Daily Current Affairs in Telugu 07-10-2020
రసాయన శాస్త్రంలో తొలిసారి ఇద్దరికీ మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం :

ప్రానంతక క్యాన్సర్ల నుంచి మానవాళికి రక్షణ కల్పించే దిశగా ఆశలు రేకెత్తిస్తున్న అధ్బుత జన్యు సాధనాన్ని ఆవిష్కరించిన ఇద్దరు మహిళామణులకు నోబెల్ సలాం చేసింది. ఫ్రాన్స్ కు చెందిన ఏమ్మాన్యుయేలై చార్పెంటియేల్ ,అమెరికా శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌద్నా లకు రసాయన శాస్తంలో ఈ పురస్కారం వరించింది. జంతువులు ,మొక్కలు సూక్ష్మ జీవులు డిఎన్ఎలో అవసరమైన మార్పులకు (జీన్ ఎడిటింగ్) అత్యంత కచ్చితత్వంతో చేయగల “క్రిస్పర్ కాస్9” సాంకేతిక తను వీరు సంయుక్తంగా అబివృద్ది చేసారు. అణు కత్తెర వంటి ఈ సాంకేతికత మానవులలో జన్యు లోపాల కారణంగా వచ్చే వ్యాధులు మహమ్మారి క్యాన్సర్ల ను నయంచేసేందుకు భవిష్యత్ లో దోహదపడే అవకాశం ఉంది .రసాయన శాస్తం లో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: రసాయన శాస్త్రంలో తొలిసారి ఇద్దరికీ మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
ఎవరు: ఏమ్మాన్యుయేలై చార్పెంటియేల్ , జెన్నిఫర్ ఏ డౌద్నా
ఎప్పుడు: అక్టోబర్ 07న
టోక్యో లో విదేషాంగ మంత్రుల సమావేశంలో జపాన్ భారత్ మద్య ఒప్పందం:

చైనా తో సరిహద్దు ఘర్షణల నేపద్యంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.అక్టోబర్ 07న జరిగిన జపాన్ తో కీలక సైబర్ భద్రత ఒప్పందానికి తుది రూపం ఇచ్చింది.5జి,కృత్రిమ మేధా ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ను కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా అమెరికా జపాన్ భారత్ కలిసి ఏర్పాటు చేసిన వ్యూహాత్మక కూటమే క్వాడ్ కూటమి.ఈ సమావేశానికి టోక్యో వెళ్ళిన భారత్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 07న జపాన్ విదేశాంగ శాఖా మంత్రి తోషి మిత్స మొతెగిని కలిశారు.ఈ సందర్బంగా సైబర్ బద్రత పై ఒప్పందం పై ఇరు దేశాలపై ఒక అవగాహనకు వచ్చారు.5జి విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో లో విదేషాంగ మంత్రుల సమావేశంలో జపాన్ భారత్ మద్య ఒప్పందం
ఎవరు: జపాన్ భారత్
ఎక్కడ: టోక్యో లో
ఎప్పుడు: అక్టోబర్ 07న
బీసీఏఎస్ డీజీని నియమితులయిన ఐపీఎస్ అధికారి ఎం.ఏ గణపతి :

సీనియర్ ఐపిఎస్ అధికారి, ఎం ఎ గణపతిని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అతను ఉత్తరాఖండ్ కేడర్ యొక్క 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి.ఈయన ఆగస్టులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ అస్తానాను నియమించిన తరువాత బీసీఏఎస్ చీఫ్ పదవి ఖాళీగా ఉంది.ఆ స్థాన౦లో ఈయనను నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీసీఏఎస్ డీజీని నియమితులయిన ఐపీఎస్ అధికారి ఎం.ఏ గణపతి
ఎవరు: ఐపీఎస్ అధికారి ఎం.ఏ గణపతి
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 07న
సాచేట్స్ మార్గదర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూత :

దేశంలో సాచేట్స్ (చిన్న ప్యాకేట్స్) భావనకు మార్గదర్శకుడిగా పేరు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన సికె రాజ్ కుమార్ (68) చెన్నై లో అపోలో ఆస్పత్రిలోఅక్టోబర్ 07న కన్నుమూసారు.వృత్తి రిత్యా వైద్యుడైన అయన తన తండ్రి మరణం తరువాత కుటుంబ వ్యాపార పగ్గాలు చేపట్టారు.దేశంలో సాచేట్స్ రూపం లో మార్కెట్ లోకి వచ్చిన మొదటి శాంపు వెల్వెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనదే.తరువాత సుజాత బయోటెక్ ద్వారా ఆరోగ్య సంరక్షణ ఆహారోత్పత్తి రంగాల్లో అయన ప్రవేశించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సాచేట్స్ మార్గదర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూత
ఎవరు: రాజ్ కుమార్
ఎప్పుడు: అక్టోబర్ 07న
ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ నజీబ్ తారకాయ్ మృతి :

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ లో విషాద ఘటన చోటు చేసుకునేంది.జాతీయ జట్టు సబ్యుడు అయిన 29ఏళ్ల నజీబ్ తరకాయ్ రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూసారు.నాలుగు రోజుల క్రితం ప్రమదం జరగ్గా తీవ్రగాయాల పాలైన ఆటను చికిత్స తీసుకుంటూ కోలుకోలేకపోయారు.ఆఫ్గాన్ క్రికెటర్ బోర్డు ఈ విషయన్ని ప్రకటించిది.అంతర్జాతీయ క్రికెట్ లో నజీబ్ ఆఫ్గాన్ జట్టుకు 12టి20 లో ఓక్ వన్డే మ్యాచ్ లో ప్రాతినిత్యం వహించాడు.గత ఏడాది సెప్టెంబర్ లో దకాలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి సారిగా దేశం తరపున ఆడిన అతను గత నెలలోనే మిస్ ఐనక్ జట్టు తరపున ఆఫ్గాన్ దేశవాళి టి20 పోటీలలో పాల్గొన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ నజీబ్ తారకాయ్ మృతి
ఎవరు: నజీబ్ తారకాయ్
ఎప్పుడు: అక్టోబర్ 07న
ప్రపంచ పత్తి దినోత్సవం గా అక్టోబర్ 07:

ప్రపంచ వాణిజ్య సంస్థ అయిన డబ్ల్యుటివో సంస్థ అక్టోబర్ 07 ప్రపంచ పత్తి దినోత్సవం గా జరుపుకోవాలని నిర్ణయించింది.దీని ద్వారా అంతర్జాతీయ పత్తి పరిశ్రమ మరియు సమాజాలకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కి దాని ఉత్పత్తి సహకారం అందిచాలనే ఉద్దేశం తో దీని ని 2019 నుండి అక్టోబర్ 07న జరుపుకుంటున్నారు.ఈ రోజును అక్టోబర్ 07,2019 న జెనివా లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటివో ) ప్రారంబించింది. ప్రపంచ సరుకుగా పత్తి యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా దానిని గుర్తించాలనే ఉద్దేశం తో గ్రూప్ ఆఫ్ కాటన్ గా ఉన్న నాలుగు దేశాలు అయిన బెనిన్,బుర్కినా ఫాసో. చాడ్ మరియు మాలి దేశాల్లో ప్రారంబించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పత్తి దినోత్సవం గా అక్టోబర్ 07
ఎవరు: డబ్ల్యుటివో
ఎప్పుడు: అక్టోబర్ 07న
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |