
Daily Current Affairs in Telugu 22 -04-2021
రసాయన ఆయుద నిషేద సంస్థ (OPCW) ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా జి.సి ముర్ము ఎంపిక :

రసాయన ఆయుధాల నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ OPCW కు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) జిసి ముర్మును బాహ్య ఆడిటర్‌గా ఎంపిక చేసింది. రసాయన ఆయుధాల నిషేధ సంస్థ అయిన (OPCW) సంస్థ యొక్క 2021 నుండి మూడేళ్ల కాలానికి తన బాహ్య ఆడిటర్‌గా భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము గారిని ఎంపిక చేసింది. ఏప్రిల్ 22న జరిగిన ఒపిసిడబ్ల్యు సమావేశంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ఈ నియామకం జరిగింది. ఇక్కడ భారతదేశం ఇతరులకన్నా అధిక మద్దతును పొందింది. కాగా ఇది 9 ఏప్రిల్ 1997 న అమల్లోకి వచ్చిన రసాయన ఆయుధాల సదస్సు కోసం ఏర్పాటు చేయబడిన ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ మరియు అమలు చేసే సంస్థ.
క్విక్ రివ్యు :
ఏమిటి: రసాయన ఆయుద నిషేద సంస్థ (OPCW) ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా జి.సి ముర్ము ఎంపిక
ఎవరు: జి.సి ముర్ము
ఎప్పుడు: ఏప్రిల్ 22
ఎనర్జీ ట్రాన్సి క్షన్ ఇండెక్స్ లో 87 వ స్థానం లో నిలిచిన భారత్ :

ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ తో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ఇంధన సూచీ(ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్-ఈటీఐ) ఏప్రిల్ 21న విడుదలైంది. 11 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్ 87వ ర్యాంకు దక్కించుకుంది. ఈ సూచీలో పశ్చిమ, ఉత్తరాది యూరప్ దేశాలు టాప్ 10లో నిలిచాయి. కాగా స్వీడన్ అగ్రస్థానంలో ఉండగా, నార్వే (2), డెన్మార్క్ (3) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మూడో వంతు భారత్, చైనాదే , అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్‌లో మూడో వంతు చైనా (68వ స్థానం)ఉండగా 115 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్ 87వ ర్యాంకు దక్కించుకుంది.. స్వీడన్ అగ్రస్థానంలో ఉండగా, నార్వే (2), డెన్మార్క్ (3) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికీ బొగ్గు వినియోగం కాస్త ఎక్కువే ఉంటున్నప్పటికీ పర్యావరణహిత ఇంధనాల విషయంలో గడిచిన దశాబ్ద కాలంగా రెండు దేశాలు గణనీయమైన పురోగతి . సాధించాయని వివరించింది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ హితం, ఇంధన భద్రత కోణాల్లో వివిధ దేశాల ఇంధన వ్యవస్థల ప్రస్తుత పనితీరును. మెరుగైన విధానాల వైపు మళ్లేందుకు సంసిద్ధతను ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎనర్జీ ట్రాన్సి క్షన్ ఇండెక్స్ లో 87 వ స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఏప్రిల్ 22
అమెరికా న్యాయ విభాగం లో ఉత్తమ పదవి అసోసియేట్ అటార్నీ జన రల్ వనితా గుప్తా ఎంపిక :

అమెరికా న్యాయ విభాగంలో మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జన రల్ గా ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది వనితా గుప్తా (46) నియామకం ఖరారైంది. పదవిని ఆ అందుకున్న భారత సంతతికి చెందిన తొలి మహిళ ఆమె కావడం విశేషం. వనితా గుప్తా నియామకానికి ఏప్రిల్ 22 యూఎస్ సెనేట్ 51-49 ఓట్లతో ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ సెనేటర్ ఒకరు తమ శేగారీ వైఖరికి భిన్నంగా గుప్తాకు మద్దతిచ్చారు. దీంతో ప్రతిపాదనకు 51 మంది సెనేటర్ల మద్దతు లభించిన ట్లయింది. వనితా గుప్తాకు అమెరికా అధ్యక్షుడు జో -బైడెన్ అభినందనలు తెలిపారు
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా న్యాయ విభాగం లో ఉత్తమ పదవిలో అసోసియేట్ అటార్నీ జన రల్ వనితా గుప్తా ఎంపిక
ఎవరు: వనితా గుప్తా
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: ఏప్రిల్ 22
నాస్కాం చైర్ పర్సన్ గా రేఖా మీనన్ నియామకం :

ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ 2021-22 సంవత్సరానికి చైర్పర్సన్. అసెంచర్ ఇండియా సీని యర్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖ మేనన్‌ను నియమించింది. నాస్కామ్ 30 ఏళ్ల చరిత్రలో ఛైర్పర్సన్ భాద్యతలు చేపట్టనున్న మొదటి మహిళ కావడం గమనార్హం. 2020-21 సంవత్సరానికి యూబీ ప్రవీణ్ రావు (ఇన్ఫోసిస్ సీఓఓ) గారి స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఇంతకు ముందు ఆమె నాస్కామ్ వైస్ ఛైర్పర్సన్ గా వ్యవ హరించారు. 2021-22 సంవత్సరానికి వైస్ ఛైర్ పర్సన్ గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పర్సన్ ప్రెసిడెంట్, హెడ్ (బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్) కృష్ణన్ రామానుజమ్ నియమితుల య్యారు. పరిశ్రమ డిజిటల్ ప్రయాణంలో నాస్ ‘ కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో కలిసి కొత్త నాయకత్వం కలిసి పనిచేయనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాస్కాం చైర్ పర్సన్ గా రేఖా మీనన్ నియామకం
ఎవరు: రేఖా మీనన్
ఎప్పుడు: ఏప్రిల్ 22
అరుణ గ్రహం పై కి తొలిసారిగా ఇంజేన్యునిటి అనే హెలికాప్టర్ ప్రయోగించిన నాసా :

నాసా యొక్క మార్స్ ఇటీవల ఒక హెలికాప్టర్ పంపి చరిత్ర సృష్టించింది. అతి చిన్న డ్రోన్ మరొక ప్రపంచానికి ప్రయాణించే మొదటి శక్తితో కూడిన క్రాఫ్ట్ అయినట్లు అంతరిక్ష సంస్థ అధికారులు ప్రకటించారు. తీవ్రమైన చలి, ప్రమాదకరమైన గాలి మరియు లోపభూయిష్ట విమాన సాఫ్ట్‌వేర్‌ను అధిగమించి గాలిలోకి 10 అడుగుల ఎత్తుకు ఎగిరింది. దీని యొక్క బరువు 1.8 కిలోలుగా ఉంది.కాగా ఇది ఇటీవల ప్రయోగించిన పర్సువరెన్స్ అనే రోవర్ ద్వారా పంపిన దానిలో ఈ హెలికాప్టర్ ను పంపించారు. అంతే కాకుండా అరుణ గ్రహంపైకి నాసా పంపిన ‘పెర్సెవరెన్స్’ మరో అద్భుతం సృష్టించింది చరిత్ర లోనే తొలిసారిగా మరో గ్రహంపై ఈ ఆరు చక్రాల రోవర్ ఆక్సిజన్ ను తయారు చేసింది. అక్కడ కొంత కార్బన్-డై-ఆక్సైడ్‌ను సేకరించిన పెర్సెవరెన్స్ దాని నుంచి ప్రాణవాయువును ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడించింది. “రోవర్ ముందుభాగం కుడి వైపున కారు బ్యాటరీ పరిమా లో పసిడి పెట్టి ఉంది. దీన్ని మెకానికల్ ట్రీగా పిలుస్తారు. ఇది కార్బన్-డై-ఆక్సైడ్‌ను తీసుకుని, విద్యుత్తు, రసాయనాల సాయంతో దాన్ని విడగొట్టింది. తద్వారా 5 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఇది సరిపోతుంది. ఈ మార్స్ ఆక్సి జన్ (మాక్సి). పసిడి పెట్టెలోనే నిక్షిప్తమై ఉంది. గంటకు 10 గ్రాముల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఇంజినీర్లు ఈ మెకానికల్ ట్రీను రూపొందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అరుణ గ్రహం పై కి తొలిసారిగా ఇంజేన్యునిటి అనే హెలికాప్టర్ ప్రయోగించిన నాసా
ఎవరు: నాసా
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: ఏప్రిల్ 22
భారత తరపున 68వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డు లో ఎక్కిన అర్జున్ కల్యాణ్ :

యువ చెస్ ఆటగాడు అర్జున్ కల్యాణ్ భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఏప్రిల్ 20 న అర్జున్ 2500 ఎలో రేటింగ్ ను అధిగమించాడు. సెర్బియాలో జరుగు తున్న రుజ్నా జోరా-3 జీఎం రౌండ్ రాబిన్ లీగ్ అయిదో రౌండ్లో డ్రాగన్ కోసిర్పై పైచేయి సాధించడంతో అర్జున్ కు విలువైన రేటింగ్ పాయింట్లు లభించాయి. “గతవారం జరిగిన టోర్నీలోనే జీఎం అవ్వాల్సింది. చివరి రౌండ్లో గెలవాల్సి ఉండగా ఒత్తిడి కారణంగా ఓటమి చవిచూశా. ఈ టోర్నీలో సత్తాచాటడంతో జీఎం హోదా లభించింది” అని అర్జున్ తెలిపాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత తరపున 68వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డు లో ఎక్కిన అర్జున్ కల్యాణ్
ఎవరు: అర్జున్ కల్యాణ్
ఎప్పుడు: ఏప్రిల్ 22
ప్రముఖ బెంగాలి కవి శశాంక్ ఘోష్ కన్నుమూత :

ప్రముఖ బెంగాలీ కవి శంఖా ఘోష్ ఏప్రిల్ 21 న తుది శ్వాస విడిచారు. ఘోష్ వయసు 89 సంవత్సరాలు మరియు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. గౌరవనీయమైన జ్ఞానపీట్ మరియు సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత అయిన శంఖా ఘోష్ కొంతకాలంగా వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. శంఖా ఘోష్ ఏప్రిల్ 14 న కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించారు. ఏప్రిల్ 20న ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఏప్రిల్ 22న ఆయన మరణించారు.శంఖా ఘోష్ జిబానంద దాస్ తరువాత బెంగాలీ కవుల యుగానికి చెందినవాడు. ఘోష్ డిల్లీ విశ్వవిద్యాలయం, అయోవా విశ్వవిద్యాలయం మరియు విశ్వ భారతిలో బోధనలో చాలా సంవత్సరాలు గా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ బెంగాలి కవి శశాంక్ ఘోష్ కన్నుమూత
ఎవరు: శశాంక్ ఘోష్
ఎక్కడ:పశ్చిమ బెంగాల్
ఎప్పుడు: ఏప్రిల్ 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |