Daily Current Affairs in Telugu 18-10-2020
పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు రిటైర్మెంట్ :

పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్ఆ టకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20కు చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ గుల్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 47 టెస్టుల్లో 10 వికెట్లు పడగొట్టిన ఉమర్ గుల్ 130 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20 ల్లో ఉమర్ గుల్ మరో 85 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టుకు ప్రధాన పేసర్ గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ఉమర్ గుల్ కెరీర్ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనయ్యాడు. అంతర్జాతీయ టి20ల్లో టాప్-10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/8) నమోదు చేసిన బౌలర్ గా అతను గుర్తింపు పొంది ప్రత్యేకత ప్రదర్శించిన ఉమర్ గుల్ 2007 టి20 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు రిటైర్మెంట్
ఎవరు: ఉమర్ గుల్
ఎక్కడ: పాకిస్తాన్ సీ
ఎప్పుడు: అక్టోబర్ 18
బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతగా ప్రయోగించిన భారత్ :

సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ ను అక్టోబర్ 18న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టేల్ డేస్త్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వం తో చెంధించిదని అధికారులు తెలిపారు. సముద్ర జలాలపై లక్ష్యాలను చేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్దనౌక అజేయ శక్తిగా మరింత ఇనుమడింప జేస్తుందని భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాలలో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్ రష్యా ఉమ్మడి భాగంస్వామ్యం తో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములను,యుద్ద నౌకలు విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: అక్టోబర్ 18
న్యూజిలాండ్ నూతన ప్రదనిగా జెస్సి అర్నేర్డ్ ఎన్నిక :

న్యూజిలాండ్ నూతన ప్రధాన మంత్రిగా జెస్సి అర్నేర్డ్ ఎన్నికయ్యారు. ఈమె రెండవ సారి ప్రధాన మంత్రిగా ఎన్నిక అయ్యారు. ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి ని తరిమికోట్టడమే తమ ముందు ఉన్న లక్ష్యం అని అన్నారు. తాజా గా ఎన్నికల్లో అర్నేర్డ్ కు చెందిన లిబరల్ లేబర్ పార్టీ కి 49శాతం ఓట్లతో ఘన విజయం సాధించిది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ నేషనల్ పార్టీకి కేవలం 27శాతం ఓట్లు దక్కాయి.న్యూజిలాండ్ లో 24ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక పార్టీ పార్లమెంట్ లో స్పష్టమైన మెజారిటీ సాధించడ౦ ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు:
ఏమిటి: న్యూజిలాండ్ నూతన ప్రదనిగా జెస్సి అర్నేర్డ్ ఎన్నిక
ఎవరు: జెస్సి అర్నేర్డ్
ఎక్కడ: న్యూజిలాండ్
ఎప్పుడు: : అక్టోబర్ 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |