
Daily Current Affairs in Telugu 30-12-2020
ట్రై హైదరాబాద్ అద్యక్షుడిగా మనోహర్ రెడ్డి నియామకం :

ది ఇండస్ఎంటర్ ప్రేన్యూర్స్ (ట్రై) హైదరాబాద్ విభాగం యొక్క కొత్త అద్క్షుడిగా ప్యుజియింక్ సంస్థ వ్యవస్థాపకుడు,సియివో మనోహర్ రెడ్డి గారు నియమితులయ్యారు. 2021 ఏడాదికి గాను అయన ఈ బాద్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు అద్యక్షుడిగా శ్రీదర్ పిన్నపు రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డి జనవరి 01న బాద్యతలు స్వీకరిస్తారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం వారికి పెట్టుబడులలో మెంటరింగ్,మార్కెటింగ్ ను పరిచయం చేయడం లాంటివి ట్రై నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ట్రై హైదరాబాద్ అద్యక్షుడిగా మనోహర్ రెడ్డి నియామకం
ఎవరు: మనోహర్ రెడ్డి
ఎప్పడు: డిసెంబర్ 30
ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పదవీకాలం మరో ఏడాదికి పొడగింపు :

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో ) చైర్మన్ డాక్టర్ శివన్ పదవి కాలం ను మరో ఏడాది పాటు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 30న కేంద్ర కేబినేట్ నియామక కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్ కటికితాల ఉత్తర్వులు జారీ చేసారు .శివన్ పదవి కాలం 2021 జనవరి 14వరకు ముగియనుంది. ఈ నేపద్యం లో ఆయనను మరో ఏడాది పాటు స్పేస్ రీసర్చ్ కమిషన్ సెక్రటరీగా, చైర్మన్ గా మరో ఏడాది పాటు నియమించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పదవీకాలం మరో ఏడాదికి పొడగింపు
ఎవరు: డాక్టర్ శివన్
ఎప్పడు: డిసెంబర్ 30
డిఆర్డివో నుంచి సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు సాధించిన హేమతను పాండే :

ల్యుకో డేర్మా చికిత్స కోసం ఉద్దేశించిన ప్రసిద్ద డ్రగ్ ను,ల్యుకో స్కిన్ తో పాటు మూలికా ఔషదంలను అబివృద్ది చేయడం లో ఆయన చేసిన కృషికిగాను సీనియర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ పాండే DRDO యొక్క “సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్” అవార్డు తో ఆయనను సత్కరించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక అవార్డు తో సర్టిఫికేట్ మరియు 2లక్షల నగడు పురస్కారం అందించారు. ఇప్పటి వరకు ఆయన ఆరు మూలికా ఔషదాలను అబివృద్ది చేసాడు. అందులో ల్యుకోస్కిన్ ల్యుకో డేర్మ లేదా బొల్లి చికిత్స ఉపయోగిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిఆర్డివో నుంచి సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు సాధించిన హేమతను పాండే
ఎవరు: హేమతను పాండే
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పడు: డిసెంబర్ 30
భారత దేశం నుండి స్వదేషి న్యుమోనియా వ్యాక్సిన్ న్యుమోసిల్ ను విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్ :

కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి అయిన డాక్టర్ హర్షవర్దన్ సింగ్ న్యుమోనియా కు వ్యతిరేఖంగా భారతదేశం యొక్క తొలిసారి స్వదేశియంగా అబివృద్ది చేసిన వ్యాక్సిన్ ను విడుదల చేసారు.న్యుమోసిల్ అనే న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పిసివి) ను పూనే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఐ ) బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు సీటెల్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ లాభాపేక్షలేని ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ సహకారం తో ఈ వ్యాక్సిన్ ను అబివృద్ది చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత దేశం నుండి స్వదేషి న్యుమోనియా వ్యాక్సిన్ న్యుమోసిల్ ను విడుదల చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
ఎవరు: హర్షవర్దన్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పడు: డిసెంబర్ 30
ములాంగ్ మెడల్ అందుకున్న తొలి భారత ప్లేయర్ గా నిలిచిన రహనే :

మెల్ బోర్న్ లో జరిగే బాక్సింగ్ డే టెస్టు లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు మాజీ క్రికెటర్ ఆయన జాని ములంగ్ పేరిట ఒక మెడల్ ను అందించాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల నిర్ణయించింది. అందులో బాగంగా భారత కెప్టెన్ రహనే ఈ మెడల్ ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. జాని ములంగ్ ఆస్ట్రేలియా కు చెందిన నల్ల జాతి క్రికెటర్ యురోపియన్ ఆస్ట్రేలియా కు వచ్చిన సమయం లో నివసించిన స్థానిక తెగలకు చెందిన వ్యక్తి . తన కెరీర్ లో ఏకైక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ములాగ్ 1868 లో ఇంగ్లాండ్ లో పర్యటించిన నల్లజాతి జట్టులో సభ్యుడు. సుదీర్గ కాలం పాటు నల్ల జాతి పై వివక్ష చూపారంటూ ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్లు పలువురు వ్యాఖ్యనించారు. దాంతో తాజాగా ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేం లో 55 వ్యక్తిగా ములాంగ్ కు చోటు కలిపించిన ఆసిస్ బోర్డు అతని పేరిట ఒక స్మారక పతాకం ఇవ్వాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ములాంగ్ మెడల్ అందుకున్న తొలి భారత ప్లేయర్ గా నిలిచిన రహనే
ఎవరు: రహనే
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పడు: డిసెంబర్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |