Daily Current Affairs in Telugu 06-03-2021
ఇండియా-స్వీడన్ మద్య జరిగిన వర్చువల్ సమ్మిట్ 2021:
వర్చువల్ ఇండియా-స్వీడన్ సదస్సులో స్వీడన్ ప్రధాన మంత్రి స్టీఫన్ లోఫ్వెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేయడానికి మరియు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడానికి వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. ఇది 2015 నుండి ఇరువురు నాయకుల మధ్య ఐదవ పరస్పర నిర్వహించిన సమావేశం. భారతదేశం మరియు స్వీడన్ దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలు ప్రజాస్వామ్యం,చట్టపాలన,సమానత్వం,వాక్ స్వాతంత్య్రం మరియు మానవ హక్కులపై గౌరవం యొక్క భాగస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని నాయకులు తెలిపారు. అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఎ)లో చేరాలని స్వీడన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత మంత్రి మోడీ స్వాగతించారు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా-స్వీడన్ మద్య జరిగిన వర్చువల్ సమ్మిట్ 2021
ఎవరు: ఇండియా-స్వీడన్
ఎప్పుడు : మార్చి 06
బిహారీ పురస్కార్ 2020 ను గెలుచుకున్నమోహన కృష్ణ బోహారా :
2020 సంవత్సరానికి గాను 30వ బిహారీ పురస్కార్ హన కృష్ణ బోహారా గెలుచుకుంది. తను రాసిన హిందీ విమర్శ పుస్తకం, తస్లీమా:సంఘర్ష్ సరుర్ సాహిత్య పేరుతో ఉన్నఈ రచనకు అవార్డు ఇవ్వబడుతుంది. కె.కె.బిర్లాఫౌండేషన్ న్యూడిల్లిలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పుస్తకంను 2016లో ప్రచురించారు. బిహారీ పురస్కార్ తో రెండు లక్షల 50 వేల రూపాయల అవార్డు డబ్బు, ఒక మేమోంటో మరియు ఫలకాన్నిఇస్తారు. ఈ అవార్డు కె.కె. బిర్లాఫౌండేషన్ చే స్థాపించబడిన మూడు సాహిత్య పురస్కారాలలో ఇది ఒకటి. 1991లో బిర్లా ఫౌండేషన్ ప్రఖ్యాత హిందీ కవి బిహారీ పేరు మీద, ప్రతి సంవత్సరం హిందీ లేదా రాజస్థానీలో అత్యుత్తమ రచనలను చేసినందుకు ఈ అవార్డును అందజేస్తారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: బిహారీ పురస్కార్ 2020 ను గెలుచుకున్నమోహన కృష్ణ బోహారా
ఎవరు: మోహన కృష్ణ బోహారా
ఎప్పుడు : మార్చి 06
యు.ఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా లిజియా నోరోన్హా నియమకం :
ఐక్యరాజ్యసమితి చీఫ్ గా ఆంటోనియో గుటెర్రెస్ ప్రముఖ భారత ఆర్థికవేత్త లిజియా నోరోన్హాను అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణకార్యక్రమం(యుఎన్‌ఇపి) యొక్క న్యూయార్క్ కార్యాలయ అధిపతిగా నియమించారు.యుఎన్‌ఇపిలో చేరడానికి ముందు,నోరోన్హా న్యూడిల్లీలోని దిఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రీసెర్చ్ కోఆర్డినేషన్)గా మరియు వనరులు, నియంత్రణ మరియు గ్లోబల్ సెక్యూరిటీస్ పై డివిజన్ డైరెక్టర్‌గా పనిచేశారు.
- ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కార్యాలయం: నైరోబి, కెన్యా
- యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్: ఇంగెర్ ఆండర్సన్
క్విక్ రివ్యు :
ఏమిటి: యు.ఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా లిజియా నోరోన్హా నియమకం
ఎవరు: లిజియా నోరోన్హా
ఎప్పుడు : మార్చి 06
SFDR సాంకేతికత గల విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDO సంస్థ :
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.వో) ఒడిశా తీరానికి దూరంగా ఉన్నచండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) సాంకేతిక పరిజ్ఞానం యొక్క విమాన పరీక్షను విజయవంత౦గా నిర్వహించింది. SFDR సాంకేతికతను డి.ఆర్.డి.వో సంస్థ సాంకేతిక ప్రయోజనంను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది. డి.ఆర్.డి.వో 2017లో మొదట SFDR ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది మరియు 2018 మరియు 2019 లో కూడా విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది. SFDR అనేది క్షిపణి చోదక వ్యవస్థ, దీనిని ప్రధానంగా హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) మరియు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) లు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: SFDR సాంకేతికత గల విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDO సంస్థ
ఎవరు: DRDO సంస్థ
ఎక్కడ: ఒడిశా తీరానికి దూరంగా ఉన్నచండీపూర్‌లో
ఎప్పుడు : మార్చి 06
భారత్ అథ్లెటిక్స్ కోచ్ నికోలాయ్ కన్నుమూత :
భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికోలాయ్ స్నేసరేవ్ మార్చి 05న అనూహ్య పరిస్థితులలో మరణించారు. బెలారస్ కు చెందిన 72ఏళ్ల స్నేసరేవ్ పాటియాలాలోని (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్)ఎన్.ఐఎస్ లోని తన హాస్టల్ యొక్క గదిలో మరణించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. 3000 మీటర్ల స్తీపుల్ చేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్ కు అర్హత సాధించిన అవినాష్ సాబ్లె తో పాటు ఇతర మిడిల్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. కాగా ఈయన 2005లో తొలిసారిగా భారత కోచ్ స్నేసరేవ్ బాద్యతలు చేపట్టారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసారు. మళ్లి రెండేళ్ళ తరువాత అయన మళ్లి కోచ్ గా నియమించబడడంతో మర్చి 02వ తేదిన భారత్ కు వచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ అథ్లెటిక్స్ కోచ్ నికోలాయ్ కన్నుమూత
ఎవరు: నికోలాయ్
ఎప్పుడు : మార్చి 07
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |