
Daily Current Affairs in Telugu 05-02-2021
గూగుల్ క్లౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బిక్రం సింగ్ బేడి నియామకం :

గూగుల్ క్ల్లౌద్ తన ఇండియన్ బిజినెస్ కోసం మేనేజింగ్ డైరెక్టర్ గా బిక్రం సింగ్ బేడి ని నియమిస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్త్తుత మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం తో బేడి ఇటీవలే గూగుల్ యొక్క ఆసియా ఫిసిఫిక్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎద్గిన కరణ్ బాజ్వ తరువాత ఈయన నియామకం అవుతారు.ప్రస్తుతం గూగుల్ సంస్థ లో ఈ డైనమిక్ మార్కెట్ లో ప్రముఖ గూగుల్ క్లౌడ్ అమ్మకాలు మరియు కార్యకలాపాల సంబంధించిన వాటికీ బిక్రం సింగ్ బేడి గారు బాద్యత వహిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: గూగుల్ క్లౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బిక్రం సింగ్ బేడి నియామకం
ఎవరు: బిక్రం సింగ్ బేడి
ఎప్పుడు: ఫిబ్రవరి 05
భారత జాతీయ బద్రత మండలి నూతన చైర్మన్ గా ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం నియమకం :

కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ,ఎల్ అండ్ టి లిమిటెడ్ సంస్థ యొక్క నూతన సియివో గా మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్,ఎన్ సుబ్రమణ్యం గారిని జాతీయ బద్రత మండలి చైర్మన్ గా మూడు సంవత్సరాల కాలానికి నియమించింది.ఎల్ అండ్ టి యొక్క మౌలిక సదుపాయాలకు సంబంధించి దాని వ్యాపారానికి అనేక సంవత్సరాలు నాయకత్వం వహించిన వారిలో ఎస్.ఎన్ సుబ్రమణ్యం గారు ఒకరు. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ గా మరియు ప్రపంచం లోనే 14 వ అతి పెద్ద దిగా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత జాతీయ బద్రత మండలి నూతన చైర్మన్ గా ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం నియమకం
ఎవరు: ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 05
ధాన్యం సేకరణలో రెండవ స్థానం లో నిలిచిన తెలంగాణ రాష్ట్రం :

తెలంగాణ రాష్ట్రం 2019-20 ఖరీప్ కాలం లో ధాన్యం సేకరణలో దేశంలోనే రెండవ స్థానం లో నిలిచింది. కాగా పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానం లో నిలిచింది. కేంద్ర మంత్రి దాడారావ్ ఫెబ్రవరి 05 రాజ్యసభ కు సమర్పించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.ఆ సీజన్ లో పంజాబ్ రాష్ట్రం నుంచి 162.33 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించగా తెలంగాణ రాష్ట్రం నుంచి 111.26 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల ను సేకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ధాన్యం సేకరణలో రెండవ స్థానం లో నిలిచిన తెలంగాణ రాష్ట్రం
ఎవరు: పంజాబ్ రాష్ట్రం
ఎక్కడ : న్యుడిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 05
పిడుగు పాటు పై పరిశోదనకు దేశంలో తొలి సారిగా ఓడిశా లో ఏర్పాటు కానున్న ప్రయోగ వేదిక:

ఉరుములు మెరుపులు ఆకస్మిక వర్షాలు అపార నష్టం కలిగుస్తుంటాయి. ఈ విపట్లపై పరిశోదన కోసం దేశంలో తొలిసారిగా ఓడిశా లోని బాలేశ్వర్ లో ఓక ప్రయోగ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపిద్న్హి.దీన్ని భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖా ,రక్షణ పరిశోధనన ,అబివృద్ది సంస్థ (డిఆర్డివో) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ) భాగస్వామ్యం తో ఏర్పాటు చేయనున్నామని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.ఇందులో అనేక పరిశీలన నెట్ వర్కింగ్ పూర్తి స్థాయిలో అబ్జర్వేటరీ ,రాడార్ అటో స్టేషన్ ,మైక్రోవేవ్ రేడియో మీటర్ విండ్ ప్రోఫిలర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉండనున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: పిడుగు పాటు పై పరిశోదనకు దేశంలో తొలి సారిగా ఓడిశా లో ఏర్పాటు కానున్న ప్రయోగ వేదిక
ఎవరు: భారత వాతావరణ విభాగం (ఐఎండి)
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు: ఫిబ్రవరి 05
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి దక్కిన ప్రతిస్తాత్మక పురస్కారం :

ఏషియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ గ్యస్త్రో ఎంటలాజి (ఏఐజి) చైర్మన్ ప్రఖ్యాత జీర్ణ కోశ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి కి ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటేస్తినల్ ఎండో స్కోపి (ఏఎస్జిఈ))సంస్థ అత్యున్నత పురస్కారం ను ప్రకటించింది.అమెరికన్ గ్యాస్ట్రో స్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్ పేరిట జీర్ణ కోశ వ్యాధుల చికిత్సలో విశేష సేవలు అందించిన వారికీ ఈ అవార్డు కు ఎంపిక చేసారు.ఈ పురస్క్రాన్ని స్వీకరించడం అంతర్జాతీయంగా అరుదైన గౌరవంగా జీర్ణకోశ వైద్య నిపుణులు భావిస్తుంటారు.ఏండో స్కోపి విధానం లో అందిస్తున్న ఆధునాతన వైద్య సేవలు సాంకేతిక పరిజ్ఞానం,దీర్గ కాలం పరిశోదన సునిశిత బోదన పటిష్ట శిక్షణ ,విశిష్ట నైపుణ్యం నకు మార్గ దర్శకునిగా నిలిచినందుకు గాను గుర్తింపు గా డాక్టర్ రెడ్డి ఈ అవార్డుకు ఎంపిక చేసారని ఏఎస్జిఈ వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి దక్కిన ప్రతిస్తాత్మక పురస్కారం
ఎవరు: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: ఫిబ్రవరి 05
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |