Daily Current Affairs in Telugu 04-01-2021
ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి గా జస్టిస్ జాయ్ మాల్య ప్రమాణ స్వీకారం :
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జాయ్ మాల్య బ్యాగ్సి ప్రమాణం చేసారు.హైకోర్టు లోని మొదటి కోర్టు హాలులో జనవరి 03ణ ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధానన్యాయ మూర్తి (సిజె) జస్టిస్ జి.కే మహేశ్వరి జస్టిస్ జాయ్ మాల్య బ్యాగ్సి ప్రమాణం చేయించారు.కార్యక్రమం లో హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్ జాయ్ మాల్య బ్యాగ్సి 1966 అక్టోబర్ 03ణ జన్మించారు.కోల్ కతా విద్యాలయం నుంచి 1991 లో ఎల్ ఎల్ బి పట్టా అందుకున్నారు.1991 లో కోల్ కతా హైకోర్ట్ లో న్యాయవాదిగా ప్రాక్టిస్ మొదలు పెట్టారు.పలు వాదనలు వినిపించారు.మనవ హక్కుల కోసం పోరాడే న్యాయ మూర్తి గుర్తింపు పొందారు.కలకత్తా హైకోర్ట్ న్యాయ మూర్తిగా 2011 జూన్ 27 ణ నియమితులయ్యారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి గా జస్టిస్ జాయ్ మాల్య ప్రమాణ స్వీకారం
ఎవరు: జాయ్ మాల్య బ్యాగ్సి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జనవరి 04
అమెరికా స్పీకర్ గా మళ్లి నియమితులయిన నాన్సీ పెలోసీ :
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా నాన్సీ ఫెలోసి (80) మరోసారి ఎన్నికయ్యారు.అయితె స్వల్ప ఆధిక్యం లో గట్టెక్కడం గమనార్హం .వరుసగా నాలుగోసారి ఆమె ఈ పదవిని చేపట్టనున్నారు.జనవరి 03 న జరిగిన ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీ కి చెందిన నాన్సీ కి 216 ఓట్లు రాగా ప్రత్యర్థి రిపబ్లికన్ కు చెందిన కెవిన్ మెక్ కార్తి కి 209ఓట్లు వచ్చాయి.డెమోక్రటిక్ పార్టీ కి 222సీట్లు ఉన్నప్పటికీ ఆరుగురు సభ్యలు ఆమెకు ఓటు వేయలేదు.అమెకాలో చదువు కున్న పాకిస్తాన్ మహిళలకు ప్రతిభ ,అవసరాలు ఆదారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని శాసన వ్యవస్థ అయిన కాంగ్రెస్ నిర్ణయించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి : అమెరికా స్పీకర్ గా మళ్లి నియమితులయిన నాన్సీ పెలోసీ
ఎవరు: నాన్సీ పెలోసీ
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు: జనవరి 04
చెస్ సమాఖ్య అద్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నిక :
అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసి) అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నిక అయ్యాడు.భగత్ సింగ్ తన కార్యదర్శి పదవిని నిలబెట్టుకున్నాడు.అంతర్జాల వేదికగా జనవరి 04 న సమాఖ్య కు ఎన్నికలు నిర్వహించారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘం నుంచి పోటీ చేసిన సంజయ్ రెండు ఓట్ల తేడాతో వెంకట్రామ రాజా పై నెగ్గారు.సంజయ్ కు 33 ఓట్లు రాగా రాజాపై కు 31ఓట్లు వచ్చాయి.మరోవైపు భరత్ 35-29తేడాతోరవీంద్ర పై గెలిచారు.2005 నుంచి ఏ ఐసి ఎఫ్ కు ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి.గత అద్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవంగా సాగింది.
క్విక్ రివ్యు:
ఏమిటి : చెస్ సమాఖ్య అద్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నిక
ఎవరు: సంజయ్ కపూర్
ఎప్పుడు: జనవరి 04
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2021 లో 12 వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ :
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భారతలోనే అతి ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2021లో (20 జనవరి 2021 నాటికి) 12 వ స్థానానికి పడిపోయింది. అంబానీ యొక్క నికర విలువ 90 బిలియన్ డాలర్లు (సుమారు రూ .6.62 లక్షల కోట్లు)కాగ (2020 ప్రారంభంలో) 76.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.5.6 లక్షల కోట్లు) కు పడిపోయింది. ముఖేష్ అంబానీ నికర విలువ తగ్గడానికి కారణం 2020 డిసెంబర్ 30న ఆర్ఐఎల్ షేర్లలో దిద్దుబాటు రూ .1995.50 కు పడిపోయింది, ఇది ఆల్ టైమ్ హై 2369.35 రూపాయల నుండి 16%. “లోన్ వోల్ఫ్” గా పిలువబడే హాంగ్ షాన్షాన్, అంబానీ స్థానంలో ఆసియా లోనే యొక్క అత్యంత ధనవంతుడిగా నియమించబడ్డాడు, అతను ఈ ఘనత సాధించిన చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తి.లియోన్ మెన్డోంకా భారతదేశ 67 వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు
క్విక్ రివ్యు:
ఏమిటి : బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2021 లో 12 వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ
ఎవరు: ముఖేష్ అంబానీ
ఎప్పుడు: జనవరి 04
ప్రపంచ బ్రెయిలీ డే: జనవరి 4
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం 2019 నుండి జనవరి 4 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంధ మరియు పాక్షిక దృష్టిగల వ్యక్తుల కోసం మానవ హక్కులను పూర్తిగా గ్రహించడంలో కమ్యూనికేషన్ సాధనంగా బ్రెయిలీ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. దృశ్య వైకల్యం ఉన్నవారికి, బ్రెయిలీ లిపి యొక్క ఆవిష్కర్త లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని గుర్తుచేసుకుంటూ ఈ రోజును బ్రెయిలీ డే గా జరుపుకుంటారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4 న ఉత్తర ఫ్రాన్స్‌లోని కూప్వ్రే పట్టణంలో జన్మించాడు
క్విక్ రివ్యు:
ఏమిటి : ప్రపంచ బ్రెయిలీ డే: జనవరి 4
ఎవరు: లూయిస్ బ్రెయిలీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎప్పుడు: జనవరి 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |