Daily Current Affairs in Telugu 01-01-2021
బ్రిటిష్ ఎంపైర్ ఓబిఈ పురస్కారంను దక్కించుకున్న డా.రఘురాం :
ప్రముఖ కేన్సర్ నిపుణులు కిమ్స్ ఉషా లక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్డాక్టర్ రఘురాం కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ ఎంపైర్ ఒబిఈ (ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ లెంట్ బ్రిటిష్ ఎంపైర్) పురస్కారాన్ని దక్కించుకున్నారు. కిమ్స్ ఆసుపత్రి వర్గాలు జనవరి 01న ఈ విషయాన్ని మీడియా వెల్లడించాయి. రొమ్ము కేన్సర్ లో ఆధునాతన చికిత్సలు విద్య పరిశోదనలు,ఇండియా-యుకె సంబందాలను మెరుగుపర్చడంతో పాటు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. గత పదేళ్ళ లో ఒక యువ సర్జన్ కు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి అని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బకింగ్ హం ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో క్వీన్ ఎలిజిబెత్-2 గారి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటిష్ ఎంపైర్ ఓబిఈ పురస్కారం దక్కించుకున్న డా.రఘురాం
ఎవరు: డా.రఘురాం
ఎక్కడ: బ్రిటన్
ఎప్పుడు: జనవరి 01
ఐరాస భద్రత మండలి లో తాత్కాలిక సబ్య దేశ పదవిని ప్రారంబించిన భారత్:
ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన రెండేళ్ళ పదవి కాలాన్ని (2021-2022) జనవరి 01 నుంచి ప్రారంబించింది. ప్రపంచ శాంతి భద్రత లను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలి లో భారత్ కు చోటు దక్కడం ఇది ఎనిమిదో సారి. 15దేశాల బద్రత మండలి లో అమెరికా,రష్యా,చైనా,బ్రిటన్,ఫ్రాన్స్,శాశ్వత సభ్య దేశాలు. కాగా తాత్కాలిక సభ్య దేశంగా ఎస్తోనియ,నైజర్,సెయింట్ విన్సెంట్ గ్రైనైడేన్స్,ట్యునీషియ ,వియత్నాం కొనసాగుతున్నాయి. జనవరి 01నుంచి భారత్ ,మెక్సికో,ఐర్లాండ్,నార్వే,కెన్యా,దేశాలు కొత్తగా చేరాయి. తాత్కాలిక సభ్య దేశాల జాబితా కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ 184 ఓట్లు భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. 2021 ఆగస్టులో నెలలో 2022 మరో నెల పాటు భద్రత మండలి అద్యక్ష పదవి కాలం లోభారత్ కొనసాగనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐరాస భద్రత మండలి లో తాత్కాలిక సబ్య దేశ పదవిని ప్రారంబించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: జనవరి 01
జాతీయ గీతానికి సవరణ చేసిన ఆస్ట్రేలియా దేశం :
దేశ ఐక్యత స్పూర్తిని చాటి చెప్పేలా దేశానికి ఉన్న సుదీర్గ చరిత్రను ప్రతిబింబించేలా ఆస్ట్రేలియా తమ జాతీయ గీతం లో సవరణ చేసింది.సాహిత్యం లో ఒక్క పదాన్ని మార్చింది. “ఫర్ వుయ్ ఆర్ యంగ్ అండ్ ఫ్రీ” అనే పంక్తి లో యంగ్ స్థానంలో వన్ అనే పదాన్ని చేర్చింది. ఈ విషయాన్నీ ప్రదాని స్కాట్ మారిసన్ నూతన సంవత్సర వేడుకలో తెలిపారు. గడిచిన ఏడాది లో ఆస్త్రేలియన్ లు మరోసారి తమ ఐక్యతను ప్రదర్శించి ఆస్త్రేలియన్ ను మరో సారి తమ ఐక్యత ప్రదర్శించి దేశాన్ని గెలిపించారు. ఆ ఐక్యత స్పూర్తిని మన జాతీయ గీతంలో ప్రతిబింబించేలా చేయాలనీ నిర్ణయించాం అని అన్నారు. కాగా 1984 లో ఈ జాతీయ గీతం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన తొలి మార్పు ఇదే .
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ గీతానికి సవరణ చేసిన ఆస్ట్రేలియా దేశం
ఎవరు: ఆస్ట్రేలియా దేశం
ఎక్కడ: ఆస్ట్రేలియా దేశం
ఎప్పుడు: జనవరి 01
రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా సునిత్ శర్మ నియామకం :
రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా,సియివో గా సునిత్ శర్మ డిసెంబర్ 31న నియమితులయ్యారు .ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వినోద్ కుమార్ యాదవ్ పదవి కాలం డిసెంబర్ 31న ముగియడంతో కేంద్ర నియమకాల కేబినేట్ కమిటీ ఆ స్థానంలో సునిత్ శర్మ ను నియమించారు. ప్రస్తుతం ఈయన ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ గా ఉన్నారు. రాయ్ బరేలి లో అత్యాదునిక రైలు బొగిల తయారీ కేంద్రం లో జనరల్ మేనేజర్ గా పని చేసారు. వారణాసి లో ని డిజిల్ లోకోమోటివ్ గా పని చేసినపుడు డిజిల్ ఇంజిన్ల విద్యుత్ ఇంజిన్ల మార్పు చేయడం లో కీలక పాత్ర పోషించి భారతీయ రైల్వే 100 % విద్యుతికరణ దిశగా పయనించడంలో తన వంతు సాయం చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా సునిత్ శర్మ నియామకం
ఎవరు: సునిత్ శర్మ
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 01
సియాచిన్ రక్షకుడు కర్నాల్ నరేంద్ర కుమార్ కన్నుమూత :
సియాచిన్ హిమని నదాల ను రక్షించుకోవడం కు భారత్ సైన్యానికి సహకరించిన మాజీ సైన్యదికారి కర్నల్ నరేంద్ర కుమార్ (87) అనారోగ్యం తో డిసెంబర్ 31న తుదిశ్వాస విడిచారు. సమర్థ పర్వతారోహకుడిగా గుర్తింపు పొందిన కుమార్ ని కీర్తి చక్ర,పద్మ శ్రీ,అర్జున అవార్డు లతో పాటు ప్రతిష్టాత్మక మెక్ గ్రేగర్ మోడల్ వరించాయి. 1970వ దశకం తుదినాల్ల నుంచి 1980వ దశకం తొలి నాళ్ళలో ఆయన సియాచిన్ ప్రాంతంలో ఎన్నో సాహస యాత్రలు చేసారు. ఆయన అందించిన నివేదికల ఆదారం గానే ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి సియాచిన్ ను భారత సైన్యం తన అధినంలోకి తీసుకుంది. సియాచిన్ తమ దేశంలో కలుపుకోవాలన్న పాకిస్తాన్ ప్రణాలికలను భారత సైన్యాలకు వివరించింది కూడా ఈ పర్వతరోహకుడే. ఈయన నందా దేవి పర్వతం ఎక్కిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించారు. 1981 లో అంటార్కిటికా కార్యాదళంలో సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సియాచిన్ రక్షకుడు కర్నాల్ నరేంద్ర కుమార్ కన్నుమూత
ఎవరు: నరేంద్ర కుమార్
ఎప్పుడు: జనవరి 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |