
Daily Current Affairs in Telugu 01-12-2020
చంద్రుడి పైకి విజయవంతగా దిగిన వ్యోమనౌక చాంగే -5 వ్యోమనౌక :

చంద్రుడి నుంచి మట్టి రాళ్ళను సేకరించి భూమికి రప్పించేందుకు చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక నవంబర్ 01న విజయవంతంగా చంద్రుడి యొక్క ఉపరితలం పైకి దిగింది. ఎంపిక చేసిన ప్రాంతం లో అత్యంత కచ్చితత్వంతో అది కాలు మోపిందని చైనా ప్రబుత్వం ఒక ప్రకటన లో తెలిపింది. ఈప్రయోగం చైనా దేశ చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలన్నింటిని లోకి ఇది అత్యంత సంక్లిష్ట మైనది.చంద్రుడి మండలం పైకి మానవ సహిత యాత్రను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని చైనా ప్రభుత్వం భావిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: చంద్రుడి పైకి విజయవంతగా దిగిన వ్యోమనౌక చాంగే -5 వ్యోమనౌక
ఎవరు: చాంగే -5
ఎక్కడ:చైనా
ఎప్పుడు: డిసెంబెర్ 01
నౌకా దళ వెర్షన్ ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ :

తిరుగులేని అస్త్రం బ్రంహోస్ మరోసారి సత్తా చాటింది. ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి సంబందిచిన నౌక దళ వెర్షన్ ను భారత్ నవంబర్ 01 విజయవంతంగా పరీక్షించింది. తూర్పు లద్దక్ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపద్యంలో ఈ ప్రయోగానికి ప్రాదాన్యం ఏర్పడింది. బ్రమ్హోస్ క్షిపణి త్రివిద దళాల వరుసగా పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత నౌకా దళం ఈ పరిక్షను చేపట్టింది. బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ రన్ విజయ్ యుద్ద నౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. గరిష్ట దూరం దూసుకెళ్లిన ఈ అస్త్రం లక్ష్యంగా నిర్దేశించిన ఒక నిరుపయోగ నౌక ను అత్యంత కచ్చితత్వంతో చేదించింది.యుద్ద సంనద్దత ను పరిశీలించుకునే క్రమంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు నౌక దళం ప్రకటించింది. గత నెల నవంబర్ 24సైన్యం బ్రమ్హోస్ కు సంబంధించిన భూతల దాడి వెర్షన్ ను పరీక్షించింది. ఆరువారాల కిందట నౌకాదళం అరేబియా సముద్రంలో ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. భారత్,రష్యా, ఉమ్మడిగా రూపొందించిన బ్రమ్హోస్ ద్వని కన్నా మూడు రెట్లు వేగంతో దూసుకువేల్లుతుంది. ఈ అస్త్ర పరిధిని 290 కిలోమీటర్ల నుంచి 400కిలో మీటర్ల శాస్త్రవేత్తలు పెంచారు.దేనిని జలాంతర్గాములు ,యుద్దనౌకలు ,యుద్ద విమానాలు ,నేల నుంచి ప్రయోగించవచ్చు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నౌకా దళ వెర్షన్ ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: .బంగాళా ఖాతం లో
ఎప్పుడు: : డిసెంబెర్ 01
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గా డిసెంబర్ 01 :

ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ను డిసెంబర్ 01న జరుపుతారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు హెచ్ఐవి కి వ్యతిరేకంగా జరిగే పోరాటం లో ఐక్యంగా ఉండడాని గురించి ఈ రోజు తెలియజేస్తుంది. హెచ్ఐవి తో నివసించే ప్రజలకు మద్దతు ప్రకటించడానికి మరియు హెచ్ ఐవి గురించి అవగాహన పెంచడానికి ఈ మహమ్మారిని అంతం చేసే దిశగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 01న ఎయిడ్స్ దినోత్సంగా జరుపుకుంటారు. ఇది మొదట 1988 లో జరుపుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గా డిసెంబర్ 01
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: : డిసెంబెర్ 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |