Daily Current Affairs in Telugu 18-12-2020
2020సంవత్సరానికి గాను ఫిఫా ఉత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్న రాబర్ట్ లెవెన్ దోస్కి :

ఈ ఏడాది 2020సంవత్సరానికి గాను ఫిఫా ఉత్తమ పుట్ బాల్ ఆటగాడి అవార్డు ను రాబర్ట్ లెవెన్ దోస్కి (పోలెండ్) గెలుచుకున్నాడు.ఈ సీజన్ లో జర్మని క్లబ్ బారెన్ మ్యునిక్ తరపున 55 గోల్స్ కొట్టిన రాబర్ట్ ఈ సారి ఫిఫా కుదించిన తుది ముగ్గురు ఉత్తమ ఆటగాళ్ళ జాబితాలో రోనాల్డో ,మెస్సి తో పాటు ఇతను కూడా చోటు సంపాదించాడు. అయితే ఈ దిగ్గజాలను పక్కకు నెట్టి లెవెన్ దోస్కి ఈ అవార్డును సాధించడం విశేషం .ఈ ఓటింగ్ జాతీయ జట్ల పట్ల కెప్టెన్ లు కోచ్ లు ఎంపిక చేసిన జర్నలిస్ట్ లు అబిమానులు ద్వారా జరిగింది. మెస్సి ,రోనాల్డో కాకుండా గత 13ఏళ్లలో లూకా మోద్రిచ్ (క్రొయేషియా),రాబర్ట్ మాత్రమే ఈ అవార్డ్ గెలుచుకున్నారు. ఉత్తమ మహిళల పుట్ బాల్ క్రీడాకారినిగా లూసి బ్రోంజ్ (ఇంగ్లాండ్ ) ఎంపిక అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2020సంవత్సరానికి గాను ఫిఫా ఉత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్న రాబర్ట్ లెవెన్ దోస్కి
ఎవరు: రాబర్ట్ లెవెన్ దోస్కి
ఎప్పుడు: డిసెంబర్ 18
టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ రతన్ టాటా కు దక్కిన గౌరవ పురస్కారం :

టాటా గ్రూప్ గౌరవ చ చైర్మన్ రతన్ టాటా కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.ఫెడరేషన్ ఆఫ్ ఇండో ఇజ్రాయిల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన ఇంటర్ నేషనల్ చాప్టర్ ను దుబాయ్ లో ప్రారంబం చేయనున్నారు.ఈ కార్యక్రమం లో గ్లోబల్ విజినరి ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డు తో రతన్ టాటా ను గౌరవించ నున్నారు. ఈ వర్చువల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో ఇజ్రాయిల్,ఇండియా ,యుఎఈ లకు చెందిన సీనియర్ అధికారులు సైతం పాల్గొంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ రతన్ టాటా కు దక్కిన గౌరవ పురస్కారం
ఎవరు: రతన్ టాటా
ఎప్పుడు: డిసెంబర్ 18
ఆసియా క్రీడల లోను మోడల్ ఈవెంట్ గా బ్రేక్ డ్యాన్స్ చేర్పు :

ఇటీవల ఒలింపిక్ కమిటీ కూడా బ్రేక్ డ్యాన్స్ ను ఒక క్రీడగా ప్రకటించింది. చైనా లోని హంగ్జౌ నగరం ఆతిథ్యం ఇస్తున్న 2022 ఆసియా క్రీడల లోను బ్రేక్ డ్యాన్స్ ను మోడల్ ఈవెంట్ గా చేర్చారు. 2024 పారిస్ ఒలింపిక్స్ లోను బ్రేక్ డ్యాన్స్ ను మోడల్ ఈవెంట్ గా ఖరారు చేస్తూ ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు హంగ్జౌ ఆసియా క్రీడలలో ఈ-స్టోర్స్ (ఎలక్ట్రానిక్ క్రీడలు ) కూడా మోడల్ ఈవెంట్ గా మారింది. ఈ స్పోర్ట్స్ ఆసియా క్రీడలకు కొత్తకాదు. 2007మకావు లో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడ లలో తొలిసారిగా మోడల్ ఈవెంట్ గా ఆడించారు. గత ఆసియా క్రీడలలో ఇండోనేషియా )కూడా ఈ స్పోర్ట్స్ ఉన్నపటికీ ఓవరాల్ పథకాల పట్టికలో వాటిని పరిగనించలేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియా క్రీడల లోను మోడల్ ఈవెంట్ గా బ్రేక్ డ్యాన్స్ చేర్పు
ఎక్కడ: ఆసియా క్రీడలలో
ఎప్పుడు: డిసెంబర్ 18
శ్వేత సౌద ప్రెస్ కార్యదర్శిగా మరో భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్ ఎన్నిక :

అమెరికాలోని వచ్చే నెలలో కొలువు తీరనున్న జో బైడెన్ ప్రభుత్వం లో మరో భారతీయుడు అమెరికన్ కీలక బాద్యతలు చేపట్టనున్నారు.శ్వేత సౌద సహాయ ప్రెస్ కార్యదర్శిగా వేదాంత్ పటేల్ ను బైడెన్ ఎంచుకున్నారు.వేదాంత్ గతం లో భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యురాలు ప్రమీల జయపాల్ కు కమ్యునికేషన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : శ్వేత సౌద ప్రెస్ కార్యదర్శిగా మరో భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్ ఎన్నిక
ఎవరు: వేదాంత్ పటేల్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: డిసెంబర్ 18
శ్రీలంక ప్రిమియర్ లీగ్ చాంపియన్ గా తొలి సీజన్ విన్నర్ గా జాప్నా స్టా లియాన్ జట్టు :

2020 సంవత్సరం లో నిర్వహించిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎల్ పిఎల్) తొలి సీజన్ చాంపియన్ గా జాప్నా స్టాలియన్ టీం నిలిచింది. శ్రీలంక లోని హంబన్ తోటా లో డిసెంబర్ 17న గాల్గే గ్లాడియేటర్స్ జట్టు తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జాప్నా టీం 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ గెలుచుకున్న జాప్నా స్టాలియన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు గాను 188పరుగులు చేసింది. తరువాత లక్ష్య చేదనలో జాప్నా జట్టు 20 ఓవర్లకు 189పరుగులకు గాను 135 పరుగులు చేసి ఓడిపోయింది. జాప్నా స్టాలియన్స్ బ్యాట్స్ మెన్ వనిందు హసరంగ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : శ్రీలంక ప్రిమియర్ లీగ్ చాంపియన్ గా తొలి సీజన్ విన్నర్ గా జాప్నా స్టాలియాన్ జట్టు
ఎవరు: జాప్నా స్టాలియాన్
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: డిసెంబర్ 18
అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం గా డిసెంబర్ 18:

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వలసలు మరియు ఆ వలసదారుల యొక్క శరనార్తుల,యొక్క రక్షణ గురించి అవగాహన పెంచడానికి డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవ౦గా జరుపుకుంటారు. ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఒక అంతర్జాతీయ సమాజాన్ని కలిసి వచ్చి సురక్షితంగా నౌకాశ్రయం చేరుకునేటపుడు ప్రాణాలు కోల్పోయిన వలస దారుల మరియు శరనార్డుల ను గుర్తుంచుకోవాలని పిలిపునిస్తుంది. ఈ 2020సంవత్సరం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం థీం గా” రీ ఇమజింగ్ హ్యూమన్ మొబిలిటీ “. ప్రపంచవ్యాప్తంగా వలస సంక్షోభం యొక్క తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా కోవిడ్ -19 మహమ్మారి ద్వారా బహిర్గతమైంది
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం గా డిసెంబర్ 18
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎక్కడ: ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్
ఎప్పుడు : : డిసెంబర్ 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |