Daily Current Affairs in Telugu 26-12-2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కు దక్కిన జాతీయ అవార్డు :
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంవై-2019-20) పథకంలో బాగంగా ఇళ్ళ నిర్మాణం లో ఉత్తమ పని తీరు కనబరిచినందుకు గాను ఉత్తమ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో ఏపి కి జాతీయ స్తాయిలో మూడవ ర్యాంకు వచ్చింది. అలాగే ప్రాజెక్ట్ మానిటరింగ్ టూల్స్ ఇన్నోవేటివ్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ అవార్డు తో పాటు బెస్ట్ పెర్ఫార్మింగ్ మున్సిపల్ కార్పోరేషన్ గా విశాఖ పట్నం నగరం ఎంపిక అయింది. జనవరి 01 న ప్రదాని మోడీ అద్యక్షతన జరిగే విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ లకు మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలకు అధికారులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.ఈ ఏడాది కాలంగా జివిఎంసి పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.2018-19 లో స్వచ్చ సర్వేక్షన్ లో 23వ స్థానం లో నిలిచినా విశాఖ 2019-20 లో 14 స్థానాలు మెరుగుపరచుకుని 9వ ర్యాంకు సాధించింది. 2019 లో స్మార్ట్ సిటీ విభాగంలో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్ -2020 లో మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రకటించిన స్కోచ్ అవార్డులో ఎనర్జీ విభాగం లో స్మార్ట్ ప్రాజెక్ట్ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కు దక్కిన జాతీయ అవార్డు
ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 26
నవరత్నాలు పెదలందరికి ఇల్లు అనే కార్యక్రమ౦ ప్రారంబిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30.75లక్షల మందికి నివాస పట్టాలు అందజేయడం లో పాటు వచ్చే మూడేళ్ళ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేందుకుఉద్దేశించిన “నవరత్నాలు పేదలందరికీ ఇల్లు“ అనే ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంబించింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమగిరి లో వైఎస్సార్ జగన్నాన్ కాలని లేఅవుట్ లో డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై.ఎస్ జగన్ ఈ కార్యక్రమంను ప్రారంబించారు. దీనివల్ల కోటి 24 లక్షల మందికి మేలు చేకూరుతుంది. ఈ పథకం కింద రూ.50.940 రెండు దశల్లో ఇల్లు నిర్మిస్తారు. తొలిదశ లో 15.60 లక్షల ఇల్లు,రెండవ దశ లో 12.70 లక్షల ఇళ్ళ నిర్మాణం అవనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: నవరత్నాలు పెదలందరికి ఇల్లు కార్యక్రమ౦ ప్రారంబిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 26
ఆటల్ బీహారి వాచ్ పేయ్ “ఏ కమ్మో మొరేటివ్ వాల్యూం” అనే పుస్తకం విడుదల చేసిన ప్రదాని :
భారత మాజీ ప్రదాని ఆటల్ బిహారీ వాచ్ పేయ్ 96 వ జయంతి (డిసెంబర్ 25)న సందర్బంగా దేశ ప్రజలు ఆయన్ను స్మరించుకున్నారు.న్యుడిల్లి లో ఆయన సమాధి అయిన సదైవ్ ఆటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ గారు వాచ్ పేయ్ కి అంజలి అర్పించారు. పార్లమెంట్ లో సెంట్రల్ హాల్ లో డిసెంబర్ 25 న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదాని నరేంద్ర మోడి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా,కేంద్ర మంత్రులు,ఎంపి లు పాల్గోన్నారు.ఈ సమావేశం లో ఆటల్ బిహారి వాచ్ పేయ్ :”ఏ కమ్మో మొరేటివ్ వ్యాల్యుం” అనే ఒక పుస్తకాన్ని ప్రదాని గారు ఆవిష్కరించారు. లోక్ సభలో ఆటల్ బిహారి గారి ప్రసంగాలు మరియు అరుదైన ఫోటో లు అందులో పొందుపరచారు. కాగా అయన యొక్క జన్మదినోత్సవంను సుపరిపాలన దినోత్సవం గా జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆటల్ బీహారి వాచ్ పేయ్ ఏ కమ్మో మొరేటివ్ వాల్యూం అనే పుస్తకం విదుదల చేసిన ప్రదాని
ఎవరు: ప్రదాని నరేంద్ర ,మోడి
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: డిసెంబర్ 26
మధ్యప్రదేశ్ లో మత స్వేచ్చ బిల్లు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినేట్ :
వివాహం ద్వారా గాని లేదా ఇతర తప్పుడు పద్దతుల్లో మత మార్పిడికి పాల్పడం అడ్డుకునేందుకు ఉద్దేశించిన మత స్వేచ్చా (ఫ్రీడం ఆఫ్ రిలీజియన్) బిల్లు 2020 ని మధ్యప్రదేశ్ కేబినేట్ ఆమోదించింది అని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోట్టం మిశ్రా గారు వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే చట్టరూపం దాలిస్తే చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాపుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020 పోలి ఉంది. మధ్యప్రదేశ్ లో ఇది అమలులోకి వస్తే దేశంలోనే కటినకరమైన చట్టం అవుతుందని హోం మంత్రి తెలిపారు. ఈ చట్టం ఉల్లంగించిన వారు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష రూ.50,000 జరిమానాకి అర్హులు .మతమార్పిడి కి పాల్పడిన వ్యక్తి ఎస్సి.ఎస్టీ మైనర్ అయితే 2 నుంచి 10 ఏళ్ల జైలు రూ.50 వేల జరిమానా విధించవచ్చు .
క్విక్ రివ్యు :
ఏమిటి: మధ్యప్రదేశ్ లో మత స్వేచ్చ బిల్లు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినేట్
ఎవరు: మధ్యప్రదేశ్
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 26
ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెటర్,వ్యాఖ్యాత రాబిన్ జాక్ మన్ కన్నుమూత :
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్,వ్యాఖ్యాత రాబిన్ జాక్ మన్ కన్నుమూసారు. రాబిన్ వయసు 75ఏళ్ళు.2012 నుంచి అతడు గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్ తరపున నాలుగు టెస్టులు,పదిహేను వన్డేలు ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో 14వికెట్లు ,వన్డేల లో 19వికెట్లు పడగొట్టాడు. 1966-1992 మద్య కాలం లో 399ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన జాక్ మన్ 1402 వికెట్లు తీసారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక దక్షిణాఫ్రికా లో స్తిరపడిన ఆయన వ్యాఖ్యాత గా కూడా పని చేసాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెటర్ వ్యాఖ్యాత రాబిన్ జాక్ మన్ కన్నుమూత
ఎవరు: రాబిన్ జాక్
ఎక్కడ: ఇంగ్లాండ్
ఎప్పుడు: డిసెంబర్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |