
Daily Current Affairs in Telugu 11-10-2020
13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రాఫెల్ నాదల్ :

ప్రతి యేటా ఫ్రెంచ్ ఓపెన్ మే-జూన్ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో నిర్వ హిందాల్సి వచ్చింది. తేదీలు మారినా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం విజేత మారలేదు. ఫైనల్లో తన ఆజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 18వసారి ఫ్రెండ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. అక్టోబర్ 11న ఏక పక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రెండో సీడ్ నాదల్ 2 గంటల 41 నిమిషాల్లో 6-0, 6-2, 7-5 తో జాకోవిచ్ ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులు ఒక్క సెట్ లోకూడా కోల్పోకుండా నాదల్ టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్ కు 18 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జకోవిచ్ 8.50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రెజ్ మనీ లభించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: 13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రాఫెల్ నాదల్
ఎవరు: రాఫెల్ నాదల్
ఎక్కడ:పారిస్
ఎప్పుడు: అక్టోబర్ 11
జర్మని గ్రాండ్ ఫ్రీ గెలుపుతో కెరీర్ లో 91వ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్ :

ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సి డెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వదులుకోలేదు. ఫార్ములా వన్ (ఎఫ్)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గం రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. అక్టోబర్ 11న జరిగిన జర్మనీ ఐఫెల్ గ్రాండ్ ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్ చాంపియన్ గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ గా 2006 నుంచి మైకేల్ షుమా కర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జర్మని గ్రాండ్ ఫ్రీ గెలుపుతో కెరీర్ లో 91వ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎప్పుడు: అక్టోబర్ 11
మానవ రహిత డ్రోన్ యుద్దవిమానం రుస్తుం -2 ప్రయోగం విజయవంతం :

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) వంద శాతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానం రుస్తుం-2 ప్రయోగం విజయవంతమైనట్లు కర్ణాటక లోని చిత్ర దుర్గం జిల్లా డిఆర్డివో కేంద్రం అధికారులు తెలిపారు.దేశంలో ని ఏకైక మానవ రహిత యుద్ద విమానాల పరీక్ష కేంద్రం లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్ ) లో అక్టోబర్ 11 ఉదయం 6.30 గంటలకు టేకాఫ్ తీసుకుంది. నిరంతరాయంగా 8గంటల పాటు ఆకాశంలో 16వేల అడుగుల ఎత్తులో సుమారు 40 వేల కిలో మీటర్ల పరిధిలో వాయు యానం చేసి మద్యాహ్నం 2.30 గంటలకు నిర్ణేత ప్రదేశంలో దిగింది. మరో గంట పాటు వాయుయనానికి సరిపడే ఇంధనం మిగిలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇజ్రాయెల్ హీరాన్ డ్రోన్ లకు రుస్తు౦ ప్రత్యంనయమైన దేశానికి ఎంతోధనం ఆదా అవుతుంది అని అన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మానవ రహిత డ్రోన్ యుద్దవిమానం రుస్తుం -2 ప్రయోగం విజయవంతం
ఎవరు: రుస్తుం -2
ఎక్కడ: కర్ణాటక లోని చిత్ర దుర్గం జిల్లా డిఆర్డివో కేంద్రం
ఎప్పుడు: అక్టోబర్ 11
అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా అక్టోబర్ 11:

బాలికల హక్కులను మరియు ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను గుర్తించడానికి అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 11న ప్రకటించారు. బాలికలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతల గురించి ప్రజలలో అవగాహన పెంచే ఉద్దేశ్యంతో దీనిని గుర్తించారు.సమాజం లో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్ళను మరియు వారి హక్కుల సంరక్షణ కు వారి సాధకరతను ప్రోత్సహించడానికి రోజును అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుకుంటారు. అదే సమయంలో విద్య మరియు శారీరక స్వయంప్రతిపత్తి వంటి వారి ప్రాథమిక మానవ హక్కులను సాధించాలని సూచించింది. ఈ అసమానతలో విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ మరియు వివక్ష నుండి రక్షణ, మహిళలపై హింస మరియు బలవంతపు బాల్య వివాహం వంటి వంటివి ముఖ్యంగా ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా అక్టోబర్ 11:
ఎవరు:ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు:అక్టోబర్ 11
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |