
Daily Current Affairs in Telugu 03-01-2021
నైటింగేల్ ఫ్లోరెన్స్ అనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ పద్మజ :

నెల్లూర్ జిల్లా వాసి తడ మండలం మాంబట్టు కు చెందిన డాక్టర్ పద్మజ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్” అనే పురస్కారానికి ఎంపిక అయ్యింది.. ఆమె తిరుపతి స్విమ్స్ నర్సింగ్ కళాశాలలో ఆచార్యులుగా వైస్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ విద్యా రంగం లో ఆమె చేసిన విశేష సేవలకు గాను గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక అయింది. త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఓ వైపు విద్యా రంగంలో సేవలు అందిస్తూనే మరోవైపు ఆద్యాత్మిక కార్యక్రమాలు,అన్నదాత ట్రస్టు ను ఏర్పాటు చేస్తుంది.నర్సింగ్ రంగానికి ఉపయోగపడేలా ఊండ్ మేనేజ్ మెంట్ ఫర్ నర్సింగ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ చైల్డ్ హెల్త్ టెక్స్ట్ బుక్ ఆఫ్ నర్సింగ్ ప్రొసీజర్ తదితర పుస్తకాలను రచించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నైటింగేల్ ఫ్లోరెన్స్ అనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ పద్మజ
ఎవరు: డాక్టర్ పద్మజ
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: జనవరి 03
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిజె గా తొలి మహిళగా హిమా కోహ్లి నియామకం :

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి సారి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా (సిజె)గా జస్టిస్ హిమా కోహ్లి గారు నియమితులయ్యారు. దీనికి సంబందిచి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31ణ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సిజె గా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సిజె గా బదిలీ పై వెళ్లారు. హిమా కోహ్లి ఇంతక ముందు డిల్లీ హైకోర్టు లో సీనియర్ న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తించారు. ఈమె న్యాయ విద్యను ను న్యుడిల్లి లో పూర్తి చేసారు. 1984 లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయిన ఆమె 1999+-2004 మద్య డిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ న్యాయసలహ దారుగా హైకోర్ట్ స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలు అందించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిజె గా తొలి మహిళగా హిమా కోహ్లి నియామకం
ఎవరు: హిమా కోహ్లి
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు: జనవరి 03
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మోహపాత్ర కన్నుమూత :

లెజెండరీ ఓడియా సంగీతకారుడు, శాంతను మోహపాత్రా ఇటీవల కన్నుమూశారు. లతా మంగేష్కర్, మన్నాడే మరియు ఎండి రఫీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన మొట్టమొదటి ఒడియా సంగీత స్వరకర్త ఈయన. హిందీ, బెంగాలీ, అస్సామీ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి. మోహపాత్రా వందలాది ఒడియా చలనచిత్రాలు మరియు జాత్రా ( ఒపెరా) మూడు దశాబ్దాలుగా కొనసాగిన కెరీర్లోపనిచేసారు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన మోహపాత్రా, ఒడియా సంగీతానికి చేసిన కృషికి గాను ఒడిశా ఫిల్మ్ క్రిటిక్ అవార్డుతో సహా పలు అవార్డులను అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మోహపాత్ర కన్నుమూశారు
ఎవరు: శాంతను మోహపాత్ర
ఎప్పుడు: జనవరి 02
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత బుటా సింగ్ కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత బుటా సింగ్ (86) డిసెంబర్ 02న ఉదయం కన్నుమూసారు. మెదడు లో రక్త స్రావంతో గత ఏడాది అక్టోబర్ లో ఆయన కోమా లోకి వెళ్లారు. అప్పటి నుంచి డిల్లీలో ఎయిమ్స్ చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు. 1934లో పంజాబ్ లో జలందర్ జిల్లలో జన్మించిన బుటా సింగ్ సుదీర్గ కాలం పాటు రాజకీయాలలో కొనసాగారు. తొలుత అకాలీదళ్ లో ఉన్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ప్రసిద్ద దళిత నాయకుడిగా పేరుగడించారు. పంజాబ్ రాష్ట్రం,రాజస్తాన్ రాష్ట్రం నుంచి ఎనిమిది సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ, పివినరసింహ రావు ,వాజ్ పేయ్ ప్రభుత్వాలలో మంత్రిగా సేవలు అందించారు. కేంద్ర ఎస్సి కమిషన్ చైర్మన్ గా కూడా బిహార్ గవర్నర్ గా కూడా అయన సేవలు అందించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత బుటా సింగ్ కన్నుమూత
ఎవరు: బుటా సింగ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 03
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |