Daily Current Affairs in Telugu 17-10-2020
మహిళల హాఫ్ మారథాన్ లో కొత్త రికార్డు సృష్టించిన కెన్యా రన్నర్ :

మహిళల హాఫ్ మారథాన్ లో కెన్యా రన్నర్ పేరెన్ జేప్ చిర్చిర్ తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డు ను తిరగరాసింది. అక్టోబర్ 17న ప్రపంచ అథ్లెటిక్స్ లో హాఫ్ మారథాన్ చాంపియన్ షిప్ ను గంటా 05 నిమిషాల 16సెకన్ల లో ముగించి పసిడి పథకం నెగ్గిన ఆమె ఈ ఏడాది సెప్టెంబర్ లో నమోదు చేసిన రికార్డు గంటా 05 నిమిషాల 34సెకన్ల ను మెరుగుపరచింది. ఇసాక్ (1.05.18సెకన్ల లో జర్మని) యలేంజ ర్స్ (1.05.19సే ఇథియోపియా) వరుసగా రజత కాంస్యాలు గెలిచారు. ఈ రేసును 66 నిమిషాలలో లోపే ఆరుగురు పూర్తి చేయడం విశేషం.
క్విక్ రివ్యు:
ఏమిటి: మహిళల హాఫ్ మారథాన్ లో కొత్త రికార్డు సృష్టించిన కెన్యా రన్నర్
ఎవరు: కెన్యా రన్నర్ పేరెన్ జేప్ చిర్చిర్
ఎప్పుడు: అక్టోబర్ 17
ప్రపంచ లోనే ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తలలో చోటు దక్కించుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ:

బందర్ కు చెందిన ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ కు అరుదైన గుర్తింపు లబించింది. పదార్థ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రపంచంలోనే మేటి వంద మంది శాస్తవేత్తలలో ఒకరిగా అయన నిలిచారు. అమెరికాలో ని ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ విశ్వ విద్యాలయం తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో చల్లపల్లి సూర్యనారాయణ కు 55వ స్థానం దక్కింది. గత 22ఏళ్లుగా స్టాన్ ఫార్ద్ యునివర్సిటీ కి ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్ వైద్య విజ్ఞాన తదితర రంగాలలో సమర్పించిన పరిశోదన పత్రాలను ప్రాదిపదికగా తీసుకుని లక్షమంది ప్రతిభవంతులైన శాస్త్రవేత్తలను ఎంపిక చేసారు. వారిలో ఒకరిగా పదార్థ శాస్త్రవేత్తల్లో ఒకరిగాఉన్న ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ చోటు దక్కించుకున్నారు. ఆయన 1988 తర్వాత నుంచి అమెరికాలో ని వివిధ యునివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా లో విధులు నిర్వర్తిస్తున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రంగం లో చేసిన సేవలకుగాను విదేశాల నుంచి అనేక పురస్కారాలను అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ లోనే ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తలలో చోటు దక్కించుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ
ఎవరు: ప్రొఫెసర్ సూర్యనారాయణ
ఎప్పుడు: అక్టోబర్ 17
ప్రపంచ ఆకలి సూచిలో 94వ స్థానం లో నిలిచిన భారత్ :

భారత్ లో ఆకలి కేకలు తీవ్రతరమయ్యాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచిలో 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానం లో నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్ తో పాటుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్,మయన్మార్,పాకిస్తాన్ లు ఉన్నాయి. చైనా ,బెనారస్,ఉక్రెయిన్,టర్కీ.క్యూబా,కువైట్,వంటి 17దేశాలు అయిదులోపు ర్యాంకులను పంచుకుని టాప్ ర్యాంకింగ్స్ సాధించాయి.గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్ఐ)ఈ ఏడాది నివేదిక ను తన వెబ్ సైట్ లో ఉంచింది. పౌష్టికాహార లోపం పిల్లలో ఎదుగుదల అయిదేళ్ళ లోపు పిల్లలో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సూచీని రూపొందిస్తారు. భారత్ 94 వ ర్యాంకు ,బంగ్లాదేశ్ 75 వ ర్యాంకు, మయన్మార్ 78,పాకిస్తాన్ 88 స్థానాలలో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది. నేపాల్ 73,శ్రీలంక 64 ర్యాంకుల్లో నిలిచాయి. ఆకలి సమస్యలో మద్యస్త౦గా ఉన్న దేశాలు జాబితాలో చేరాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ ఆకలి సూచిలో 94వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: అక్టోబర్ 17
డిడిసిఏ అద్యక్షుడిగా ఎన్నికయిన రోహన్ జైట్లీ :

కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్టిక్ క్రికెట్ సంఘం (జీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు వివాదంతో ముగియగా ఆధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో మోహన్,వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1989 నుంచి 2014 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన మోహన్ తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని ఆలంకరించడంతో పలువురు క్రికెటర్లు,రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: డిడిసిఏ అద్యక్షుడిగా ఎన్నికయిన రోహన్ జైట్లీ
ఎవరు: రోహన్ జైట్లీ
ఎప్పుడు: అక్టోబర్ 17
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |