
Daily Current Affairs in Telugu 01-11-2020
తెలంగాణా రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కేంద్ర హోమ్ శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఎన్నిక :

తెలంగాణా రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కేంద్ర హోమ్ శాఖా సహాయ నటుడు మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్నిక అయ్యాడు. అక్టోబర్ 31సికింద్రబాద్ లోని ముదిరాజ్ భవన్ లో కబడ్డీ సంఘం వార్షిక సభ్య సమావేశంలో పాటు ఎన్నికలు నిర్వహించారు. సంఘం అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్,కార్యదర్శిగా జగదీశ్వర్ గారు ఎన్నికయ్యారు. వీరు నాలుగేళ్ళ పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 33జిల్లాలకు చెందిన సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు
క్విక్ రివ్యు:
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్ గా కేంద్ర హోమ శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఎన్నిక
ఎవరు: కేంద్ర హోమ శాఖా మంత్రి కిషన్ రెడ్డి
ఎక్కడ: తెలంగాణా రాష్ట్ర కబడ్డీ సంఘం
ఎప్పుడు: నవంబర్ 01
జాతీయ హ్యాండ్ బాల్ అద్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నిక :

జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య (హెచ్ ఎఫ్ఐ )అద్యక్షుడిగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన అరిషేనపల్లి జగన్ మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అద్యక్ష పదవి కి ఆయన ఒక్కడే. నామినేషన్ వేయడం తో ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. నవంబర్ 01న లఖ్ నౌవూలోని ప్రధాన కార్యవర్గం లో నూతన కార్యవర్గం తో పారు ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. ఇది వరకు ఆయన హెచ్ ఎఫ్ఐ ఉపాద్యక్షిడిగా ఆయన బాద్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: జాతీయ హ్యాండ్ బాల అద్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నిక
ఎవరు: జగన్ మోహన్ రావు
ఎప్పుడు: నవంబర్ 01
అత్యధిక వన్డేలకు ఫీల్డ్ లో అంపైర్ బాద్యతలు చేసిన రికార్డు సృష్టించిన అలీం దార్ :

అత్యధిక వన్డేలకు ఫీల్డ్ లో బాద్యతలు నిర్వర్తించిన అంపైర్ గా పాకిస్తాన్ కు చెందిన అలీం దార్ రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 01 పాకిస్తాన్ జింబాబ్వే కి రెండో వన్డే అతని ఘనత సాధించారు. అతడికి 210వ వన్డే మ్యాచ్ .అలీం రూడి కోయిర్ జెన్ (దక్షిణాఫ్రికా ,209వన్డేలు) రికార్డును బద్దలు కొట్టాడు. 2000లో పాకిస్తాన్ మరియు శ్రీలంక ల మద్య జరిగిన గుజ్రాన్ వాలాలో జరిగిన వన్డేలో దార్ అలీం అంపైర్ గా అరంగ్రేటం చేసారు. అత్యధిక టెస్టులకు అంపైర్ గా పని చేసిన రికార్డు కూడా అతని పేరు మీదనే ఉంది. గత ఏడాది పెర్త్ లో జరిగిన ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన మ్యాచ్ లో కెరీర్ లో132వ టెస్టు లకు బాద్యతలు చేపట్టి అలీం రికార్డు నెలకొల్పారు. అతను స్టీవ్ బక్నర్ (13 మ్యాచ్) ను అదిగమించారు. మొత్తం మీద ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్ లకు (387 మ్యాచ్ లకు అంపైర్ గా విధులు నిర్వర్తించిన ఘనత కూడా అతనిదే .
క్విక్ రివ్యు:
ఏమిటి: అత్యధిక వన్డేలకు ఫీల్డ్ లో అంపైర్ బాద్యతలు చేసిన రికార్డు సృష్టించిన అలీం దార్
ఎవరు: అలీం దార్
ఎక్కడ: పాకిస్తాన్
ఎప్పుడు: నవంబర్ 01
భారతీయ శాస్త్రవేత్త అయిన ప్రీతీ జగదేవ్ దక్కిన అంతర్జాతీయ గుర్తింపు :

గోవాలో ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) లో పరిశోదక విద్యార్థి గా ఉన్న ప్రీతీ జగదేవ్ అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. 2021 సంవత్సరానికి గాను ఆప్టిక్స్ రంగం లో పరిశోదనలు చేస్తున్న అత్యుత్తమ 25మంది మహిళా శాస్త్రవేత్తలలో ఒకరుగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్ నేషనల్ సొసైటీ ఫర్ ఆప్టిక్స్ అండ్ పోటోనిక్స్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ వ్యక్తిగా ప్రీతీ ఘనత సాధించారు.. ప్రీతీకి కేంద్ర విద్యామంత్రి రమేష్ గారు అబినంధించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారతీయ శాస్త్రవేత్త అయిన ప్రీతీ జగదేవ్ దక్కిన అంతర్జాతీయ గుర్తింపు
ఎవరు: ప్రీతీ జగదేవ్
ఎప్పుడు: నవంబర్ 01
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి కి దక్కిన రెండు స్కోచ్ జాతీయ అవార్డులు :

ఆంధ్రప్రదేశ్ లో నేర పరిశోదన విభాగం లో (సిఐడి) కి రెండు స్కోచ్ జాతీయ అవార్డులు వచ్చినట్లు అడిషనల్ డిజి ఏపి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ గారు,ఏపి సిఐడి అద్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిద్ -19,ఈ నిర్దేశ కార్యక్రమాలకు రజత పథకం వచ్చినట్లు నవంబర్ 01న తెలిపారు. జాతీయ స్థాయిలో శాంతి బద్రత పరిరక్షణ లో సాంకేతిక వినియోగం,అత్యుత్తమ నూతన ఆవిష్కరణ లకు ఏటా స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను అందజేస్తుంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా టెక్నాలజీ విభాగం లో నూతన ఆవిష్కరణ లాక్ 84అవార్డులు అందజేయగా అందులో 48అవార్డులు ఏపి పోలిస్ శాఖకు దక్కడం విశేషం .
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి కి దక్కిన రెండు స్కోచ్ జాతీయ అవార్డులు
ఎవరు: డిజి ఏపి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |