
Daily Current Affairs in Telugu 04-10-2020
సింగరేణి సంస్థ అధికారికి దక్కిన గ్రమోదయ పురస్కారం :

సింగరేణి సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఐఆర్ఎస్ అధికారి ఎన్ .బలరాం గారు చేపట్టిన పర్యావరణ హిత చర్యలకు గుర్తింపు లబించింది. అక్టోబర్ 04 న సింగరేణి భవన్ లో జరిగిన కార్యక్రమంలో గ్రమోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జికాట్) స్వచ్చంద సంస్థ ఆయనకు గ్రామోదయ బంధుమిత్ర అవార్డులని ఇచ్చిసత్కరించింది. బలరాం గారుగత ఏడాది కొత్త గూడెం లో 108 మొక్కలు నాటడం ద్వారా హరిత కార్యక్రమం ప్రారంబించి ఇప్పటి వరకు స్వయంగా 8వేల మొక్కలు నాటారు.త్వరలో 10వేల మొక్కలు మైలు రాయిని చేరబోతుందని తెలిపారు.
క్విక్ రివ్యు:
ఎక్కడ: సింగరేణి సంస్థ అధికారికి దక్కిన గ్రమోదయ పురస్కారం
ఎవరు: ఐఆర్ఎస్ అధికారి ఎన్ .బలరాం
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు: అక్టోబర్ 04
ఐఏసిసి ఎపి ,తెలంగాణా రాష్ట్రాలకు చైర్మన్ గా ఎన్నికయిన విజయసాయి మేకా :

ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసిసి)ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ గా ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎండి విజయ సాయి మేకా గారు ఎన్నికయ్యారు.ఇప్పటి వరకు ఈ స్థానం లో ఉన్న ఫీనిక్స్ గ్రూప్ కంపెని డైరెక్టర్ శ్రీకాంత్ బడిగ ఐఏసిసి దక్షిణ భారత ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఐఏసిసి ఏపి ,తెలంగాణా సీనియర్ వైస్ చైర్మన్ పిఅండ్ పి నెక్స్ జెన్ టెక్ ఎండి రాం కుమార్ రుద్రబట్ల వైస్ చైర్మన్గా దివ్య శ్రీ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సిఎఫ్వో సి.నారయణ రావు గారు బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు:
ఎక్కడ: ఐఏసిసి ఎపి ,తెలంగాణా రాష్ట్రాలకు చైర్మన్ గా ఎన్నికయిన విజయసాయి మేకా
ఎవరు: విజయసాయి మేకా
ఎప్పుడు: అక్టోబర్ 04
పథాశ్రీ అభిజాన్” అనే పథకాన్ని ప్రారంభించింన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం :

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం “పఠాశ్రీ అభిజన్” ఈ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది.ఇది రహదారి మరమ్మతు కొరకు చేయబడిన పథకం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్టోబర్ 02న పఠాశ్రీ అభిజన్ అనే రహదారి మరమ్మతుల పథకాన్ని ప్రారంభించారు, ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా 12,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7,000 కి పైగా రహదారులు మరమ్మతులు చేయబడతాయి. ప్రభుత్వ౦కు ‘దీదీ కే బోలో’ అనే చొరవ ద్వారా రాష్ట్ర ప్రజలు ప్రతిపాదన ముఖ్యమంత్రికి చేరుకోవడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త పథకం కింద మరమ్మతులు చేయబోయే రహదారుల జాబితాను రూపొందించింది దీని గురించి తెలియజేస్తూ, ఈ పథకం కింద రహదారులను మిషన్ మోడ్లో, సమయానుసారంగా మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు
క్విక్ రివ్యు:
ఎక్కడ: పథాశ్రీ అభిజాన్” అనే పథకాన్ని ప్రారంభించింన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎవరు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమ బెంగాల్
ఎప్పుడు: అక్టోబర్ 04
లండన్ మారథాన్ విజేతగా నిలిచిన ఇదియోఫియా అథ్లెట్ షూరా కిటాటా:

గత నాలుగేళ్ళుగా లండన్ మారథాన్ చాంపియన్ గా నిలిచిన కెన్యా దిగ్గజ అత్లెట్ ఎలుడ్ కిప్సోగి కి ఈసారి నిరాశ ఎదురయ్యింది. ఇతియోఫియా అథ్లెట్ షూరా కిటాట లండన్ మారథాన్ విజేతగా అవతరించాడు.అక్టోబర్ 04న జరిగిన ఈ రేసులో పురుషుల విభాగంలో షూరా కిటాటా రెండు గంటల ఐదు నిమిషాల 41సెకన్లు లో గమ్యానికి చేరి స్వర్ణ పథకం ను సాధించాడు. వర్షం లో సాగిన ఈ రేసులో కిప్సోగి పూర్తిగా వెనుక బడి పోయాడు. ఎనిమిదో స్థానం తో ముగించాడు.కిప్పుమ్బా (కెన్యా ,సి సే లేమా (ఇతియోఫియా) వరుసగా రెండు మూడు స్థానాలలో నిలిచారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కెన్యా రన్నర్ బ్రిగేడ్ కోస్గి రెండు గంటల 18 నిమిషాల 58 సెకన్ల లో ముగించి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు:
ఎక్కడ: లండన్ మారథాన్ విజేతగా నిలిచిన ఇదియోఫియా అథ్లెట్ షూరా కిమోటా
ఎవరు: షూరా కిమోటా
ఎక్కడ:లండన్
ఎప్పుడు: అక్టోబర్ 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |