలో దినేష్ కుమార్ ఉన్నారు. దినేష్ కుమార్ 1984 లో ఎస్బిఐ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేరారు.2016 ఆగస్ట్ లో ఎండి గా లో మూడేళ్ళ కాలానికి నియమితులయ్యారు.2017 లో భారతీయ మహిళా బ్యాంక్ లకు అయిదు అనుబంధ బ్యాంకులకు ఎస్బిఐ లో విలీనం చేయడం లో ఆయన కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎస్బిఐ చైర్మన్ గా దినేష్ కుమార్ ఖరా నియామకం
ఎవరు; దినేష్ కుమార్ ఖరా
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 06
వైద్య శాస్త్రంలో హెపటైటిస్ సి వైరస్ సృష్టి కర్తలకు దక్కిన నోబెల్ పురస్కారం :

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధి కి కారణమవుతున్న “హెపటైటిస్ సి” వైరస్ ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించిది.1970 ,1980 నాటి వీరి పరిశోధనల వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ప్రాణాలు నిలిచాయి అని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది.అమెరికాకు చెందిన హర్వి జై ఆల్టర్ చార్లెస్ ఎం రైస్ ,బ్రిటన్ లో జన్మించిన మైకేల్ హౌటన్ కు ఈ ఘనత దక్కింది.ఈ పురస్కార౦ కింద వీరికి 11,18000 డాలర్లు దక్కుతాయి.ఈ మొత్తాన్ని ముగ్గురికి సమానంగా పంచుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైద్య శాస్త్రంలో హెపటైటిస్ సి వైరస్ సృష్టి కర్తలకు దక్కిన నోబెల్ పురస్కారం
ఎవరు; హర్వి జై ఆల్టర్ , చార్లెస్ ఎం రైస్ , మైకేల్ హౌటన్
ఎప్పుడు: అక్టోబర్ 06
మహాత్మా గాంధీ భారత్ సేవా రత్న పురస్కారం దక్కించుకున్న గొల్లనపల్లి ప్రసాద్ :

ప్రముఖ గాంధేయ వాది కింగ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ మహాత్మా గాంధీ వంశీ ఇంటర్నేషనల్ భారత్ సేవా రత్న పురస్కారాన్ని దక్కించుకున్నారు.గాంధీజీ 151 వ జయంతికి పురస్కరించుకుని అంతర్జాతియ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్ దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక సంయుక్తంగా అక్టోబర్ 02 అంతర్జాలం వేదికగా ఈ మేరకు ఓ ప్రత్యెక కార్యక్రమం నిర్వహించారు.మాజీ ఎంపి మురళి మోహన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ,ప్రముఖ సిని నటి మాజీ జమున రమణ రావు ,సినీ నటి ప్రముఖులు, అమెరికా నుంచి మహాత్మా గాంధీ మెమోరరియల్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ అద్యక్షుడు తోట కూర ప్రసాద్ సహా మొత్తం ఏడు దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహాత్మా గాంధీ భారత్ సేవా రత్న పురస్కారం దక్కించుకున్న గొల్లనపల్లి ప్రసాద్
ఎవరు; గొల్లనపల్లి ప్రసాద్
ఎప్పుడు: అక్టోబర్ 06
టోక్యో లో జరగనున్న నాలుగో ఇండో పసిఫిక్ మంత్రుల బేటీ :

నాలుగు ఇండో ఫసిఫిక్ (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రులు అక్టోబర్ 06 న టోక్యో లో సమావేశం కానున్నారు.భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో పాటు అమెరికా ఆస్త్రేలియ జపాన్ ప్రతి నిధులు దీనికి హాజరవుతున్నారు.చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేయడం భావ సారూప్య దేశాలతో కలిసి స్వేచ్చ పారదర్శక ఇండో పసిఫిక్ (ఎఫ్వోఐపి) కార్యక్రమ నిర్వహణ కరోనా వైరస్ ప్రభావం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ వాణిజ్యం సాంకేతిక మానవ హక్కుల ఉల్లంగన వంటి అంశాల్లో అమెరికా చైనా మధ్య విభేదాలు నెలకొన్న క్రమంలో ఈ సమవేశం నిర్వహిస్తుడడం ప్రాదాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో లో జరగనున్న నాలుగో ఇండో పసిఫిక్ మంత్రుల బేటీ
ఎవరు; ఇండో పసిఫిక్ మంత్రుల
ఎక్కడ: టోక్యో లో
ఎప్పుడు: : అక్టోబర్ 06
భారత నావికా దళం స్మార్ట్ అనే వ్యవస్థను విజయవంతగా ప్రయోగించిన భారత్ :

భారత నావికా దళం అమ్ములపొదిలో కి మరో కీలక అస్త్రం చేరనుంది.దేశీయంగా అబివృద్ది చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెద్ రిలీజ్ ఆఫ్ టార్పేద్ (స్మార్ట్) వ్యవస్థను అక్టోబర్ 05 న విజయవంత౦గా పరీక్షించారు.యాంటి సబ్ మెరైన్ యుద్ద తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డిఆర్డివో చైరపర్సన్ డాక్టర్ జిసతీష్ రెడ్డి చెప్పారు.స్మార్ట్ తో భారత నావికాదళం సామర్త్యం మరింత పెరిగిందని రక్షణ శాఖా తెలియజేసింది.అక్టోబర్ 05 ఉదయం 11.45 గంటలకు ఓడిశా తీరం లో ని ఎపిజే అబ్దుల్ కలాం ఐలాండ్ (వీలర్ ఐలాండ్) లో స్మార్ట్ ను పరీక్షించారు. ఎలాంటి పొరపాటు లేకుండా పూర్హ్తి స్థాయిలో విజయవంతమైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత నావికా దళం స్మార్ట్ అనే వ్యవస్థను విజయవంతగా ప్రయోగించిన భారత్
ఎవరు; భారత్
ఎక్కడ: వీలర్ ఐలాండ్
ఎప్పుడు: : అక్టోబర్ 06
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |